E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: పుట్టింటికి వెళ్లిన వల్లి.. నిజం చెప్పిన చందు.. పూజలో కూర్చున్న ప్రేమ, ధీరజ్..

Illu Illalu Pillalu Today Episode: పుట్టింటికి వెళ్లిన వల్లి.. నిజం చెప్పిన చందు.. పూజలో కూర్చున్న ప్రేమ, ధీరజ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ వాయిస్ రికార్డు డిలీట్ అయిందని టెన్షన్ పడిపోతుంది. నర్మద వేరే ప్లాన్ చేశాను అని చెప్తుంది. ఆ వాయిస్ రికార్డు కేవలం వల్లిని భయపెట్టడానికి మాత్రమే.. వల్లి ఎంతట వల్లి నిజం చెప్పడానికి వేరే ప్లాన్ వేశాను అని నర్మదా చెప్తూ ఉండగా చందు అక్కడికి వస్తాడు. నర్మదా ఎమ్ ఏ సర్టిఫికేట్ ఫేక్ అని నీకు ఎలా తెలుసు నర్మదా అని అడుగుతాడు.. అంతే కాదు బావగారు అమూల్యను ఆ విశ్వం ని ప్రేమించమని చెప్పింది.. సాగర్ ఉద్యోగం గురించి బయటపడడానికి కారణం ఎవరు అన్నది వల్లికి తెలుసు అని అనగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. అయితే ఏంటి నర్మద నువ్వు చెప్పేది అని అనగానే వల్లి అక్కకు తెలుసు బావగారు అని మళ్ళీ మాట మార్చి చెప్తుంది.. భాగ్యం ఆనందరావు వల్లికి ఏమైందో ఏంటో అర్థం కావడం లేదు. ఆనందరావు తన మాటలతో ఇంకాస్త ఇబ్బంది పెట్టేస్తాడు. అమ్మాయి అక్కడ అబ్బాయి ఇరుక్కుపోయింది. ఏమైందో అర్థం కావడం లేదు నాకు చాలా టెన్షన్ గా ఉంది మీరేంటి ఇలా గోల చేస్తున్నారు. అని భాగ్యం ఆనంద్ రావు పై సీరియస్ అవుతుంది. అప్పుడే బల్లి ఫోన్ చేసి అమ్మ మన ప్లాను బీభత్సంగా సక్సెస్ అయిపోయింది అని అంటుంది. నువ్వు ట్రైనింగ్ ఇచ్చి పంపించావు కదా ఎలా నేను వెనకడుగు వేస్తానమ్మ సక్సెస్ అయిందని చెప్పగానే భాగ్యం ఆనందరావు ఫుల్ ఖుషి అవుతారు.. ఇప్పటివరకు నిన్ను ఒక ఆట ఆడుకున్నారు ఇప్పటినుంచి ఆ నర్మదా ప్రేమ కళ్ళల్లో రక్తపు కన్నీరు వచ్చేలా నేను చేస్తానని భాగ్యం అంటుంది.. మీరు పూజకి బేగి రండి అని చెప్పగానే సరే అమ్మ మేము వచ్చేస్తావని భాగ్యం అంటుంది.. చందు అమూల్య గురించి నీకు తెలియదా అని అడుగుతాడు కానీ అమూల్య అసలు నిజం చెప్పడంతో శ్రీవల్లి అడ్డంగా దొరికిపోతుంది. ఇక నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చందు శ్రీవల్లిని తన పుట్టింట్లో వదిలి పెట్టేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నువ్విక మీ పుట్టింటికి వెళ్ళిపో అని చందు ఎంత చెప్తున్నా సరే.. వల్లి మాత్రం నేను వెళ్ళను బావ నువ్వంటే నాకు ప్రాణం బావ అని బాధ పడిపోతూ ఉంటుంది.. వల్లి బాధపడి ఎంతగా చెప్తున్నా సరే చందు మాత్రం అస్సలు వినడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా అని మళ్లీ ఎంత చెప్తున్నా సరే చందు మాత్రం అస్సలు వినడు. ఆ విశ్వక్ తో చేతులు కలిపి నా చెల్లెలు జీవితాన్ని నాశనం చేయాలని చూసావు ఇది మాత్రమే నేను అసలు మర్చిపోను అని చందు అంటాడు. అబద్దాలతో మోసాలతో పెళ్లి చేస్తే నీ జీవితం ఏమవుతుందో అని నీ వాళ్ళకి చెప్పు అని చెందు అక్కడి నుంచి చందు వెళ్లిపోతాడు. వల్లి కన్నీళ్లు పెట్టుకుని బాధ పడిపోతూ ఉంటుంది. వల్లిని అక్కడ వదిలి పెట్టేసి వెళ్ళిపోవడంతో తను చాలా బాధపడిపోతూ లోపలికి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటమ్మాయ్ బస్సు ఎక్కి వెళ్లాల్సిన మేము వస్తూ ఉంటే డ్రైవర్ ఇంటికి వచ్చినట్లు ఉంది అని భాగ్యం అంటుంది. అసలు ఏం జరిగింది అన్నది ఆలోచించరా బ్యాగితో వచ్చేసాను అంటే నాకు కాపురం కూలిపోయింది అని మీరు ఆలోచించరా అని వల్లి బాధ పడిపోతూ ఉంటుంది.

Advertisement

ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేసేసారు. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను అబద్ధం చెప్పకండి జీవితం ఎక్కడికి వెళ్తుందో చెప్పడం కష్టమని.. కానీ మీరు మాత్రం వినకుండా నా గొంతు కోసేసారు అని వల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అయితే నువ్వేం బాధపడకమ్మా అవే సర్దుకుంటాయిలే అని వల్లిని ఓదారుస్తారు భాగ్యం ఆనందరావు. ఇక ఇంట్లో కల్యాణానికి సంబంధించిన పూజలో ఎవరు కూర్చుంటారు అని పంతులు అడుగుతారు.. నా పెద్ద కోడలు కొడుకు కూర్చుంటారు అని రామరాజు అనగానే వాళ్ళందరూ చందు వల్లి ఎక్కడ అని వెతుకుతారు. బయట నుంచి చందు రావడం చూసి ధీరజ్ ఏంటి అన్నయ్య బయటి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. వల్లి ఎక్కడరా ఇంట్లో పూజ పెట్టుకొని నువ్వెందుకు బయటనుంచి వస్తున్నావు అని వేదవతి అడుగుతుంది.

అంటే అన్నాను అంటారు కానీ పూజ పెట్టుకొని ఎక్కడికి వెళ్లారు రా మీరు అని వేదవతి అడుగుతుంది. నువ్వు నా కుటుంబానికి చెందిన వాళ్ళ పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చాను అని చందు అనగానే అదేంటి పూజ పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్లడం ఏంటి అని అడుగుతుంది వేదవతి. ఇంకో జంటని కూర్చోమని చెప్పండి అలా ఉంటావేంటి. వల్లి ఎక్కడ రా అని రామరాజు అడగగానే వాళ్ళ పుట్టింట్లో వదిలిపెట్టొచ్చాను అని అంటారు. శుభమంటూ పూజ పెట్టుకుంటే ఏం జరిగింది రా అని అడుగుతాడు. ఏం లేదు నాన్న వాళ్ళ అమ్మకాలు సరి కింద పడిపోయింది అంట అందుకే నేనే దగ్గరుండి వాళ్ళ పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చాను అని చందు అంటాడు.

Advertisement

నా భార్య ఎలాగో లేదు కదా నాన్న నేను ఈ పూజలో ఉండాల్సిన అవసరం లేదు. రైస్ మిల్లులో లోడ్ వచ్చిందంట నేను వెళ్తాను అని చందు వెళ్లిపోతాడు. ప్రేమ నర్మదలు మీరు చేసిన తప్పు బావగారు అని ఎంత చెప్తున్నా సరే. చందు మాత్రం వినకుండా నా మీద ఒట్టేసి ఈ విషయాన్ని ఎవరు ఇంట్లో చెప్పద్దు అని చందు అంటాడు.. ఇకపోతే చందు బయటికి వెళ్ళిన తర్వాత మళ్లీ ఇలా చేస్తుందని అసలు ఊహించలేదని చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక తర్వాత పీటల మీద ఎవరు కూర్చుంటారు అని పంతులు అడగగా వేదవతి నర్మదా సాగర్లో కూర్చుంటారని చెప్తుంది. అయితే ఆయన పక్కన పూజలో కూర్చోవడం ఇష్టం లేదు అనుకున్న రామరాజు అక్కడినుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. వాడు ఇక్కడ కూర్చుంటే నేను పూజల కూర్చొని రామరాజు అంటాడు. అక్కడినుంచి సాగర్ వెళ్లిపోతాడు.

Also Read : మీనాక్షిని అవమానించిన పల్లవి.. పార్వతి దెబ్బకు పల్లవి షాక్.. చక్రధర్ ను తిట్టిన భరత్..

ఆ తర్వాత ప్రేమ ధీరజ్లు ఈ పూజలో కూర్చోవాలి అని వేదవతి అంటుంది. కానీ తనతో కలిసి నేను ఈ పూజలో కూర్చొని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. అమూల్య విషయంలో తను చేసింది నేను అసలు మర్చిపోలేక పోతున్నాను అందుకే నేను తనతో పాటు పూజలో కూర్చోలేను అని ధీరజ్ చెప్పేస్తాడు. వేదవతి ఎంతగా చెబుతున్నా సరే ధీరజ్మాత్రం అసలు ఆ పూజలో కూర్చొని చెప్పేస్తాడు.. ధీరజ్ని పక్కకు తీసుకొని వెళ్ళిన వేదవతి ప్రేమ చేసింది తప్పు అని నువ్వు అనుకోవద్దు రా అమూల్య జీవితాన్ని కాపాడింది అని అంటుంది. కొన్ని విషయాలు నీకు తెలియదమ్మా అని ధీరజ్అంటున్న సరే వేదవతి మాత్రం తను చెప్పిందే వినాలి అని అంటుంది.. మొత్తానికి ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా కళ్యాణం కోసమని పీడల మీద కూర్చుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో బల్లి గురించి తెలిసిపోతుంది ఏమో చూడాలి..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×