E-Paper
Advertisement

Podarillu Madhav : ‘పొదరిల్లు’ మాధవ్ లవ్ స్టోరీ.. బాబు బాగా రొమాంటికే..

Podarillu Madhav : ‘పొదరిల్లు’ మాధవ్ లవ్ స్టోరీ.. బాబు బాగా రొమాంటికే..
Advertisement

Podarillu Madhav : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్స్లలో పొదరిల్లు ఒకటి.. గతేడాది చివరి నెలలో ప్రారంభమైన ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ సీరియల్స్ తో పోటీపడుతుంది. ప్రేక్షకులు ముందుకొచ్చిన అతికొద్ది రోజుల్లోనే సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోవడంతో జనాలు ఎక్కువగా తిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఏ సీరియల్లో రాని కథతో ఈ సీరియల్ వచ్చింది. డిఫరెంట్ జోనర్ లో వచ్చిన ఈ సీరియల్ జనాలని బాగా ఆకట్టుకుంటుంది.. ఇందులో మాధవ పాత్రలో నటించిన నటుడు జనాలని తన నటనతో మెప్పించేసాడు. అసలు పేరు అజయ్ సత్యనారాయణ. అజయ్ గౌడ అని కూడా కొందరు పిలుస్తూ ఉంటారు.. ఈయన కన్నడ నటుడు. అజయ్ లవ్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది.. నిజంగానే అజయ్ లవ్ స్టోరీ తో ఒక సినిమా తీయొచ్చు అని సోషల్ మీడియాలో కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆయన లవ్ స్టోరీ గురించి అలాగే వైఫ్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

అజయ్ లవ్ స్టోరీలో ట్విస్ట్ లు…

పొదిరిల్లు సీరియల్ లో పెద్ద అన్నయ్య పాత్రలో నటిస్తున్నాడు అజయ్ సత్యనారాయణ అలియాస్ అజయ్ గౌడ.. ఈయన ఒక కన్నడ నటుడు.. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్ సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. తెలుగులో ఈయన గతంలో నువ్వు నేను ప్రేమ అనే సీరియల్ లో నటించారు. ఆ సీరియలు జనాలని బాగా మెప్పించడంతో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన సీరియల్ పొదరిల్లు. ఇందులో మాధవ పాత్రలో నటిస్తూ జనాలని తను నటనతో కట్టిపడేస్తున్నాడు.. ఈయన రియల్ లైఫ్ విషయానికి వస్తే తన ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రమ్య వెంకటేష్.. వీళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత స్నేహితులు కాస్త ప్రేమికులు అయ్యారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఒక పాప కూడా ఉంది. అజయ్ అటు కన్నడ ఇటు తెలుగు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు..

Advertisement

Also Read :‘ఇంటింటి రామాయణం’ అవని ఆస్తులు.. హీరోయిన్ల కన్న ఎక్కువే…

అజయ్ రెమ్యూనరేషన్..?

బుల్లితెర నటులకు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతుంది. సీరియల్ లో నటిస్తున్న కన్నడ నటుల కైతే ఇక చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు వాళ్ళు సీరియస్లలో నటించేవారు ఇప్పుడు కన్నడ వాళ్ళు నటిస్తున్నారు అని ఇప్పటికే పలు వాదనలు వినిపిస్తున్నాయి.. అయినా కూడా తెలుగు డైరెక్టర్లు ఎక్కువగా కన్నడ వాళ్ళని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం స్టార్ మా లో దూసుకుపోతున్న కొత్త సీరియల్లలో పొదరిల్లు ఒకటి.. ఇందులో నలుగురు అన్నదమ్ములు ఉంటారు. అందులో మొదటి వాడు మాధవ్ ఆ పాత్రలో నటించింది అజయ్ సత్యనారాయణ.. ఈయన తెలుగులో నటించిన రెండో సీరియల్ ఇదే.. కన్నడ నటుడు అయినా కూడా తెలుగులో మంచిగా తన నటనతో అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈయన నటనకు ఇక్కడ జనాలు ఫిదా అవుతున్నారు.. ఈ సీరియల్ ద్వారా బాగా పాపులాటిని సంపాదించుకున్న అజయ్ ఇప్పుడు ఒక్కో సీరియల్కు 50 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఓ వార్త నెట్టింట వినిపిస్తుంది.. ఈ లెక్కన చూస్తే సీరియల్ 25 రోజులు వరకు షూటింగ్ ఉంటుంది. దాంతో అతని ఆస్తులు కూడా బాగానే ఉండొచ్చు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

Big Stories

Advertisement
×