Podarillu Today Episode July 23rd: మహాలక్ష్మి లైసెన్స్ కోసం వెళ్లాలి అని చక్రి అనగానే ఇది కూడా నిజమేనా లేక ఫ్రాడ్ అని అంటుంది.. మీరు ప్రతిదీ నన్ను అలా అర్థం చేసుకుంటే నేనేమీ చేయలేను ఇది నిజమే మీరు రండి వెళ్దామని అంటాడు. ఓంకారేశ్వర్ దగ్గరికి మహాలక్ష్మి తీసుకెళ్లగానే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మొత్తానికి డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో మహాలక్ష్మిని చూడలేని ఓంకారేశ్వర్ చెప్తాడు. అయితే అప్పుడే ఒక అతను ఎదురుగా రావడంతో అతని మహాలక్ష్మి గుద్దిస్తుంది.. ఇక ఓంకారేశ్వరి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో మహాలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది..
కేశవ శైలు తో ఫోన్ మాట్లాడుతూ బయట చాలా సీక్రెట్ గా ఉంచాలని అనుకుంటాడు.. అయితే శైలు తో ఫోన్ మాట్లాడుతున్నాడు అని మహాలక్ష్మి అలాగే కన్నా ఇద్దరు కూడా ఏం మాట్లాడుతున్నారో వినాలని అనుకుంటుంది.. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని మహాలక్ష్మి అలాగే కన్నా ఇద్దరు కూడా చాటుగా వింటూ ఉంటారు.. అయితే మహాలక్ష్మి కన్నా నీ వీళ్లిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. అయితే ఈ కేశవ తిన్నావా లేదా అని మాట్లాడుతూ ఉండగా వీళ్ళిద్దరి ప్రేమ మామూలుగా లేదు అని ఇద్దరు సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. ఇక మనం పదిమంది పిల్లల్ని కనాలి అని అనగానే.. ఏంటి పదిమంది పిల్లల్ని కంటే రా వీళ్ళ దుంపలు అని కన్నా సెటైర్ల వర్షం కురిపిస్తూ ఉంటాడు.. ఇక వీళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సురేష్ అక్కడికి వచ్చి శైలుకి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు. శైలు ఎంతగా చెబుతున్నా సరే వినకుండా అతను ఉండడంతో బయటికి తోసేసి తలుపు వేస్తుంది. ఇక సురేష్ ఇంట్లో రచ్చ చేస్తాడు.. ఇద్దరు కలిసి తనకి పెళ్లి చేస్తే బాగుంటుందని ఏమైంది.. ఇక వరాలు సురేష్ ఇద్దరు కలిసి చేసిన రచ్చకి శైలు వాళ్ళ నాన్న తనకి పెళ్లి చేద్దామని ఫిక్స్ అవుతాడు..
మహాలక్ష్మి ఆర్డర్ పెట్టిన వన్నీ వచ్చేసాయి అని చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కన్నా ఫ్లిప్కార్ట్ నుంచి చాలా ఆర్డర్లు వచ్చాయి వదిన అని అంటాడు. అవునురా నేను చాలా ఆర్డర్ పెట్టాను అని అనగానే అవునా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు వదిన ఇన్ని ఆర్డర్లు పెట్టి అని కన్నా అడుగుతాడు. ఇద్దరు కలిసి ఆ ఆర్డర్లు ఏమేమి వచ్చాయో తెలుసుకోవాలని అనుకుంటారు. అక్కడ వచ్చిన ఆర్డర్లని తెలుసుకుంటూ ఒక్కొక్క దాన్ని వివరిస్తూ ఫ్లిప్కార్ట్ లో ఉన్న ఆఫర్స్ ని కనుక్కుంటారు. ఇక్కడికి ఇచ్చిన ప్రమోషన్స్ కాస్త ఎపిసోడ్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. మొత్తానికి మహాలక్ష్మి కన్నా ఇద్దరు కూడా ఆ ఆర్డర్లను చూసి షాక్ అయినట్లు అందరూ అనుకుంటారు. ప్రస్తుతం ప్రమోషన్స్ కోసం చేసిన ఈ వీడియో బాగానే అనిపిస్తుందని తెలుస్తుంది.. మొత్తానికి ఫ్లిప్కార్ట్ ప్రమోషన్స్ ఎపిసోడ్కి బూస్ట్ ఇచ్చాయి..
చక్రి మహాలక్ష్మి ఇద్దరు డ్రైవింగ్ లైసెన్స్ కి వెళ్లాలని అనుకుంటారు. చక్రి ఎవరి ప్రాణాలు ఎక్కడ గాల్లో కలిసిపోతాయో తెలియడం లేదు అని చెప్పిన సరే మహాలక్ష్మి మాత్రం వినకుండా డ్రైవింగ్ లైసెన్స్ కి వెళ్లాల్సిందే అని అంటుంది.. చక్రి వద్దని చెప్తున్న సరే.. మహాలక్ష్మి నేను డ్రైవింగ్ కి వెళ్లాల్సిందే అని చెప్తుంది.. ఇక డ్రైవింగ్ లైసెన్స్ పేపర్ ని దేవుడి దగ్గర పెట్టమని చెప్పగానే ఆ పేపరు గాల్లో ఎగిరిపోతుంది. సపోర్ట్ చేస్తూ అందరూ మాట్లాడుతూ ఉండగా చక్రి మాత్రం ఇవాళ ఎవరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో అర్థం కావడం లేదు అని అంటాడు.. ఇక అడుగడుగునా మహాలక్ష్మికి అడ్డుగా శకునాలు ఎదురవుతూనే ఉంటాయి.. ఇక బయటకు రాగానే నారాయణ తుమ్మడంతో మహాలక్ష్మి కోపానికి నారాయణ బలవుతాడు.. ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం నారాయణ భయపడిపోతాడు. నాకు ఇవ్వాలా డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా ఉంటే నీ పని అయిపోతుంది అని నారాయణకు మహాలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. తనకి మహాలక్ష్మి ధైర్యం చేసి డ్రైవింగ్ లైసెన్స్ కోసం అని వెళుతుంది..
మహాలక్ష్మి డ్రైవింగ్ లైసెన్స్ కోసం అని ఆర్డిఓ ఆఫీస్ కి వెళ్ళదని అక్కడ ఉన్న ఆఫీసర్ని చూసి షాక్ అవుతుంది.. అయితే మహాలక్ష్మి గుద్దేసిన ఆ వ్యక్తి అక్కడ ఆఫీసర్గా కనిపించడంతో మహా ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇవాళ నాకు డ్రైవింగ్ రాదు అని ఫిక్స్ అయిపోతుంది.. హెల్మెట్ పెట్టుకుని వెళ్ళినా సరే ఆ వ్యక్తి మాత్రం డ్రైవింగ్ రావాలి అంటే కచ్చితంగా హెల్మెట్ తీసి మేము చూడాల్సిందే అని అనగానే మహాలక్ష్మి హెల్మెట్ తీస్తుంది.. మహాను చూసిన ఆ ఆఫీసర్ నీకు చచ్చిన నేను డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వను వెళ్ళు అనేసి అంటాడు.. రంగంలోకి దిగిన చక్రి ఎలాగైనా సరే మహాలక్ష్మికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేలా చేయాలని అనుకుంటాడు. ఆ తర్వాత తన అమాయకపు స్టోరీ ని పెట్టి మహాలక్ష్మికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేలా చేయాలని అనుకుంటాడు.. పేదరికం స్టోరీ చెప్పి పడేస్తాడు.. డ్రైవింగ్ టెస్ట్లో మహాలక్ష్మి పాస్ అవ్వడంతో అతను లైసెన్స్ వస్తుందని చెప్తాడు..
శైలుకి పెళ్లి సంబంధం చూడాలని సురేష్ పట్టుబట్టి కూర్చోవడంతో ఇక వరాలు కూడా పెళ్లి చేయాల్సిందే అని నిర్ణయించుకుంటుంది.. ఇక శైలుకి ఒక పెళ్లి సంబంధం తీసుకొని వస్తారు మీ అమ్మాయి బాగా నచ్చింది.. మీరు ఓకే అనుకుంటే వాళ్ళు నిశ్చితార్థం కి వస్తారంట అని పంతులుగారు చెప్పడంతో మిగతా వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు.. రైలుకి పెళ్లి సంబంధం గురించి చెప్పగానే షాక్ అయిపోతుంది.. మొత్తానికి నీకు పెళ్లి అయ్యేంతవరకు నువ్వు బయటికి వెళ్లడానికి వీల్లేదు అని వరాలు కండిషన్ పెట్టడంతో పాటుగా ఫోన్ కూడా పగలకొట్టేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఏం జరుగుతుందో చూడాలి..