E-Paper
Advertisement

అప్పుడు ఆయన.. ఇప్పుడు ఈయన, కేజ్రీవాల్ దారిలో సీఎం విజయ్, అసలు మేటరేంటి?

అప్పుడు ఆయన.. ఇప్పుడు ఈయన, కేజ్రీవాల్ దారిలో సీఎం విజయ్, అసలు మేటరేంటి?
Advertisement

Chennai: తమిళనాడు సీఎం విజయ్ హంగులు, ఆర్భాటాలు లేకుండా చూసుకుంటున్నారా? ముఖ్యమంత్రి చూసి ప్రజలు ప్రేరణ పొందేలా కొన్ని పనులు చేస్తున్నారా? చెన్నైలో ఆయన తీసుకొస్తున్న మార్పులు-చేర్పులు.. ఆనాటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తొలినాళ్లలో ఆ విధంగా వ్యవహారించారా? ఇప్పుడు సీఎం విజయ్ కూడా ఆయన దారిలో నడుస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

కేజ్రీవాల్ దారిలో సీఎం విజయ్, అసలు మేటరేంటి?

Advertisement

పాలకులు ఏం చేస్తే ప్రజలు అదే దారిలో నడుస్తారు. అందుకు ముందు పాలకులు అడుగులు వేస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ తన కాన్వాయ్‌లో వాహనాలు తగ్గించుకోవడం, ఈవీ వాహనాలను ప్రవేశం పెట్టడం జరుగుతోంది. ఈ ఉపోద్ఘాతం ఎందుకని అనుకుంటున్నారా? సీన్ కట్ చేస్తే..

తమిళనాడు సీఎం విజయ్ తనకంటూ కొత్త స్టయిల్‌ని అలవర్చుకుంటున్నారు. తాను ప్రజల మనిషి అనే విధంగా అడుగులు వేస్తున్నారు. ప్రజలే పాలకులు అన్న విధంగా వ్యవహారిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న పాలనలో తన మార్కు ఉండేలా చూసుకున్నారు విజయ. గతంలో తమిళనాడును పాలించిన నేతలకు భిన్నంగా వెళ్తున్నారు.

Advertisement

ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా సీఎం విజయ్ అడుగులు

సీఎం ఇంటి నుంచి ఆఫీసుకు, లేకుంటే పలు కార్యక్రమాలకు బయటకు వెళ్లినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీన్ని గమనించిన సీఎం విజయ్, వాహనాలను ఎక్కడికక్కడ ఆపటం వంటివాటికి చెక్ పెట్టారు. గంటలు తరబడి ప్రజలు ట్రాఫిక్ లో ఉండడం వల్ల అనుకున్న సమయానికి ప్రజలు విధులకు హాజరుకాలేదు. దీనికితోడు సెక్యూరిటీ సమస్య వెంటాడుతోంది.

ఈ నేపథ్యంలో చెన్నై సిటీ ట్రాఫిక్ పోలీసులతో సీఎం విజయ్ సమావేశం సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. ముఖ్యమంత్రి చెప్పనట్టుగా పోలీసులు అమలు చేయడంతో చాలావరకు ట్రాఫిక్ సమస్య తగ్గింది. నార్మల్‌గా చెన్నై రోడ్లు విశాలంగా ఉంటాయి. రెండు లేదా మూడు లైన్ల రహదారి ఉంటుంది.

సీఎం విజయ్ కాన్వాయ్ ఒక లైన్‌లో వెళ్తుంటే.. మిగతా రెండు లైన్లలో సాధారణ వాహనాలు వెళ్తున్నాయి. ఈ ఐడియాను అమలు చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయని అంటున్నారు పోలీసులు. దీనివల్ల ట్రాఫిక్ ఎక్కడ జామ్ అయ్యే అవకాశం లేదు. సీఎం విజయ్‌ ప్రభుత్వ ఉద్యోగిల మాదిరిగా ప్రతీరోజూ సచివాలయానికి వస్తున్నారు.

ALSO READ: సీఎం విజయ్‌తో వైఎస్ అనిల్‌రెడ్డి భేటీ, వైసీపీ నేతలు చెప్పింది నిజమేనా? 

ఉద్యోగుల మాదిరిగా పావు గంట ముందు సచివాలయానికి వస్తున్నారు ముఖ్యమంత్రి. వచ్చేటప్పుడు ఇంటి నుంచి మధ్యాహ్నం లంచ్‌ బాక్స్ తీసుకొస్తున్నారు. తన చాంబర్‌లో మధ్యా హ్నం భోజనం చేసి, విధులకు హాజరవుతున్నారు. దీనివల్ల ఆయిల్ ఆదా అవుతుందని అంటున్నారు. ‘ఒక్కడు’ సినిమాను సీఎం విజయ్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.

సీఎం విజయ్ వ్యవహారశైలిని చూసి పలువురు ఉద్యోగులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవడం మొదలు పెట్టారట. తమిళనాడులో ఏళ్ల నాటి సంప్రదాయానికి ఫుల్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్నట్లు.. ఢిల్లీలో తొలిసారి కేజ్రీవాల్ సీఎం అయినప్పుడు ఈ విధంగా చేసేవారు. సెక్యూరిటీని వదిలి తన కారులో సచివాలయానికి వెళ్లేవారు. మధ్యాహ్నం భోజనానికి సంబంధించి బాక్స్ తీసుకెళ్లేవారని గతంలో మీడియా పేర్కొంది. అనాడు కేజ్రీవాల్ అయితే, ఇప్పుడు సీఎం విజయ్ అని అంటున్నారు.

Related News

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×