Bigg Boss 8 Day 29 Promo 1.. బిగ్ బాస్ సీజన్ 8 అప్పుడే ఐదవ వారానికి చేరుకుంది. సోమవారం నామినేషన్ రచ్చ మొదలయ్యింది. ఐదవ వారం ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ మొదలవగా.. ఎవరికి వారు రీజన్స్ చెబుతూ మంటలో ఫోటోలు వేసేసి రచ్చ చేశారు. ముఖ్యంగా నా ఇష్టం.. నువ్వు ఎవరు చెప్పడానికి అన్న రేంజ్ లో నామినేషన్స్ చేయడం మనం చూడవచ్చు. తాజాగా 29వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమో ను కొద్దిసేపటి క్రితం విడుదల చేయగా.. ఈ ప్రోమో అభ్యంతం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బాడీ షేమింగ్ కామెంట్లు అంటూ నామినేషన్స్ తో రచ్చ చేస్తున్నారు కంటెస్టెంట్స్. మరి పూర్తి ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం..
నామినేషన్ రచ్చ షురూ..
ఈవారం నామినేషన్ ప్రక్రియలో ఎవరి ప్రయాణాన్ని ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నారో మంటల్లో విసిరేసి వారిని నామినేట్ చేయండి అంటూ బిగ్ బాస్ తెలిపారు. గెలవాలనే కోరిక మీలో ఎలా రగులుతోందో చూపించండి అంటూ తెలిపారు. నామినేషన్ లో భాగంగా మణికంఠ మొదట నైనికను నామినేట్ చేశాడు. అసలు నీ స్కిల్స్ ఎక్కడ నాకు కనిపించలేదు. నువ్వు ఆడినట్లు అసలే తెలియడం లేదు అంటూ తెలిపాడు. దీంతో నేను ఆడుతున్నప్పుడు నువ్వు చూడాలని లేదు.. అసలు నువ్వు చూస్తున్నావా లేదా నాకు తెలియదు అంటూ నైనిక కూడా విరుచుకుపడింది. మొత్తానికైతే నైనికని నామినేట్ చేస్తూ నైనిక ఫోటోను మంటల్లో విసిరేశాడు మణికంఠ.
బాడీ లాంగ్వేజ్ షేమింగ్ అంటూ గొడవ..
ఆ తర్వాత లాస్ట్ వీక్ గేమ్ లో క్లాన్ మెంబర్స్ నాగ మణికంఠ తనను తాను సాక్రిఫైజ్ చేసుకొని టీం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఇది నచ్చక సీత నాగమణికంఠను నామినేట్ చేసింది. గేమ్ ఆడకుండా చేయమంటే చేసేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నేను నా కోసం సాక్రిఫైజ్ చెయ్ అంటే నువ్వు ఎలిమినేట్ అయి వెళ్ళిపోతావా అంటూ కూడా ప్రశ్నించింది. ఇక దీంతో నాగమణికంఠ చెప్పే ప్రయత్నం చేయగా , అడుగు మీ క్లాన్ మెంబర్స్ ను.. నేనేం ఊరికే అనట్లేదు అంటూ ఆగ్రహం చెందింది సీత. అలా మణికంఠ ఫోటోని మంటల్లో వేసింది. అంతేకాదు నాగ మణికంఠను ఉద్దేశించి బాడీ లాంగ్వేజ్ తో అటు చెయ్యి తిప్పి , ఇటు చేయి తిప్పి కామెంట్ చేసింది సీత. దీనికి నాగమణికంఠ బాడీ లాంగ్వేజ్ తో షేమింగ్ చేస్తున్నావు అంటూ ఫైర్ అయ్యాడు.
నబీల్, నైనిక మధ్య మాటల యుద్ధం..
ఆ తర్వాత నైనిక నబీల్ ను నామినేట్ చేసింది. ఇద్దరి మధ్య కూడా కాసేపు వాగ్వాదం నడిచిందని చెప్పవచ్చు. ఆ తర్వాత మణికంఠ యష్మీ ని నామినేట్ చేశారు. ఇక నబీల్ నైనిక తో పక్కన కూర్చుంటున్న ఎవరితో కూడా మాట్లాడడం లేదు అంటూ నామినేట్ చేశాడు. ఇలా ఒకరికొకరు ఈ వారం నామినేట్ చేసుకున్నారు.