E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీకి షాకిచ్చిన మహా.. ఇంటిమీదకు గొడవకు వచ్చిన ఆది.. మహా షాకింగ్ నిర్ణయం..?

Podarillu Today Episode : చక్రీకి షాకిచ్చిన మహా.. ఇంటిమీదకు గొడవకు వచ్చిన ఆది.. మహా షాకింగ్ నిర్ణయం..?
Advertisement

Podarillu Today Episode January 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రి మహనీ తన ఇంటి గురించి గొప్పగా చెప్పినట్లు ఊహించుకుంటాడు. మా ఇంటి గురించి ఎన్నెన్నో గొప్పలు చెప్పాను. ఇంటిని చూస్తే ఖచ్చితంగా భయపడుతుందేమో అని చక్రి అనుకుంటాడు. మీ ఇల్లు కాశీలో ఉందా ఏంటి ఇంకా రాలేదు అని అడుగుతుంది. నారాయణ తన కొడుకుకి పెళ్లి అయిందని చాలా సంతోషంగా ఉంటాడు.. నా ఇంటికి కూడా కోడలు వచ్చింది అని పాటలు పాడుకుంటూ టీ షాప్ దగ్గరికి వస్తాడు. అక్కడ అందరూ ఏంటి నారాయణ ఎక్కువ మందు తాగావా? పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నావ్ అని అనగానే నాకేమీ పిచ్చి పట్టలేదు నేను చెప్పింది వింటే మీ అందరికీ పిచ్చి పడుతుంది అని అంటాడు..

తన రెండో కొడుకు ఒక గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తున్నాడని చెప్తాడు. ఆ మాట వినగానే తన అన్న షాక్ అవుతాడు..నా ఇంటికి అమ్మాయి రాదని అన్నారు. ఎవరో శాపాలు పెట్టారు అవన్నీ జరుగుతాయని అందరూ అనుకున్నారు కానీ అందులో నిజం లేదు నా కొడుకు కోడల్ని తీసుకొని ఇంటికి వస్తున్నాడు మీరు దగ్గరుండి చూడాలి అని అంటాడు.. అందరు కూడా మొహాన్ని చూసి గొప్పింటి అమ్మాయి అని అనుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్రిని లోపలికి రమ్మని పిలుస్తుంది. మహా లోపలికి వెళ్ళగానే ఏంటి ఇదంతా మీ ఇంటికి నేను ఇష్టపడి పెళ్లి చేసుకుని వచ్చానని మీ వాళ్ళు అనుకుంటున్నారు.. నాకు ఎలా తెలుస్తుంది అండి ఫోన్ కూడా మీ ముందరే ఆన్ చేశాను నేను ఏమైనా ఫోన్ చేసి ఇదంతా చెప్పానా ఏంటి పోలీసులు చెప్పారు అని అంటాడు.. ఇదంతా నాకేమీ నచ్చలేదండి మీ వాళ్ళు ఏదేదో అనుకుంటున్నారు మీరు నిజం చెప్పండి అని అంటుంది.. వాళ్లు మనం నిజంగానే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు అందుకే ఈ హంగామా అంత చేస్తున్నారని చక్రి అంటాడు. అయితే మనం పెళ్లి చేసుకోలేదు కదా ఎందుకు వీళ్ళు ఇంత చేస్తున్నారు. ఇలాంటివన్నీ నాకు నచ్చదు అని మహా అంటుంది..

నువ్వు మీ వాళ్ళకి చెప్తావా నన్ను చెప్పమంటావా ఏదో ఒక రోజు నేను హాస్టల్ కి వెళ్లి పోవాల్సిందే.. ఇది గుర్తుపెట్టుకోండి అని మహా అంటుంది.. మీ ముందరే ఉన్నాను కదా.. పోలీసులు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పారు వాళ్ళు నిజంగానే పెళ్లి జరిగిందని అనుకుంటున్నారు.. మీరు ఆగండి నేనే టైం చూసుకుని చెప్తాను అని చక్రి అంటాడు.. ఇక కన్నా వదిన వచ్చింది కదా అన్నయ్యతో ఏం మాట్లాడడానికి లోపలికి తీసుకుని వెళ్ళింది అని అంటాడు.. అయితే నువ్వు పాయసం చేసావు కదా అది నచ్చక వంట మనిషిని పెట్టమని అడిగిందేమో అని కన్నా అంటాడు..

Advertisement

ఏం మాట్లాడుతున్నావ్ రా నా వంట నీకు నచ్చలేదా అని కొట్టబోతాడు మాధవ్.. ఇక తర్వాత ఆది అరే డ్రైవర్ బయటకి రారా అని తన మనుషులను తీసుకొని ఇంటి మీదకి వస్తాడు.. బయట ఉన్న నారాయణ ఎవడ్రా నువ్వు నా ఇంట్లోకి వచ్చేసావు అని అంటాడు.. నీతో మాట్లాడేది ఏంట్రా ఆ డ్రైవర్ గాని పిలవండి అని అంటారు.. అయితే అందరూ కలిసి రాగానే ఆది చక్రిని కొట్టడానికి తన మనుషుల్ని పంపిస్తాడు.. ఎవర్రా నువ్వు మమ్మల్ని కొట్టడానికి అందరూ ఆదిని తన మనుషులని కొట్టబోతారు.. అది చూసిన మహా అతను మా అన్నయ్య అని చెప్పగానే.. ఆది ఎవరు నీకు అన్నయ్య అయితే నువ్వు ఇంట్లోంచి ఇలా వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతాడు.

ఆది ఈరోజు ఎలాగైనా సరే వీడ్ని చంపేసి నిన్ను తీసుకెళ్లి పోతాను అని అంటాడు. ఆ మాట వినగానే మహా షాక్ అవుతుంది. అయితే అందరూ కలిసి కొట్టుకుంటారు.. గొడవల్లో కన్నాకి తగులుతుంది.. ఇక ఆది ఇకనుంచి వెళ్ళిపో అని మహా అతని పంపిస్తుంది. అతను మీ అన్నయ్య కాకపోయుండుంటే ఈపాటికి చంపేసేవాన్ని అని నారాయణ అంటాడు. కన్నాకి దెబ్బ తగలడంతో మహా చాలా ఫీల్ అయిపోతుంది.. ఏంటి నువ్వు పెద్ద పోటుగాడివి అనుకుంటున్నావా రౌడీల మీదకి వెళ్లావు.. వాళ్ళు అసలే డబ్బులు కోసం ఏదైనా చేస్తారో నీకెందుకు మధ్యలో అని కన్నా ని తిడుతుంది మహా.. బ్యాంగిల్స్ తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. కన్న ఏడుస్తుంటే ఏడవద్దు సారీ అని చెప్తుంది.. నావల్లే ఈ గొడవలు ఎన్ని జరుగుతున్నాయి కదా నన్ను క్షమించండి అని మహా అడుగుతుంది..

ఇక తర్వాత నేను ఫ్రెష్ అవుతాను అని మహా అంటుంది. చక్రి బాత్రూమ్ ని చూపిస్తాడు.. అందులో లైట్ లేదని మహా మళ్ళీ రావడంతో అందరూ ఒకరి మీద ఒకరు పెట్టుకొని సరదాగా తిట్టుకుంటారు.. ఇక టార్చ్ ఏదైనా కావాలని అడుగుతుంది అందరూ తమ ఫోన్ లో టార్చ్ లైట్ వేసి ఇస్తారు. మహా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే చక్రి కేశవ ఇద్దరూ కొట్టుకుంటారు.. ప్రతాప్ మాత్రం తన కూతురు తన్ను వదిలేసి పోయింది. ఈ అవమానాన్ని తట్టుకోలేను అని బాధపడిపోతూ ఉంటాడు.. ఎలాగైనా సరే చచ్చిపోవాలి అని నిర్ణయించుకొని నిద్ర మాత్రలు మింగుతాడు..

Also Read : ధీరజ్ ను చితక్కొట్టిన ప్రేమ.. అమూల్య, విశ్వక్ లేచిపోతారా..? కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..

మీ మామయ్య ఇంకా రాలేదు అని లలిత డోర్ తీయడానికి వెళుతుంది. ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో అందరూ కలిసి డోర్ ని పగలగొట్టి లోపలికి వెళ్తారు.. అక్కడ సూసైడ్ చేసుకున్న ప్రతాపం చూసి అందరూ షాక్ అవుతారు. మహా కి మాత్రం మాధవ్ చేసిన వంటని పెడతారు.. అందరూ కలిసి సరదాగా కూర్చుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో హారికకు మహా ఫోన్ చేస్తుంది. ప్రతాప్ సూసైడ్ చేసుకున్న విషయాన్ని హారిక చెప్తుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×