E-Paper
Advertisement

Podarillu Today Episode : పోలీస్ స్టేషన్ కు మహా, చక్రీ… దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు.. చక్రిపై మహా సీరియస్..

Podarillu Today Episode : పోలీస్ స్టేషన్ కు మహా, చక్రీ… దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు.. చక్రిపై మహా సీరియస్..
Advertisement

Podarillu Today Episode January 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. మహా ప్రతాప్ కి ఏం కాలేదని తెలుసుకొని చాలా సంతోషంగా ఉంటుంది. ఇక నాకు ఆకలేస్తుంది అని అడుగుతుంది. తిందాం పదండి అనేసి మాహా అడుగుతుంది.. ఇక అక్కడికి వెళ్లి మహా చెప్పిన ఆర్డర్ విని చెక్రి షాక్ అవుతాడు.. గాయత్రి ఇంట్లో ఏదైనా పని ఉంటే చేద్దామని వచ్చానని అంటుంది. కేశవ మాధవ్ను ఎందుకన్నయ్య నువ్వు ఇలా చేస్తున్నావ్ నీకేం బాధగా అనిపించడం లేదా అని అడుగుతాడు.. నాకేం బాధగా లేదురా రేపు నువ్వు కూడా పెళ్లి చేసుకుని వస్తే నీకు కూడా ఇంతే గ్రాండ్ గా నేను అన్ని ఏర్పాటు చేస్తాను అని మాధవ్ అంటాడు.. మహా తన తండ్రి గురించి చాలా గొప్పగా చెప్తుంది. అయితే తన తండ్రి తనకోసం చేసిన విషయాలన్నిటిని మరోసారి గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా అంటుంది. మా నాన్న నా నాకోసం చాలా చేశాడు.

అది తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని మహా ఎమోషనల్ అవుతుంది. అయితే చక్రి మీ నాన్న అంటే ఏంటి ఇష్టం కదా.. మరి మీ నాన్న మాట ఎందుకు కాదన్నారు అని అనగానే మా నాన్న ఆ ద్రోహిని పెళ్లి చేసుకోమని అన్నాడు. ఇక అక్కడ ఫుడ్ రావడంతో మహా ఒక్కటే అన్నిటిని లాగించేస్తూ ఉంటుంది. రాక్షసులగా తింటున్నాను కదా అని మహా అడుగుతుంది. అదేం లేదు మీకు ఆకలేస్తుంది కదా మీరు తినండి అని చక్రి అంటాడు.. ఇక గాయత్రి మహా కోసం బ్లౌజ్ కుట్టించి తీసుకొస్తుంది.. తాయారు ఇంకొకసారి ఆ ఇంటికి వెళ్తే కాళ్లు విరగ్గొడతానని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్రి మీకు ఏదో సాయం చేయాలనిపించింది చేశాను అని అంటాడు. మహా చక్రిని పొగడ్తలతో ముంచేత్తుతుంది. మీలాంటి మంచి మనిషి నాకు దొరకడం చాలా అదృష్టం అని అంటుంది. అది సరే కానీ మీరు ఎవరిని ప్రేమించలేదా అని మహా అడుగుతుంది. నేను ఎవరిని ప్రేమించలేదండి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న షాక్ ఇచ్చాడు అని చక్రి అంటాడు.. మీకు ఇప్పుడు లవ్ స్టోరీలు ఏమీ లేవా అని అడిగితే ఒక అమ్మాయితో మొదలైంది అని అనగానే ఆ అమ్మాయి మీకు కచ్చితంగా దక్కుతుంది అని మహా అంటుంది. ఇక ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. పోలీసులు మహని వివరాలు అడిగి తెలుసుకుంటారు..

అయితే అక్కడ కానిస్టేబుల్ చక్రిని మహాని బాగా చూసుకోవట్లేదా ఏంటి అమ్మాయి ఎలా ఉంది అని అడుగుతారు. నేను చాలా బాగా అమ్మాయిని చూసుకుంటున్నానండి. మా ఇంట్లో ఎలా ఉన్నానో అక్కడ అలా ఉన్నాను నన్ను ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు అని మహా కూడా అంటుంది. ఆ తర్వాత మహా మీరు మీ ఇంట్లో వాళ్లకి భయపడి ఎక్కడికో పారిపోయి ఉంటారు అని అనుకున్నాను కానీ ఇక్కడే ఉన్నారు ఎవరు ఏమి చేయలేదు కదా అని పోలీసులు అడుగుతారు.. మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అన్నది మీరు తెలుసుకోవాలి అని చక్రి అంటాడు. మా నాన్నగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు అని మహా అంటుంది.. ఏమైంది అని పోలీసులు అడుగుతారు. ఏమో మందులు మింగారట. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నారు ఆయనకి ఏమీ కాలేదు.. అవునా మీరు ఇలా చేసిన తర్వాత ఆయన పరిస్థితి ఇలా మారడం కామనే కదా అని పోలీసులు అంటారు..

Advertisement

ఇక తర్వాత ఇదిగోండి మీ మ్యారేజ్ సర్టిఫికెట్ అని అనగానే మహా షాక్ అవుతుంది.. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మ్యారేజ్ సర్టిఫికెట్ ఏంటి అని అడుగుతుంది.. మీకు మ్యారేజ్ అయింది కదా మరి సర్టిఫికెట్ వస్తే ఏంటి అని అడుగుతారు ఏంటి అని ఎస్ఐ అడుగుతాడు.. లేదండి ఇదంతా ఉత్తుత్తి పెళ్లే కదా నేను ఆ దుర్మార్గుడు నుంచి తప్పించుకోవడానికి ఇలా చేశాను కదా అని అంటుంది మహా… అయితే మీరు బయట వెయిట్ చేయండి నేను పోలీసులతో మాట్లాడేసి వస్తాను అని చక్రి అంటాడు.. ఒక రోజంతా కష్టపడి మేము పెళ్లి చేస్తే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అమ్మాయికి ఏమన్నా లూస్ ఆ ఏంటి అని అడుగుతారు.

చక్రి అమ్మాయి పెళ్లి ఇప్పుడే వద్దని అంటుంది సార్ అని అంటాడు. ఈమధ్య అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటున్నారు కదా అలా ఉండాలని అనుకుంటుంది. అందుకే పెళ్లి అనగానే ఆశ్చర్య పోతుంది అని చక్రి అంటాడు.. అసలేంటయ్యా మీ ప్రాబ్లం అని అడిగితే అదేదో రిలేషన్షిప్ అంట అలానే ఉండాలని అనుకుంటున్నారని అంటాడు.. ఈమధ్య అమ్మాయిలు బాగా చెడిపోయారు అని పోలీసులు అనుకుంటారు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటారు ఆ తర్వాత మమ్మల్ని కాపాడమని పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చుంటారు. ఇలాంటివి ఈ రోజుల్లో జరుగుతూనే ఉంటాయి కదా అని కానిస్టేబుల్ అంటాడు..

Also Read :ప్రభావతిపై శృతి ఫైర్.. రెచ్చిపోయిన బాలు.. హమ్మయ్య ప్రభావతి ఫుల్ హ్యాపీ..

నేను అమ్మాయికి నచ్చ చెప్తాను మీరు ఆ సర్టిఫికెట్ ఇవ్వండి అని పోలీసులతో చక్రి అంటాడు.. బయటికి వచ్చిన తర్వాత చక్రిని మహా ఇదంతా మీకు ముందే తెలిసే చేశారు కదా అని అడుగుతుంది.. లేదండి నాకేం తెలీదు పోలీసులు సంతకాలు చేయించుకున్నారు. అంతే అంతకుమించి నాకు ఏ సంబంధం లేదు అని అంటాడు.. కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ అంటే మనల్ని ఇంకా పెళ్లయినట్లే కదా అర్థం అని మహా అంటుంది. మీరు నన్ను అనుమానిస్తున్నారు నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు అని చక్రి అంటాడు. ఇప్పుడు మనం ఇక్కడ గొడవ పడితే పోలీసులు అనుమానం వచ్చి మీ నాన్న వాళ్ళని పిలిచి మళ్లీ నిన్ను తీసుకెళ్లిపోతారని చక్రి అంటాడు.. సర్టిఫికెట్ ఏదో తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని చక్రి అనగానే మహా సరే అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఇక సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×