BigTV English

Nindu Noorella Saavasam Serial Today September 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని బయపెట్టిన అంజు – యముడి మాటలు విన్న ఆరు

Nindu Noorella Saavasam Serial Today September 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని బయపెట్టిన అంజు – యముడి మాటలు విన్న ఆరు

Nindu Noorella Saavasam Serial Today Episode:  అక్కలా నేను చనిపోయి ఉంటే ఎలా అంటూ మిస్సమ్మ ఎమోషన్‌ అవుతుంటే అమర్‌ వెంటనే మిస్సమ్మ నోటిని తన చేతితో మూసేస్తాడు. ఇంకోసారి ఇలా మాట్లాడొద్దని వారిస్తాడు. నీకేం కాదు. కాకూడదు. కానివ్వను ఈ ఇంటికి, నాకు నువ్వు ఎంత ఇంపార్టెంటో నీకు కూడా తెలియదు మిస్సమ్మ.. ఇవాళ జరిగిన దానికి నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు తెలుసు అంటాడు అమర్‌. దీంతో మిస్సమ్మ ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్లిపోతుంది.


అంతా గమనించిన ఆరు బాధపడుతుంది. గార్డెన్‌ లోకి వెళ్లి ఒక్కతే కూర్చుని ఆలోచిస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన గుప్త.. ఏమైందని అడుగుతాడు. ఎందుకు ఏడుస్తున్నావు.. నీ ఏడుపునకు కారణమైన వాళ్లవరో చెప్పు అంటూ వారిని ఇప్పుడే శిక్షిస్తాను అంటాడు. నాకు  అర్థం అయింది బాలిక నీ బాధకు ఆ మనోహరియే కదా కారణం అంటాడు.  మనోహరి కాదు గుప్తగారు. మా ఆయనే అని చెప్తుంది.

దీంతో గుప్త ఆశ్చర్యంగా  ఏమిటి నీ దుఃఖమునకు కారణం నీ పతిదేవుడా? అని అడుగుతాడు. అవును  గుప్తగారు. ఇవి కన్నీళ్లో..? ఆనంద బాష్పాలో..? తెలియడం లేదు అంటుంది. దీంతో గుప్త మరింత ఆశ్చర్యంగా  ఏమి మాట్లాడుతున్నావు బాలిక అసలు ఏమి జరిగినది. ఓహో నీ పతి దేవుడు ఆ బాలికకు దగ్గర అవుతున్నాడని బాధపడుతున్నావా? అని అడుగగానే.. అదే తెలియడం లేదు గుప్త గారు ఆయన మిస్సమ్మకు దగ్గర అయిన ప్రతిసారి నాకు జెలసి అనిపించేది.  కానీ ఈసారి ఎందుకో చాలా కొత్తగా అనిపించింది.


ఆయన మిస్సమ్మ మీద చూపిస్తున్న అభిమానం చూస్తుంటే నాకు ముచ్చటేసింది గుప్తగారు మిస్సమ్మ ఎంత అదృష్టవతురాలో అనిపించింది అంటూ ఆరు చెప్పడంతో గుప్త మీ ఇద్దరిది రక్తసంబంధం కాబట్టి నీకు అలా అనిపిస్తుంది బాలిక అని మనసులో అనుకుంటాడు. ఏమైనా కానీ పౌర్ణమి గడియలు రాగానే నేను నిన్ను ఎటులైనా మా లోకానికి తీసుకువెళ్తాను అనుకుంటాడు గుప్త.

మనోహరి ఆరు ఆత్మ గురించి ఆలోచిస్తుంది. ఇంతలో ఘోర, మనోహరికి  ఫోన్‌ చేస్తాడు. హలో ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఏంటి ఘోర మత్రాలు  చదివి చదివి నీకు మతి భ్రమించిందా? అని అడుతుంది  మనోహరి. దీంతో ఘోర లేదు మనోహరి నీలోన ఆత్మ ప్రవేశించిందేమోనని అలా అడిగాను అంటాడు. దీంతో  ఇంకా పౌర్ణమి  గడియలు మొదలైనట్టు లేదు. మొదలైతే నేను పెట్టిన భయానికి కచ్చితంగా అది  నా ఒంట్లోకి ప్రవేశింస్తుంది అంటుంది మనోహరి.

అయ్యో మనోహరి పౌర్ణమి గడియలు మొదలు అవ్వకపోవడం ఏంటి? మొదలై చాలా సేపు అయింది అని ఘోర చెప్తాడు. దీంతో ఆశ్చర్యంగా మనోహరి ఏంటి నిజమా? అంటే ఇప్పుడది ఎవరి ఒంట్లోకైనా ప్రవేశించింది అంటావా? అని డౌటుగా అడుగుతుంది. ఆ విషయం తెలుసుకోవాల్సింది నువ్వు. ముందు వెళ్లి అది కనిపెట్టు. ఒకవేశ వేరే వాళ్ల శరీరంలోకి ప్రవేశించి ఉంటే నీ ఒంట్లోకి వచ్చేలా చేసుకో.. అని చెప్తాడు ఘోర. సరే నేను తెలుసుకుంటాను. నువ్వైతే పూజకు రెడీ చేసుకో అని చెప్తుంది మనోహరి.

ఇంతలో అంజు జుట్టు విరబోసుకుని వచ్చి మనోహరి రూం డోర్‌ దగ్గర నిలబడి చూస్తుంది. కొంపదీసి అంజు లోపల దూరలేదు కదా దాని ఆత్మ అనుకుంటుంది మనోహరి. ఎవరు నువ్వు అంటూ అనుమానంగా అడుగుతుంది. దీంతో నేనా మహాత్మాగాంధీని అంటూ వెటకారంగా చెబుతూ నేను ఎవరు అని అడుగుతావేంటి ఆంటీ అని చెప్తుండగానే అమ్ము వచ్చి గుర్రుగా చూస్తూ డోర్ దగ్గర నిలబడి చూస్తుంది. అమ్మును చూసిన మనోహరి భయంగా వెనక్కి నడుస్తుంది. లోపలికి వచ్చిన అమ్మును స్కూల్‌ కు టైం అవుతుంది. త్వరగా రా అంటూ కోపంగా బయటకు తీసుకెళ్తుంది అమ్ము.

ఆరు ఆత్మ ఎవరిలో దూరింది. ఇప్పుడు ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటుంది మనోహరి. వెంటనే కిచెన్‌ లోకి వెళ్లి వంట చేస్తున్న మిస్సమ్మను ఆరు అని పిలుస్తుంది. దీంతో కోపంగా మిస్సమ్మ నీకైమైనా చిప్పు మిస్‌ అయ్యిందా? నా పేరు భాగీ.. భాగుమతి అంటుంది. నన్ను పట్టుకుని ఆరు అంటుంన్నావేంటి? అని ప్రశ్నిస్తుంది. వంట చేయడం చేత కాదు కానీ వచ్చి ప్రశ్నలు వేస్తుంది అంటూ మిస్సమ్మ కోపంగా చూస్తుంది. వెంటనే మనోహరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

గార్డెన్‌లో ఉన్న గుప్త ఆరు కోసం వెతుకుతుంటాడు. ఆరు ఎక్కడా కనిపించదు. ఇంతలో యముడు వచ్చి గుప్తను ఇంకా మన లోకానికి ఆ బాలికను తీసుకురాలేదని అడుగుతాడు. పౌర్ణమి గడియలు పౌర్ణమి గడియలు  ముగిసే లోపు ఆ బాలికను తీసుకుని  వస్తాను అని గుప్త చెప్తాడు. వెనక నుంచి ఆరు గుప్త మాటలు వింటుంది. ఆరు వినడం చూసిన గుప్త షాక్‌ అవుతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..అవే స్పెషల్…

Chhaava: సైలెంట్ గా టీవీల్లోకి రాబోతున్న రష్మిక ఛావా.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

Actress Harshitha: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బుల్లితెర నటి… బేబీ ఆన్ ద వే అంటూ!

Actress : ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత..

Intinti Ramayanam Today Episode: పార్వతి పై అక్షయ్ సీరియస్.. పల్లవికి మరో షాక్.. భరత్, ప్రణతి ల కొత్త కాపురం..

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించేసిన గుణ.. గుండెలు పగిలేలా ఏడ్చిన మీనా.. విడిపోతారా..?

Big Stories

×