E-Paper
Advertisement

Podarillu Today Episode : సంబంధం కోసం తాయారు ఇంటికి వెళ్లిన మహా..తాయారుకు దిమ్మతిరిగే షాక్.. అందరికి క్లాస్ పీకిన నారాయణ..

Podarillu Today Episode : సంబంధం కోసం తాయారు ఇంటికి వెళ్లిన మహా..తాయారుకు దిమ్మతిరిగే షాక్.. అందరికి క్లాస్ పీకిన నారాయణ..
Advertisement

Podarillu Today Episode April 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. అందరూ ఇక్కడే ఉన్నారు గాని పెద్ది ఎక్కడ కనిపించడం లేదు అని మహా అనుకుంటుంది.. బయటికి వెళ్లి చూడగానే గాయత్రి మాధవ్ ఇద్దరు మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది బావ అని గాయత్రి అనడంతో మాధవ్ బాధ పడిపోతాడు. మీ అమ్మ వల్ల మనిద్దరం కలవలేక పోతున్నాము అని ఇద్దరు కూడా బాధపడిపోతూ ఉంటారు. నా జీవితంలోకి వస్తే నాకన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు అని మాధవ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు అది చూసిన మహాలక్ష్మి బాధపడుతుంది.. నా తమ్ముళ్లు నా పెళ్లి కోసం ఎంత దూరమైనా వెళ్తారు కాబట్టి నేను బయట పెట్టడం లేదు అని మాధవ్ అంటాడు. ముగ్గురు అన్నదమ్ములని బయటికి తీసుకుని వెళ్లి మాధవ్ గాయత్రీల విషయాన్ని బయటపెడుతుంది మహా… మనం పోలీసులుకు చెప్పి ఉంటే బాగుండేది పోలీసులు వాళ్ళకి పెళ్లి చేసే వాళ్ళు కదా అనేసి మహాలక్ష్మి అంటుంది.. పెద్దికి ఎలాగైనా పెళ్లి చేయాలి అని మహా అంటుంది.. మాధవ్ గాయత్రీలకు ఎలాగైనా సరే దగ్గరుండి పెళ్లి చేయాలని మహా ఫిక్స్ అవుతుంది. అందరూ కలిసి సంబంధం మాట్లాడాలి అని అనుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సంబంధం మాట్లాడటానికి వెళ్లడటానికి మీ నాన్నగారిని ఒక మాట అడిగి వెళ్దాము పెద్ద మనిషి ఇంటికి ఉండగా మనం వెళ్తే ఏదైనా అనుకుంటారేమో అని మహాలక్ష్మి అంటుంది. కానీ నారాయణ మాత్రం వల్ల ఎలాంటి వాళ్ళు మీకు తెలియదా వాళ్ళ ఇంటికి వెళ్లి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళందరూ మాత్రం వాళ్ళింటికి పెళ్లి సంబంధం మాట్లాడటానికి అని పూలు పండ్లు తీసుకొని వెళ్తారు. వాళ్ళందరిని చూసిన తాయారు రెచ్చిపోయి తిడుతుంది.. మీరు మంచివాళ్ళు అనుకొని మీతో మాట్లాడడానికి వచ్చాను. కానీ మీరు ఇలా చేస్తారని అసలు అనుకోలేదు అని మహాలక్ష్మి కూడా అంటుంది.. నువ్వు మాట్లాడింది చాలు ఇకనుంచి వెళ్ళిపో అని తాయారు మహాలక్ష్మిని అవమానించేలా మాట్లాడుతుంది. మా వదినని ఇంకొక మాట అంటే అసలు ఊరుకునేదే లేదు అని కేశవ తాయారు పై కర్ర తీసుకొని వెళ్తాడు..

Advertisement

మా వదిన గురించి మాట్లాడే దమ్ము ధైర్యం నీకుందా అని కేశవ్ అంటాడు. పెళ్లి కుదిరిన అమ్మాయిని అడగడానికి ఇప్పుడు ఇంత రచ్చ చేస్తే గాయత్రి గురించి అందరూ తప్పుగా అనుకుంటారు. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని రమణయ్య అంటాడు.. నేను నా పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఎంతో కష్టంగా ఇంట్లో నుంచి బయటికి వచ్చి చక్రిని పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు నీ సొంత బావ మీద అంత ప్రేమను పెట్టుకొని ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నావు అని మహాలక్ష్మి అంటుంది. ఇక జీవితాంతం ఇలానే ఉండాలని అనుకుంటున్నావా అని గాయత్రితో మాట్లాడేసి అక్కడి నుంచి అందరూ వచ్చేస్తారు..

ఇక ఆ తర్వాత మాధవ్ కి ఒక వ్యక్తి వచ్చి గాయత్రి వాళ్ళ ఇంటిదగ్గర మీ తమ్ముళ్లు, మీకు మరదలు గొడవకి వచ్చారు అని చెప్పగానే మాధవ్ కంగారు పడుతూ ఇంటికి వచ్చేస్తాడు. ఇక నారాయణ వాళ్ళ నలుగురిని కడిగి పడేస్తాడు. మన తప్పు కాదు పెద్దోడు మనసులో అమ్మాయి లేదని నేను ఎన్ని రోజులు అనుకున్నానా నాకు తెలియదా ఏం చేయాలో అని నారాయణ అంటాడు.. అమ్మాయికి పెద్ది అంటే ఇష్టం ఉంది కానీ ఆ చీడపురుగు దగ్గరికి వెళ్లడం ఇష్టం లేక నేను ఆగాను అని నారాయణ అంటాడు.. వాళ్ల గురించి తెలిసి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లాలని ఎవరు అనుకుంటారు కానీ మీరు వెళ్లారు. మిమ్మల్ని బాగా మర్యాదగా చూసుకున్నారా…? అమ్మాయి కంటే తెలీదు మీకు తెలియదా అని నారాయణ అందరిని ఒక్కసారిగా కడిగి పడేస్తాడు.

Advertisement

నారాయణని కేశవ తిట్టబోతుంటే మహాలక్ష్మి ఆపుతుంది.. ఎందుకు ఆయనని అంతగా అంటున్నారు.. ఈ పెద్ద నాకు చక్రి అంటే ఇష్టం లేకపోయినా తప్పక పెళ్లి చేసుకున్నాను. కానీ నా కోసం మీరు అన్ని చేస్తున్నారు ఆయనను కూడా మీరు అర్థం చేసుకోవాలి అని మహా అంటుంది.. నేను విడాకులు తీసుకోవాలని అనుకున్న సరే.. నాకోసం యాదగిరిగుట్టకు వచ్చి తన లైఫ్ని రిస్కులు పెట్టాడు అలాంటి వ్యక్తి గురించి మీరు తప్పుగా మాట్లాడద్దు అని మహాలక్ష్మి అంటుంది. నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఆయన గురించి మీరు అర్థం చేసుకోవాలి అని మహాలక్ష్మి అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ్ ఏమైంది నాన్న ఏం జరిగింది అని అడుగుతాడు..

Also Read : పుట్టింటికి వెళ్లిన వల్లి.. నిజం చెప్పిన చందు.. పూజలో కూర్చున్న ప్రేమ, ధీరజ్..

అక్కడ జనాలందరూ వచ్చేయడంతో మాధవ్ లోపలికి రండి మాట్లాడదామని అంటాడు. లోపలికి వెళ్ళగానే ఏం జరిగింది అని మీరు అక్కడికి వెళ్లారు. మన మీద పగ తీర్చుకోడానికి వాళ్ళు ఎన్ని చేస్తున్న కూడా మీరు ఎందుకు అక్కడికి వెళ్లారు అని అందరిని మాధవ తిడతాడు. చిన్నప్పటి నుంచి మీకు ఏ విషయం తెలియదా? వాళ్ల గురించి అన్ని తెలిసి కూడా మీరు ఎలా వెళ్లారు అని మాధవ్ అందరినీ తిడతాడు. అసలు నా గురించి పెళ్లి సంబంధం అడగడానికి మీరెవరు అని అనగానే మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. బాధపడుతున్న మాధవ్ దగ్గరకు మహా వస్తుంది. తన బాధను మహా చూసి షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×