E-Paper
Advertisement

బెంగుళూరు త్రిఫుల్ మర్డర్ కేసు.. చంపింది ఇద్దరు కాదు, ఏఐతో కలిసి ముగ్గురు-షాకైన పోలీసులు

బెంగుళూరు త్రిఫుల్ మర్డర్ కేసు.. చంపింది ఇద్దరు కాదు, ఏఐతో కలిసి ముగ్గురు-షాకైన పోలీసులు
Advertisement

Bengaluru Triple Murder Case: అర చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత టెక్నాలజీ వినియోగం జోరందుకుంది. ఏఐ వచ్చిన తర్వాత మంచి కంటే చెడు కోసం ఉపయోగిస్తున్న సందర్భాలు క్రమంగా వెలుగులోకి వస్తోంది. తాజాగా బెంగుళూరు త్రిపుల్ మర్డర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులతోపాటు టెక్నాలజీని సహ నిందితులుగా భావిస్తున్నారు బెంగళూరు పోలీసులు. ప్రస్తుతం ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

బెంగుళూరు త్రిపుల్ మర్డర్ కేసు-కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో సీగేహళ్లి అపార్ట్‌మెంట్‌లో జూన్ 22న జరిగిన త్రిపుల్ మర్డర్ కేసు  జరిగింది. ఇంటి యజమాని సోమసుందర్‌, ఆయన భార్య ముత్తులక్ష్మి, చిన్న కుమార్తె సుప్రియ హత్య కర్ణాటక వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితులు సోమసుందర్ పెద్ద కూతురు శ్వేత-ఆమె ప్రియుడు కెన్నెత్. శ్వేత-ఆమె ప్రియుడు కెన్నెత్ చేసిన ఈ హత్యకు ఏఐ చాట్‌బాల్ సహకరించింది. అది ఇచ్చిన ఇన్‌పుట్స్ ఆధారంగా పేరెంట్స్-చెల్లిని.. ప్రియుడితో సాయంతో హత్య చేసింది శ్వేత.

Advertisement

శ్వేత హిస్టరీ ఏంటి? నిందితురాలు శ్వేత బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో పని చేసేది. అక్కడే కెన్నెత్‌తో పరిచయం ఏర్పడింది.. మరింత దగ్గరయ్యారు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ శ్వేత ఆ తర్వాత ఉద్యోగం పోయింది. ఇద్దరూ కొంతకాలంగా బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉన్నారు. శ్వేత తండ్రి సోమ సుందర్ ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. కెన్నెత్ తండ్రి విమానాలను తయారు చేసే ఓ సంస్థలో పని చేస్తున్నారు.  కూతురు లివింగ్ టు గెదర్ గురించి తెలుసుకున్న పేరెంట్స్ ఆమెని దూరంగా పెట్టారు. అంతకుముందు తల్లి ముత్తులక్ష్మి వద్ద రూ. 50 లక్షలు అప్పుగా తీసుకుంది శ్వేత. ఆ డబ్బు తన సహ జీవన భాగస్వామి కెన్నెత్ కోసం ఖర్చు పెట్టింది. తల్లి ఆ డబ్బును అడుగుతుండడం గమనించింది శ్వేత. ఆ డబ్బు గురించి తల్లి ఒత్తిడి చేయడంతో తన సహజీవన భాగస్వామితో కలిసి కుటుంబాన్ని చంపాలని డిసైడ్ అయ్యింది.

శ్వేత-కెన్నెత్ ప్లాన్ లోకి ఏఐ ఎంట్రీ-తన తల్లిదండ్రులు-సోదరిని చంపాలని నిర్ణయించుకుంది శ్వేత. ముగ్గుర్ని ఎలాగ హత్య చేయాలన్నదానిపై ఆరు నెలలుగా ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. వారిద్దరికీ ఐటీపై కాస్త పట్టు ఉండడంతో సాంకేతిక పరిజ్ఞానం తోడైంది. పక్కాగా మూడు హత్యలు చేయడానికి టెక్నాలజీని ఉపయోగించారు. ఆ సమయంలో వారి ప్లాన్‌లోకి ఏఐ ఎంట్రీ ఇచ్చింది. హత్యలు ఎలా చేయాలి? పోలీసుల నుండి ఎలా తప్పించుకోవాలి? డెడ్ బాడీలను ఆనవాళ్లు లేకుండా ఎలా చేయాలి? అనేవాటి గురించి ఏఐ నుంచి సమాధానాలు రాబట్టారు శ్వేత-కెన్నెత్.

Advertisement

ఎక్కడ చిక్కారు?  ప్లాన్  ప్రకారం.. తల్లిదండ్రులను-చెల్లిని..  తన ప్రియుడు-ఏఐతో కలిసి హత్య చేసింది శ్వేత. మరణానికి ముందు పోలీసులకు సోమ సుందర్ చెప్పిన సాక్ష్యం ఆధారంగా శ్వేత -కెన్నెత్‌ల కోసం గాలింపు చేపట్టారు. హత్య తర్వాత వీరిద్దరు కొంతకాలం బెంగళూరు శివార్లలో టూవీలర్‌పై తిరిగారు. ఆ తర్వాత వేర్వేరు బస్సుల్లో పుదుచ్చేరికి వెళ్లారు. తొలుత పుదుచ్చేరిలో శ్వేతను అరెస్టు చేశారు పోలీసులు. ఆ తర్వాత అక్కడే ఓ బార్‌లో కెన్నెత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరినీ బెంగళూరుకు తీసుకొచ్చి విచారించారు పోలీసులు.

ALSO READ: ట్రెక్కింగ్‌ చేస్తూ.. 500 అడుగుల లోయలో పడ్డ యువకుడు.. వీడియో వైరల్!

విచారణలో అసలు విషయాలు-పోలీసుల విచాణరలో మొత్తమంతా చెప్పేశారు నిందితులు శ్వేత-కెన్నెత్. పైన చెప్పిన వివరాలను బయటపెట్టారు. ఏఐని ఉపయోగించుకుని ఇదంతా చేశామని వెల్లడించారు. చాట్‌బాల్ ఇచ్చిన సూచనలను తాము ఫాలో అయినట్టు తెలిపారు. ఏఐ చాట్‌బాల్ నిందితుల అడిగిన ప్రశ్నల వివరాలను తెలుసుకునేందుకు ఏఐ టూల్‌ కంపెనీకి దర్యాప్తు అధికారులు లేఖ రాశారు. ఏఐ టూల్‌ కంపెనీ ఇచ్చే వివరాలను డిజిటల్‌ సాక్ష్యంగా పరిగణిస్తామని కేఆర్‌పురం పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ఏఐని ఉపయోగించినట్లయితే దర్యాప్తు సంస్థలు ఏఐ కంపెనీ నుండి రికార్డులు, లాగ్‌లు లేదా సమాచారాన్ని కోరవచ్చు. ఏఐ పాత్రను డిజిటల్ సాక్ష్యంగా దర్యాప్తులో ఒక అంశంగా పరిగణిస్తున్నారు. టెక్నాలజీని సన్మార్గంలో ఉపయోగించాల్సిందిపోయి నేరాలకు వినియోగించిన  ఈ ఉదంతం టెక్ యుగంలో కాస్త ఆందోళన కలిగిస్తోంది.

Related News

ఘోరం.. నగల కోసం వృద్ధురాలిని చంపేసి.. సూట్‌కేసులో కుక్కేసి, ఆపై..

ట్రెక్కింగ్‌ చేస్తూ.. 500 అడుగుల లోయలో పడ్డ యువకుడు.. వీడియో వైరల్!

ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్.. జంతర్‌మంతర్ వేదికగా రగిలిన నిరసన జ్వాలలు

Delhi Protests: ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జ్‌పై కోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ!

Sonam Wangchuk: ఆ హామీ ఇస్తే.. దీక్ష విరమిస్తా..కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ!

Rahul Gandhi: మోదీ సర్కార్‌కు రాహుల్ గాంధీ వార్నింగ్.. పేపర్ లీకుల లెక్కలు బయటపెట్టిన రాహుల్!

Chinta Mohan: మోడీకి రాజ్యాంగం తెలీదు.. అమిత్ షా రాజ్యాంగం నడుస్తోంది! చింతా మోహన్ సంచలన కామెంట్స్

Big Stories

Advertisement
×