BigTV English
Advertisement

Nindu Noorella Saavasam Serial Today October 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అంజు కోసం స్కూల్‌ కు వెళ్లిన మిస్సమ్మ – మిస్సమ్మను చూసి షాక్ అయిన రామ్మూర్తి

Nindu Noorella Saavasam Serial Today October 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అంజు కోసం స్కూల్‌ కు వెళ్లిన మిస్సమ్మ – మిస్సమ్మను చూసి షాక్ అయిన రామ్మూర్తి

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆ బాల్‌ ను నేను ఎలా పట్టుకోగలిగాను అంటూ ఆరు డౌటుగా గుప్తను అడుగుతుంది. గుప్త ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండిపోతాడు. తర్వాత మీ మనుషుల బతుకంతా అనుమానం మీదే ఉంటుంది అని వెళ్లోపోతూ తిరిగి వచ్చి క్షమించు బాలిక అంటూ నువ్వు చనిపోయావు కదా? అంటూ వెళ్లిపోతాడు. గుప్తను చూస్తుంటే ఏదో తేడాగా ఉందే అనుకుని ఆ విషయం ఏంటో నేనే కనిపెట్టాలి అనుకుంటుంది ఆరు.


స్కూల్‌ కు రెడీ అయి వచ్చిన అంజు మనోహరిని చూసి అమ్మా అని పిలుస్తుంది. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. ఒక్కసారిగా మనోహరికి గతం గుర్తుకు వస్తుంది. తన కూతురు పుట్టినప్పుడు. తనను ఆశ్రమంలో వదిలేసింది అన్ని గుర్తు చేసుకుంటుంది. ఇంతలో గతం నుంచి తేరుకున్న మనోహరి అంజును ఏం మాట్లాడుతున్నావు అంటూ అడుగుతుంది.  అంజు మాత్రం ఏంటమ్మా అలా చూస్తున్నావు. నేను నీ కూతురినే కదా? నేను అమ్మా అనకూడదా? అంటూ ప్రశ్నిస్తుంది. అది కాదు అంజు నన్నెందుకు అమ్మా అంటున్నావు. చెప్పు అంజు నన్నెందుక అమ్మా అని పిలిచావు అని మనోహరి ఎదురు ప్రశ్నిస్తుంది.

అంజు మిమ్మల్ని ఎవరు అన్నారు ఆంటీ పక్కకు జరగండి. అంటూ మనోహరి వెనక ఉన్న డైనింగ్‌ టేబుల్‌ సర్దుతున్న మిస్సమ్మ దగ్గరకు వెళ్తుంది. నేను అంటున్నది మా అమ్మని.. కాదు నా మిస్సమ్మని అని చెప్తుంది అంజు. అయితే ఇందాక అమ్మా అన్నది నన్నే కదా? అని అడుగుతుంది. దీంతో నిన్నెందుకు అంటాను ఆంటీ. అంటే ఆ అమ్మను అంటాను లేదంటే ఈ అమ్మను అంటాను. అమ్మా… అని చెప్పగానే మిస్సమ్మ ఎమోషనల్‌ గా చూస్తూ.. నేను అమ్మను ఏంటి? నేను మిస్సమ్మను కదా? అంటుంది. చూశావా? మిస్సమ్మలోనే అమ్మ ఉంది అంటూ లాజిక్‌ గా మాట్లాడుతుంది అంజు.


మిస్సమ్మ అంజును దగ్గరకు తీసుకుని ముద్దు ఇస్తుంది. ఇంతలో పైనుంచి వచ్చిన అమ్ము ఏంటి అంజు పదాలు విడదీసి.. నువ్వు మిస్సమ్మతో కలిసిపోవాలనుకుంటున్నావా? అని అడగుతుంది. అమ్మువాళ్లను చూసిన అంజు చా నా ప్లాన్‌ అంతా చెడగొట్టేలా ఉన్నారే అని మనసులో అనుకుంటుంది.  పిల్లలందరూ అంజును ఆటపట్టిస్తుంటే అమర్‌ వస్తాడు. అమర్‌ను చూసిన పిల్లలు సైలెంట్‌గా ఉంటారు. అమర్‌ తాను ఆఫీసుకు వెళ్తున్నానని మిస్సమ్మకు చెప్పి వెళ్లిపోతాడు.

తనకు జాబ్‌ కావాలని రామ్మూర్తి మళ్ళీ స్కూల్‌ లో ప్రిన్సిపాల్‌ దగ్గరకు వెళ్తాడు. ప్రిన్సిపాల్‌ మాత్రం రామ్మూర్తిని తిడుతుంది. ఇది స్కూల్‌ అనుకుంటున్నారా? లేక ధర్మసత్రం అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్లడానికి అంటూ తిడుతుంది. దీంతో రామ్మూర్తి  ప్రిన్సిపాల్‌ గారు పోయిన సారి ఒంట్లో బాగాలేకనే కదండి రాలేకపోయింది అని చెప్తాడు. అవునండి ముసలి వాళ్లు అయితే ఇలాగే ఒంట్లో జబ్బులు ఉంటాయి. మీ లాగా వచ్చే వాళ్లు వందల మంది ఉన్నారు రామ్మూర్తి.  మీ లాగా రోగిస్టి వాళ్లను తీసుకోవాల్సిన అవసరం నాకేంటి. అయినా డబ్బుల కోసం మోసం చేసి మరీ నీ కూతురుని అమరేంద్రకు భార్యను చేశావు కదా? అని తిట్టగానే…

రామ్మూర్తి కొంచెం కోపంగా ప్రిన్సిపాల్‌ ను మీకున్నా హోదాకి, స్థాయికి మీ నోటి నుంచి రావాల్సిన మాటలు కావు అవి. నేను మానవత్వం ఉన్నవాణ్ని . ఇప్పటికే నేను ఆయనకు చాలా రుణపడిపోయాను. అందుకే నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పని చేద్దామని అనుకుంటున్నాను అని చెప్తాడు. నేను స్కూల్‌ లోనే కాదు మీ ఇంటి దగ్గర కూడా పని చేస్తానని దయచేసి నాకు ఈ జాబ్‌ ఇవ్వండని అమర్‌ బతిమాలుతాడు. దీంతో ప్రిన్సిపాల్‌ సరేనని మరోసారి చెప్పకుండా మానేస్తే బాగోదని హెచ్చిరిస్తుంది. దీంతో రామ్మూర్తి ప్రిన్సిపాల్‌ కు కృతజ్ఞతలు చెప్పి మీ మేలు ఈ జన్మలో మర్చిపోను అంటాడు. అలాగే తాను మళ్లీ స్కూల్‌ లో పనికి కుదరినట్టు భాగీకి కానీ అమర్‌ కు కానీ చెప్పొద్దని అంటాడు.

జాబ్‌ ఇవ్వడమే కాక మళ్లీ అబద్దాలు కూడా చెప్పాలా అంటూ ప్రిన్సిపాల్‌ నిట్టూరుస్తూ.. సరే అంటుంది. రామ్మూర్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో అమ్ము వాళ్లను తీసుకుని స్కూల్‌ కు వచ్చిన మిస్సమ్మను దూరం నుంచి చూస్తాడు రామ్మూర్తి. మిస్సమ్మకు నిజం తెలుస్తుందేమోనని పక్కకు వెళ్లిపోతాడు. అయితే దగ్గరకు వచ్చిన మిస్సమ్మను రామ్మూర్తిని చూసి పలకరిస్తుంది. మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అడుగుతుంది. దీంతో రామ్మూర్తి పిల్లల్ని చూడటానికి వచ్చానని చెప్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Big tv Kissik Talks: సూసైడ్  ఆలోచన చేసిన ఢీ రాజు.. ఊపిరి ఆడలేదంటూ!

Sai Kiran: 46 ఏళ్ల వయసులో తండ్రి.. ఘనంగా నటి సీమంతం.. వీడియో షేర్‌ చేసిన హీరో!

Nindu Noorella Saavasam Serial Today November 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  బ్లాక్ మ్యాన్ గురించి నిజం తెలుసుకున్న మిస్సమ్మ 

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు భద్ర స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లో రచ్చ చేసిన శ్రీవల్లి..భాగ్యం దెబ్బకు ఆనందరావుకు షాక్..

Brahmamudi Serial Today November 8th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీని చంపాడని రాహుల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు    

Intinti Ramayanam Today Episode: మీనాక్షి పై అనుమానం.. నిజం తెలిసిపోతుందా..? చక్రధర్ కు టెన్షన్..

GudiGantalu Today episode: గిఫ్ట్ కొట్టేసేందుకు ప్రభావతి ప్లాన్..బాలుకు మీనా క్లాస్.. సుశీల కోసం మనోజ్ గిఫ్ట్..

Serial Actress : కెమెరా బాయ్ టు యాక్టర్.. అనిల్ జీవితంలో కష్టాలు.. ఫస్ట్ రెమ్యూనరేషన్..?

Big Stories

×