E-Paper
Advertisement

Podarillu Today Episode : కేశవతో శైలు ప్రేమ .. నిజం చెప్పిన చక్రీ.. మహాకు షాక్ ఇవ్వనున్న భూషణ్..

Podarillu Today Episode : కేశవతో శైలు ప్రేమ .. నిజం చెప్పిన చక్రీ.. మహాకు షాక్ ఇవ్వనున్న భూషణ్..
Advertisement

Podarillu Episode May 17th : చక్రి అన్నయ్య ఎందుకు వాళ్ళ వదినను కూడా రావద్దు అని చెప్పి నిన్ను పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడింది అని కన్నా అడుగుతాడు. మాధవ్ కూడా అవునురా చక్రి ఎందుకు ఆవిడ నిన్ను పక్కకు తీసుకొని వెళ్లి ఏదో చెప్పింది అని అనగానే.. ఈ ఇంట్లో మహాలక్ష్మి ఉండడం ఇష్టం లేదు. ఇన్ని ఇబ్బందులు పడుతూ మహాలక్ష్మి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా అని తన ఫ్రెండ్ దగ్గరికి పంపించమని చెప్పింది. వదినకి లేని బాధ అక్కడ ఆవిడకి ఎందుకు అని కన్నా అంటాడు. ఏమో మహాలక్ష్మి నాకు దూరం అవుతుందేమో అని  చక్రి బాధపడిపోతూ ఉంటాడు. ఇక కన్నా మీ బుస్సు కోసం వెళ్తున్నావా అని చెప్పగానే కేశవాకు శైలు గురించి గుర్తుకు వస్తుంది. ఏంట్రా కొట్టుకుందాంరా అని కేశవ ను అడుగుతున్నా సరే అతను మాట్లాడకుండా వెళ్తాడు..

వదిన ఏమందో అంటూ మహా టెన్షన్..

చక్రిని పక్కకు వెలిసిన వదిన అసలు ఏమందో తెలియట్లేదు అని మహాలక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంటిని చూసిన తర్వాత వదిన అభిప్రాయం పూర్తిగా మారిపోయినట్టుంది. ఇప్పుడు చక్రిని అడగాలా వద్దా. దేని గురించి వదినా చక్రి కి పర్సనల్ గా తీసుకుని వెళ్లి చెప్పింది అని ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉంటుంది. అసలు చక్రి ని అడిగితే ఏమనుకుంటాడు అని మహాలక్ష్మి తమ్ముడు తానే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు వదిన ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే బాగుండేది కదా.. తన వల్ల ఇంట్లోనే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు అని మహాలక్ష్మి తనలో అనుకుంటుంది. అసలు ఈ టెన్షన్ నుంచి బయట పడాలి అంటే చక్రీకి వదిన ఏం చెప్పిందో తెలుసుకోవాలి అని మహాలక్ష్మి ఫిక్స్ అవుతుంది.

చక్రి ఫుల్ హ్యాపీ…

Advertisement

 అందరూ పడుకుని ఉండగా చక్రీ దగ్గరికి వచ్చిన మహాలక్ష్మి చక్రిని లేపుతుంది. అందరూ పడుకున్న తర్వాత నన్ను ఇలా ఒంటరిగా లేపుతుంది అంటే నా మీద ప్రేమ పుట్టిందో ఏంటో అని చక్రి చాలా సంతోష పడిపోతూ ఉంటాడు. అయినా మహాలక్ష్మి ఈ టైంలో నన్నెందుకు పిలిచింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మా వదిన నీతో ఏం మాట్లాడింది చెప్పు నాకు టెన్షన్ గా ఉంది అని మహాలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. మీ వదిన గారు నాకు ఏమీ చెప్పలేదండి మహాలక్ష్మి ఇక్కడ ఇబ్బందులు పడుతుంది కదా తన ఫ్రెండ్ ఇంటికి పంపించు అని చెప్పింది.. మా వదిన ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేది పెద్ది వల్ల కూడా చాలా ఫీల్ అయ్యారు అని మహాలక్ష్మి అంటుంది..

ఇంటర్వ్యూ కోసం మహా రెడీ..

ఇంటర్వ్యూ కోసమని మహాలక్ష్మి బాగా రెండు రోజుల నుంచి ప్రిపేర్ అవుతుంది. చక్రి తనని తీసుకుని ఇంటర్వ్యూ లోకేషన్ కి వెళ్ళాలని రెడీ అవుతుంటాడు. ఇక మహాలక్ష్మి ఇంటర్వ్యూ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే తను టెన్షన్ పడిపోతూ కనిపిస్తుంది. మీరేం టెన్షన్ పడకండి ఈ ఉద్యోగం కచ్చితంగా మీకు వస్తుంది అని చక్రి ధైర్యం చెప్తాడు. ఎలాగైనా సరే ఈ జాబ్ తను కొట్టేయాలి అని ధీమాగా ఉంటుంది మహాలక్ష్మి. కానీ లోపల భూషణ్ ఉండడమే అసలు గమనించదు.

మహా పై భూషణ్ రివేంజ్..

Advertisement

 బయట ఇంటర్వ్యూ జరుగుతుందని తెలుసుకున్న భూషణ్ అక్కడున్న క్యాండిడేట్స్ ని చూస్తాడు. ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకోవడం విని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ మహాలక్ష్మి కనిపించడంతో తనపై ఎలాగైనా సరే రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటాడు.. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా భూషణ్ నన్ను పెళ్లి దగ్గరికి తీసుకుని వెళ్లి చివరికి హ్యాండ్ ఇచ్చి వెళ్లిన అమ్మాయి ఇక్కడే ఉంది. ఎలాగైనా సరే ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవ్వకుండా నేను చూస్తాను అని భూషణ్ అనుకుంటాడు.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అతని ఫ్రెండ్ అడగని బయటికి వెళ్లి మహాలక్ష్మిని చూపిస్తాడు. మరి ఇవాళ ఇంటర్వ్యూ నేను చేస్తాను నువ్వు వెళ్లి ఇంట్లో పడుకొని నిద్రపో అనేసి భూషణ్ తన ఫ్రెండ్ ని ఇంటికి పంపిస్తాడు. మహాలక్ష్మి ఈ జాబ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. మరి మహాలక్ష్మి కోరికను భూషణ్ తీర్చకుండా అడ్డుపడతాడా లేదా అన్నది సోమవారం ఎపిసోడ్ లో చూడాలి..

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ టీఆర్పీ రేటింగ్.. ఏప్రిల్ హైలెట్ ఎపిసోడ్స్..

Related News

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×