E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ కు మాటిచ్చిన గాయత్రి.. మహాను రప్పించేందుకు లలిత ప్లాన్..చక్రికీ దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : మాధవ్ కు మాటిచ్చిన గాయత్రి.. మహాను రప్పించేందుకు లలిత ప్లాన్..చక్రికీ దిమ్మతిరిగే షాక్..
Advertisement

Podarillu Today Episode February 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో పూజలు అలాగే ముగ్గు పెట్టడం చూసి కన్నా ఎమోషనల్ అయిపోతాడు.. ఇక ఆ తర్వాత మహాలక్ష్మి నేను టీ పెడతాను అని అంటుంది… మహాలక్ష్మి చేసిన వింత ప్రయోగానికి ఇంట్లోని వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు.. ఆ తర్వాత చక్రి దోశలు వేస్తూ మాధవ్ చట్నీ చేస్తూ ఉంటాడు.. అయితే చక్రి చేసిన పనికి మాధవ్ షాక్ అవుతాడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి వంట చేస్తూ ఉండగా మహాలక్ష్మి ఇంటికి వస్తుంది.. వంటగదిలోకి రాగానే పెద్ది నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది.. రూమ్ సమస్య కదా అమ్మ నేను చూసుకుంటాను అని మాధవ్ అంటాడు.. అదే కాదు ఇంకొక సమస్య కూడా ఉంది పెద్ది. నాకు మీరు ఆర్కిటెక్ కదా ఒక జాబ్ చూపించండి అని అడుగుతుంది ఆ మాట వినగానే మాధవ్ షాక్ అవుతాడు. నారాయణ ప్రవర్తన చూసి భయపడిపోయిన మహాలక్ష్మి ఇంటి నుంచి బయటకు వస్తుంది. అప్పుడే ఇంటికి వస్తున్న కన్నా చక్రి మహా బయటుండడం చూసి ఏమైంది అని అడుగుతారు… అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహాలక్ష్మి ఉదయాన్నే పూజా చెయ్యడం చూసి అందరు షాక్ అవుతారు. శుక్రవారం కదా.. ఉదయం లేచి పూజ చేయడం అలవాటు అందుకే చేశాను అని అంటుంది. అయితే అప్పుడే అక్కడికి గాయత్రి వచ్చి మహాలక్ష్మికి తన గురించి చెప్తుంది.. ఇక ఇంట్లో ఏదో మంచి వాసన వస్తుంది అని వంట గదిలోకి వెళ్లి గాయత్రి మాధవ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరి గురించి తెలుసుకున్న మహా ప్రైవసీవ్వాలని అనుకుంటుంది.. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళిద్దర్నీ ఒక గదిలో పెట్టి తాళం వేసిన సరే వాళ్ళిద్దరూ వంట గురించే మాట్లాడుకుంటారు. మీకు తెలియదు అనుకుంటా మాకు చిన్నప్పటినుంచి ఇలాంటివి అలవాటే అని చక్రి అంటాడు..

Advertisement

ఇక మాధవ్ గాయత్రీ కి మహా గురించి చెప్తాడు.. అయితే మహాలక్ష్మి ఒంటరి అమ్మాయిలాగా ఉంటుంది కదా.. ఆమెకు ఆడవాళ్లకు ఉన్న అవసరాలు చాలా ఉంటాయి. కదా నువ్వు తనకి తోడుగా ఉండు అని అడుగుతాడు. నువ్వు చెప్పాల్సిన పని లేదు బావ మా అమ్మ లేనప్పుడు అప్పుడప్పుడు వచ్చి మహాలక్ష్మి తో మాట్లాడుతుంటాను.. ఆ మాట అనగానే మాధవ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.. ఇక హారికను మహాలక్ష్మికి ఫోన్ చేయమని లలిత చెప్తుంది.. నువ్వు ఫోన్ చేసి సర్టిఫికెట్లు దొరికాయి ఇక్కడికి రమ్మని చెప్పు అని లలిత అంటుంది.. అయితే మహాలక్ష్మికి హారిక ఫోన్ చేస్తుంది. హారిక ఫోన్ చేయగానే మహాలక్ష్మి సర్టిఫికెట్ దొరికాయా అని అడుగుతుంది.. నువ్వు దొరికాయి నువ్వు ఇక్కడికి వచ్చి తీసుకుంటావా అని అడుగుతుంది..

అదేంటి వదిన నేను అడ్రస్ చెప్తాను.. అడ్రస్ కి సర్టిఫికెట్లు పోస్ట్ చేస్తావంటే సర్టిఫికెట్లు కదా.. మహా మిస్సైతే ప్రాబ్లం అయితది. నువ్వు ఇక్కడికి వచ్చి సర్టిఫికెట్లు తీసుకోగలవా.. నేను బయటికి వెళ్లే పరిస్థితి కూడా నాకు లేదు అని హారిక అబద్ధం చెప్తుంది.. అయితే ఆ డ్రైవర్ని తీసుకురాకుండా రమ్మని చెప్పు అని లలిత అంటుంది.. నువ్వు వచ్చేటప్పుడు ఒక్కదానివే రా.. ఆ చక్రిని తీసుకురాకుండా రా ఒకవేళ చక్రి వస్తే ఇక్కడ గొడవలు అయిపోతాయని హారిక అంటుంది.. సరే వదిన నేను ఒక్కదాన్నే వస్తాను అని మహా అంటుంది..

Advertisement

అయితే చక్రి టిఫిన్ కోసం మాధవ్ ని అడుగుతుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మిని చూసిన మాధవ్ డ్రామా నువ్వు కూడా కూర్చో నీకు టిఫిన్ తీసుకొని వస్తాను అని అంటాడు. లేదు పెద్ది నేను సర్టిఫికెట్ల కోసం మా ఇంటికి వెళ్లాలి అని అడుగుతుంది. అయితే చక్రి నేను వస్తానని అన్నా కూడా.. ఏం అవసరం లేదండి నేను వెళ్లి తీసుకొని వస్తాను అని అంటుంది. కానీ కన్నా కాలేజ్ లేదని చెప్పడంతో తనని తీసుకొని వెళ్ళమని మాధవ్ చెప్తాడు.. మహా కన్నా ని వస్తావా అని అడుగుతుంది సరే వదిన నీకోసం ఎక్కడికైనా వస్తాను అని కన్నా అంటాడు.. ఇద్దరూ కలిసి యాదగిరిగుట్టకు వెళ్లడానికి రెడీ అవుతారు.. మాధవ్ వెళ్లి ఆట తీసుకొచ్చి మహా కన్నని జాగ్రత్తగా వెళ్ళమని పంపిస్తారు..

లలిత ప్రతాప్ దగ్గరికి వెళ్లి మహాలక్ష్మి వస్తుంది తనని ఇక్కడే ఉంచేందుకు నేను నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయాన్ని ఎప్పుడు మీరు కాదని నమ్ముతున్నాను అని అంటుంది.. నా కూతురు అక్కడ ఉండలేకపోతున్నాను అంటుంది. అందుకే ఇక్కడ ఉండేందుకు నేను ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాను అని లలిత అంటుంది. అక్కడినుంచి ఎందుకు వస్తుంది అని ఆది ప్రతాప్ అంటున్న సరే తను ఇక్కడికి వస్తుంది నేను ఇక్కడే ఉంచేస్తాను అని లలిత అంటుంది.. అయితే తనకు పెళ్లయింది కదా ఇక్కడ ఎలా ఉంచుతారు అని హారిక అడుగుతుంది..

ఆ మ్యారేజ్ ని ఎలా క్యాన్సిల్ చేయాలో నాకు బాగా తెలుసు తను ఉంటాను అంటే తను ఇష్టమని ప్రతాప్ కూడా ఒప్పేసుకుంటాడు.. ఇక చక్రి కేశవ దగ్గరికి వెళ్లి మహాలక్ష్మి వెళ్లిన విషయాన్ని చెప్తాడు..కేశవ చక్రిని ఒక ఆట ఆడుకుంటాడు.. నీకు ఏ విషయం తెలీదు రా ప్రేమ గురించి నీకేం తెలియదు అని చక్రి కేశవ అని తిడతాడు.. ఆ తర్వాత కన్నా మహా ఇద్దరు ఒక చోటికి వెళ్తారు.. వెళ్ళిన తర్వాత మా వదినకి ఫోన్ చేయమని చెప్పింది అని హారిక కు ఫోన్ చేస్తుంది మహా.. ఇక లలిత ఇంటికి రమ్మని చెప్పు అని హారికకు చెప్తుంది.. హారిక కూడా లలిత ఎలా చెప్తే అలానే చెప్పి మహనీ ఇంటికి రమ్మని చెప్తుంది.. సి కాదు నమ్మిన మహా ఇంటికి రావడానికి ఒప్పుకుంటుంది. అయితే ఇంట్లో వాళ్ళు తిడతారేమో అని భయపడుతూ ఉంటుంది..

Also Read : శోభాతో శృతి గొడవ.. సత్యం ఇంట బొమ్మకొలువు.. మనోజ్ పై బాలు ఫైర్..

అత్తయ్య నేను ఇంట్లో ఉన్నాము. అమ్మ ఉంది అంటే తిడుతుంది కదా అని హారిక అని అడుగుతుంది. అత్తయ్య నీకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఒప్పుకునింది అంటే నీ మీద కోపం తగ్గినట్లే కద మహా నువ్వు ఇంటికి వచ్చేసేయ్ అని చెప్పగానే మహాలక్ష్మి గుడ్డిగా నమ్మేసి ఇంటికి వెళ్లడానికి ఒప్పుకుంటుంది.. మహా కన్నా ఇద్దరు కలిసి వాళ్ళింటికి వెళ్తారు. చక్రి మాత్రం మహాలక్ష్మి ఇంటికి వస్తుందా లేదా అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మహాలక్ష్మికి లలిత షాక్ ఇస్తుందేమో చూడాలి..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×