E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్ ను చితక్కొట్టిన ప్రేమ.. అమూల్య, విశ్వక్ లేచిపోతారా..? కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్ ను చితక్కొట్టిన ప్రేమ.. అమూల్య, విశ్వక్ లేచిపోతారా..? కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. అమూల్య ఎంగేజ్మెంట్ వనజ కొడుకుతో గ్రాండ్గా జరుగుతుంది. ఇద్దరు కలిసి చాలా సంతోషంగా కనిపిస్తారు. అమూల్య ఎంగేజ్మెంట్ పూర్తవడంతో ఇంట్లోని వాళ్ళందరూ ఆటపాటలతో డాన్సులతో సందడిగా ఉంటారు. వనజ నా కోడలికి నా ఇంటి నుంచి వచ్చిన డబ్బులతో నగలు చేయించాలని రామరాజుకు 20 లక్షల డబ్బులను ఇస్తుంది. అది చూసిన శ్రీవల్లి షాక్ అవుతుంది. ఇంట్లోనే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా అమూల్య పెళ్లి జరగబోతుందని సంబరాలు చేసుకుంటూ ఉంటారు.. ఆటపాటలతో ఎంగేజ్మెంట్ ను వేడుకను పూర్తి చేస్తారు.. వనజ తన కొడుకు ఎంగేజ్మెంట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాదు తన కోడలికి తన ఇంట్లోని నగలనే వేయాలి అని అనుకుంటుంది.

అందుకే రామరాజుకి 20 లక్షలు ఇస్తుంది కూడా.. ఇక అమూల్య ఎంగేజ్మెంట్ జరిగిందని సంతోషంగా ఉంటుంటే భద్ర మాత్రం వీళ్ళని చూసి కుళ్ళుకుంటుంది.. ఇక విశ్వం నేను ఎంగేజ్మెంట్ ని చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను అత్త కానీ జరిగిపోయింది నేనేమీ చేయలేకపోయాను అని బాధపడిపోతూ ఉంటాడు.. నిద్ర మాత్రం పెళ్లి జరిగే టైంలో లేపుకెళితేనే మజా వస్తుంది అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… ప్రేమ ధీరజు ఇద్దరు కలిసి ఒక ఆట ఆడుతారు. గ్లాసులో బత్తాయి అంటూ ప్రేమ చెప్పిన ఆట ధీరజ్ కి అర్థం కాదు.. ఇది కాదు దెబ్బ గుర్తుండిపోయేలా ఉండాలి అని ధీరజ్ కావాలని తనకు తానే ఇరుక్కుని ఎలా చేసుకుంటారు. ఇద్దరు కలిసి ఒక ఆట ఆడుతారు అయితే ప్రేమదే పై చేయి కావడంతో ధీరజుకు దెబ్బలు తగులుతాయి.. ప్రేమ ధీరజ్ని మోసం చేసి మరి కొడుతుంది.. మొత్తానికి ఈ గేమ్ లో ప్రేమదే పై చేయి అవుతుంది. కానీ ఒక సందర్భంలో ప్రేమ ధీరజ్లు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు.. అప్పుడే అక్కడికి వచ్చినా తిరుపతి పెళ్లికాని నాలాంటి వాళ్ళ ముందర ఇలాంటివి చేస్తే నాకు ఎన్ని ఆశలు ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలి కదా తలుపులు వేసుకొని రా అని అంటాడు..

ఇక తర్వాత అమూల్య ఎంగేజ్మెంట్ జరిగింది అని బాధపడిపోతూ ఉంటుంది.. విశ్వం నేను ఇంకా మర్చిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. అయితే అప్పుడే విశ్వం ఫోన్ చేయడం చూసిన అమూల్య ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకు నువ్వు బాధ పడిపోతున్నావు. ఎంగేజ్మెంట్ కదా జరిగింది పెళ్లి కాలేదు కదా మనం ఇప్పుడైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని విశ్వం అంటాడు.. నేను ఇప్పుడు అలాంటి పని చేయలేను మా నాన్న పరువు తీయలేను అని అమూల్య ఎంతగా చెప్తున్నా సరే విశ్వం మాత్రం తనని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.. కానీ అమూల్య మాత్రం మా నాన్న పరువు ని ఎప్పటికీ తీయను ఇక మనం ఎవరి దారి వాళ్ళు చూసుకున్నాము అని అంటుంది. నిన్ను మాత్రం నేను అసలు మర్చిపోలేను అని విశ్వమంటాడు.. నువ్వు నా ప్రాణం అమూల్య నిన్ను నేను ఎప్పటికీ వదులుకోను అని అంటాడు.

Advertisement

అప్పుడే అక్కడికి వచ్చిన వేదవతి అమూల్య అని పిలుస్తుంది.. మా అమ్మ పిలుస్తుంది అని ఫోన్ పెట్టేస్తుంది. అయితే అక్కడికి వచ్చిన వేదవతి ఎంగేజ్మెంట్ రింగ్ కింద పడిపోవడం చూసి షాక్ అవుతుంది.. ఇది ఎందుకు కింద పడిపోయింది చెప్పు అని అమూల్యని అడిగితే జారిపడిపోయింది అమ్మ అని అంటుంది.. నాకు భోజనం చేద్దువు గాని రా అని అంటే అమూల్య నాకు ఆకలి వేయటం లేదమ్మా అని అంటుంది. వేదవతి అందరికన్నా ముందు రోజు నువ్వే తింటావు కదా మరి ఈరోజు ఏంటి ఆకలి లేదంటున్నావ్? ఏమైంది నీకు అని అడుగుతుంది.. నిజంగానే ఆకలి లేదమ్మా అని అమూల్య అంటుంది.

కూతురు పెళ్లి అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బుజ్జమ్మ ఇవాళ నేను చాలా తృప్తిగా భోజనం చేయాలి అని రామరాజు అంటాడు. మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. కానీ మీ ముద్దుల కూతురు మాత్రం బాధగా ఉంది. ఎందుకో తెలియదు నాకు భోజనం వద్దు అని అంటుంది. అదేంటి మనలందరిని వదిలిపెట్టడానికి బాధపడుతుందేమో అని రామరాజు అంటాడు అదేంటో మీరే కనుక్కోండి అని వేదవతి అంటుంది. రామరాజు అమూల్య దగ్గరికి వెళ్లి నువ్వు ఏంటమ్మా భోజనం చేయలేదు అని అడుగుతాడు.. ఆకలిగా లేదు నాన్న అని అమూల్య అంటే రామరాజు మాత్రం చాలా ఫీల్ అవుతాడు.

నువ్వు వెళ్ళిపోతున్నావని నాకు చాలా బాధగా ఉంది. అమ్మ మీ అమ్మ మాత్రం నువ్వు ఎక్కడ తన మాట కాదని ఇంటి నుంచి వెళ్ళిపోతావు అని భయపడుతుంది అని అంటాడు. నేను అనాధగా వచ్చినా సరే.. నా కూతుర్లు నా పిల్లలు నాకు ప్రపంచమని బతుకుతున్నాను.. నువ్వు కడుపులో ఉన్నప్పుడు అడ్డం తిరిగావు.. మీ అమ్మ తన ప్రాణాలని పణంగా పెట్టి నిన్ను కాపాడుకుంది.. నువ్వు ఎక్కడ ఏడుస్తావో అని మీ అమ్మ నొప్పిని భరించి చావును కూడా తట్టుకొని నిన్ను భూమ్మీదకి తీసుకొచ్చింది.. అలాంటి మీ అమ్మ ఈరోజు నువ్వు ఏమయిపోతావని బాధపడుతుంది. ఇదంతా నీకెందుకు చెప్తున్నాను అంటే.. ఆరోజు కడుపులో అడ్డం తిరిగిన నిన్ను ప్రాణాలను పక్కనపెట్టి కాపాడిన మీ అమ్మ మీ నాన్న పరువు తీస్తావేమో అని భయపడుతూ బాధపడుతూ ఉంది.

Also Read : పల్లవి కొత్త డ్రామా.. తెలివిగా ఇరికించిన అవని.. పల్లవి ప్రగ్నెంట్ కాదని తెలిసిపోతుందా..?

తనకు అనుమానం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ.. నాకు మాత్రం నా కూతురు మీద అసలు అలాంటి ఆలోచన లేదు.. మీ నాన్న పరువు ని కాపాడతావు కదా అని అమూల్యతో మాట తీసుకుంటాడు రామరాజు. ఏంటి పరువు తీసే పని మా అమ్మ చేయదు అని నేను నమ్ముతున్నాను అని అమూల్యతో అంటాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఎమోషనల్ సీను ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది. అమూల్య బాధపడుతుంటే అందరూ వెళ్లి అమూల్యను ఓదార్చేందుకు ప్రయత్నాలు చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×