E-Paper
Advertisement

తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్.. ఎవరంటే?

తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్.. ఎవరంటే?
Advertisement

Jabardasth Comedian:పటాస్ (Patas), జబర్దస్త్ (Jabardasth) వంటి కామెడీ షోల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రవీణ్ (Praveen) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ప్రముఖ లేడీ కమెడియన్ ఫైమా(Faima ) తో నడిపిన లవ్ ట్రాక్ సోషల్ మీడియాలో భారీ వైరల్ గా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఫైమా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రవీణ్ అనే వ్యక్తితో గత ఎనిమిదేళ్లుగా తాను ప్రేమలో ఉన్నానని షాక్ ఇచ్చింది.

తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్..

దీంతో ప్రవీణ్ ఒంటరి అయిపోయారు అని అభిమానులు కూడా నిట్టూర్చారు. పైగా చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన ప్రవీణ్.. తన తండ్రి కూడా కోల్పోవడంతో అనాధ అయిపోయారు. దీంతో ఫైమా కూడా వదిలి వెళ్ళిపోయిందా అంటూ అభిమానులు ఎమోషనల్ అయ్యారు. దీనికి తోడు వీరిద్దరూ నిజంగానే ప్రేమలో పడి , విడిపోయినట్లు టిఆర్పి రేటింగ్ కోసం షో నిర్వహకులు కూడా పెద్ద ఎత్తున దీనిని రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు స్పందించి కేవలం స్నేహితులం మాత్రమే అని, షో కోసమే ఇలా చేసామంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే పటాస్ ప్రవీణ గత కొంతకాలంగా కడెం వంశిత అనే నటి , డాన్సర్ తో ప్రేమలో ఉన్న విషయాన్ని ఇటీవల మేలో కుటుంబ సభ్యులతో చెప్పి ఇరు కుటుంబాలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.ఇక పెళ్లి తర్వాత రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్ చేస్తూ యాక్టివ్ గా ఉన్నారు ఈ జంట. అయితే ఇప్పుడు ప్రవీణ్ కి అలా పెళ్లి జరిగిందో లేదో అప్పుడే తండ్రి కాబోతున్నాడు. తాను తల్లి కాబోతున్నట్లు కడెం వంశిత తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

వీడియోలో ఏముందంటే?

Advertisement

కడెం వంశిత షేర్ చేసిన వీడియోలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ చూపిస్తూ.. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది.తన భర్త ప్రవీణ్ కి కూడా కిట్ చూపించింది. దీంతో ప్రవీణ్ సంతోషంతో ఉప్పొంగిపోతూ ఆమెను హత్తుకొని ముద్దులు పెట్టారు. ఆమె తల్లికి కూడా ఈ విషయాన్ని చెప్పడంతో ఆమె కూడా ఆనందంతో వంశితను హత్తుకుంది . దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో నెటిజన్లు, టీవీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

also read:ఆ స్పీడ్ ఏంటి మేడం.. ఆశ్చర్యపరుస్తున్న అనసూయ లేటెస్ట్ వీడియో వైరల్!

ఒక కొత్త వ్యక్తి మా జీవితంలోకి కాబోతున్నారు..

Advertisement

ఇక ఈ వీడియోని వంశిత తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేస్తూ..” ఎట్టకేలకు ఒక కొత్త వ్యక్తి మా కుటుంబంలోకి యాడ్ కాబోతున్నారు. ఇంత గొప్ప జీవితాన్ని అందించినందుకు ధన్యవాదాలు దేవుడా.. ఇప్పుడు మేము తల్లిదండ్రులం కాబోతున్నాము ” అంటూ చిన్నారి అడుగుల ఎమోజిని ఆమె షేర్ చేస్తూ ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. మొత్తానికైతే ప్రవీణ్ తండ్రి కాబోతున్నారు అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×