E-Paper
Advertisement

Podarillu Today Episode : మనీషాకు తెగ నచ్చేసిన పెద్ది.. కన్నాను అమ్మగా చూసుకున్న మహా.. చక్రీ హ్యాపీ..

Podarillu Today Episode : మనీషాకు తెగ నచ్చేసిన పెద్ది.. కన్నాను అమ్మగా చూసుకున్న మహా.. చక్రీ హ్యాపీ..
Advertisement

Podarillu Today Episode June 8th : కేశవ మెకానిక్ షాప్ కి వెళ్లేందుకు బయట రెడీగా ఉంటాడు.. నిన్నంతా తిరిగాను కదా బండి కూడా కింద పడిపోయింది కదా.. అందుకే ఇది మొరాయించినట్లు ఉంది అని బండికి ఏమైందో చూస్తూ ఉంటాడు.. అయితే వెనకాలే శైలు రావడం చూసి నువ్వు ఎందుకు నా వెనుక పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని కేశవ సీరియస్ అవుతాడు. నీ కొంచమైనా బుద్ధుందా నువ్వు అన్ని సార్లు ఫోన్ చేశావు అవతల మనిషి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోవా నువ్వు అని శైలజా ని చంప పగలగొడతాడు.. ఇంకొకసారి నా వెనకాల పడ్డ నాకు ఫోన్లు చేసిన కూడా మర్యాదగా ఉండదు నీకు అని వార్నింగ్ ఇస్తాడు.. దాంతో శైలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కేశవ శైలుని అనవసరంగా కొట్టానే అని బాధపడిపోతూ ఉంటాడు..

మనీషాతో పెద్ది ప్రేమలో పడతాడా..?

సైటుకు వెళ్లిన తర్వాత పెద్ది భోజనం చేద్దామని అనగానే బంసి మనిషా కూడా వచ్చింది అన్నయ్య అని అంటాడు. అవునా మనిషా వచ్చిందా.. అయితే అందరం కలిసి భోజనం చేద్దాం పదండి అని అక్కడ కూర్చోగానే మనిషా హిందీకి పెద్ది రియాక్షన్ కాస్త కామెడీగా అనిపిస్తుంది.. మనిషా మాటతో పెద్ది కాస్త నవ్వుకుంటాడు.. బన్సీ ఇలాగే మీ చెల్లెలితో మాట్లాడితే నేను త్వరలోనే హిందీ కూడా నేర్చేసుకుంటాను అని అంటాడు ముగ్గురు కలిసి చాలా సరదాగా సంతోషంగా భోజనం చేస్తారు.. చూస్తుంటే పెద్ది మనిషా త్వరలోనే కలిసిపోయేలా కనిపిస్తున్నారు..

నారాయణ లవ్ స్టోరీ చెప్తాడా..?

Advertisement

కన్నా కి జ్వరం ఎక్కువైంది టాబ్లెట్స్ అయిపోయాయి. ఎలాగైనా సరే తెప్పించాలి అని నారాయణ దగ్గరికి మహాలక్ష్మి వెళ్తుంది. మహాలక్ష్మి నారాయణ దగ్గరికి వెళ్లి బయటికి వెళ్ళలేదా అని అడుగుతుంది. నువ్వు బయటికి వెళ్లి బలదుర్గ తిరగదు అని చెప్పావు కదా అందుకే వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నాను అని నారాయణ అంటాడు.. అయినా బయటికి వెళ్లి మీరు ఇప్పుడు టాబ్లెట్స్ తీసుకురావాలి అని నారాయణను మహాలక్ష్మి అడుగుతుంది. టాబ్లెట్స్ ఎందుకు ఇప్పుడు అని అడుగుతాడు నారాయణ. కన్నా కి జ్వరం వచ్చింది అని అనగానే బెండకాయకు ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అని నారాయణ అంటాడు. అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తాడు.

చక్రీ కోసం టెన్షన్ పడ్డ మహా..

రాత్రి అందరూ భోజనానికి కూర్చోగానే చక్రి ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది.. వాడికి ట్రిప్ లో లేట్ అయిందేమో ఫోన్ కూడా చేయలేదు కదా అని అనగానే.. అవును కదా మరి కనీసం ఫోన్ అయినా చేయాలి కదా అని మహాలక్ష్మి బాధ పడిపోతూ ఉంటుంది. అయితే మహా మాత్రం అందరూ భోజనం చేస్తున్న సరే చక్రి కోసం వెయిట్ చేసే తర్వాత తింటాను అని అంటుంది. ఆ మాట వినగానే కేశవ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఇక చక్రి రాగానే మహాలక్ష్మి బయట ఎదురుచూస్తూ కనిపించడం చూసి చక్రీ ఏంటి మొగుడు కోసం వెయిట్ చేస్తున్నట్లు వెయిట్ చేస్తుంది కదా.. అని లోలోపలే సంతోష పడిపోతూ ఉంటాడు.. ఏంటండీ లేట్ అవుతుందని చెప్పచ్చు కదా అని మహాలక్ష్మి చక్రిని ఇంటికి రాదని అడుగుతుంది.. నేను లేట్ అవుతుందని అన్నయ్యకి ఫోన్ చేసి చెబుదామనుకున్నానండి. కానీ మర్చిపోయాను అని అనగానే నాకు కూడా ఫోన్ ఉంది. నాకు ఫోన్ చేయొచ్చు కదా అని మహా అనగానే చక్రి ఆలోచనలో పడతాడు. కానీ కేశవ వచ్చి తను ఇందాకటి నుంచి నీకోసం వెయిట్ చేస్తుంది రా ఇదంతా చూస్తుంటే నీ ప్రేమలో పడిపోయినట్లు కనిపిస్తుంది అని అనగానే చక్రి గాల్లో తేలిపోతుంటాడు.

కేశవ, చక్రీ గొడవ..

Advertisement

వదిన బాగా చూసుకుని ఉంది అని మాధవతో చెప్పగానే మాధవ్ నాకు తెలుస్తుంది కదరా నీకు జ్వరం తగ్గిపోవడానికి కారణం తనే అని అంటాడు.. ఉదయం లేవగానే చక్రి పళ్ళు తోముకుంటూ కన్నాతో మాట్లాడుతూ ఉంటాడు.. అయితే మహాలక్ష్మికి థాంక్స్ చెప్పగానే తను మీరు రాలేదని ఇంట్లో వాళ్ళంద టెన్షన్ పడుతున్నారు కదా అందుకే నేను మీకోసం వెయిట్ చేశాను అని అనగానే అందరూ నవ్వుకుంటారు. మహాలక్ష్మి వెళ్లగానే కేశవం మళ్లీ అదే మాట అనగానే ఇద్దరు ఒకరి వెనకాల ఒకరిపడి గొడవకు దిగుతారు.. అది అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఇక మళ్లీ చక్రి మహాలక్ష్మి టాపిక్ ని గుర్తుచేసుకొని గొడవపడతారు.

చక్రీ హర్ట్ అయ్యాడు..

మీ ఇంటర్వ్యూ ఉంది అని చెప్పగానే చక్రి తనని ఇంటర్వ్యూ దగ్గరికి తీసుకెళ్లడానికి కారుని తీసుకొని వస్తాడు. ఇద్దరు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు చక్రి చాలా మౌనంగా సీరియస్ గా ఉండడంతో మహాలక్ష్మి ఏమైంది మిమ్మల్ని రెండు దెబ్బలు కొట్టారా ఒక్క దెబ్బ కొట్టారా? ఎక్కడ కొట్టారు మొహం అలా పెట్టుకున్నారు అని వెటకారంగా మాట్లాడుతుంది. వాళ్లు కొట్టిన దెబ్బల కంటే మీరన్న మాట నాకు బాధగా ఉంది అని చక్రి అంటాడు. దేని గురించి మీరు మాట్లాడుతున్నారు ఏమైంది మీకు అని చక్రి ని మహా అడుగుతుంది. కోసం ఎవరు ఎదురు చూడలేదు కానీ రాత్రి మీరు నా కోసం ఎదురు చూశారని చాలా సంతోషపడ్డాను. వాళ్లకి నాకోసం ఒకరు ఎదురుచూస్తున్నారు అని సమ్మర్ పడిపోయే లోగా ఇంట్లో వాళ్లకోసం అని నన్ను బాధ పెట్టారు అని చక్రి అంటాడు. అయ్యో దానికోసం మీరు ఫీల్ అవుతున్నారా అయితే సారీ అని మహాలక్ష్మి అంటుంది. చక్రి మహా ఇద్దరు కూడా చూస్తుంటే త్వరలోనే మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారేమో అని అనిపిస్తుంది..

ఇంటర్వ్యూ లో సెలెక్ట్..

మహాలక్ష్మి ఇంటర్వ్యూకి లోపలికి వెళ్తుండగా అక్కడ ఒక వ్యక్తి మహాలక్ష్మి తో పాటు పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. క్రమంలో ఇద్దరు కూడా ఒకేసారి పైకి ఎక్కడంతో గుద్దేసుకుంటారు. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కాస్త కామెడీగా అనిపించిన సరే మహాలక్ష్మి మాత్రం చిరాకు పడుతుంది. ఆ వ్యక్తి మహాలక్ష్మిని తన అందాన్ని పొగిడిస్తూ ఉంటాడు. ఇక మొత్తానికి మహాలక్ష్మి కొత్త జాబ్ లో ఇంటర్వ్యూ కోసమని అక్కడికి వెళుతుంది. అందరూ వింతగా ప్రవర్తించడంతో మహా షాక్ అవుతుంది. మహాలక్ష్మి గుద్దిన వ్యక్తి అక్కడ బాసన్ తెలుసుకొని మహా ఇక జాబు రాదని వెనక్కి తిరుగుతూ వెళ్ళిపోతూ ఉండగా యువర్ సెలెక్టెడ్ అని అతను అంటాడు ఆ మాట వినగానే మహా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం..దెయ్యంగా మారిన మీనా.. రోహిణికి మైండ్ బ్లాక్..

Related News

8 ఏళ్లకే తల్లి మరణం.. ఆపై తండ్రి కూడా..బిగ్ బాస్ కంటెస్టెంట్ జీవితంలో అన్నీ కన్నీళ్లే!

బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?

Ye devi varamo Neevu : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. హీరో అవుట్..

Podarillu Manisha : అమ్మబాబోయ్.. మనీష బాగా రిచ్.. హీరోయిన్ల కంటే ఎక్కువే..

Nindu Noorella Saavasam Serial Today Episode September 10th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ ఆత్మను వేరు చేసిన ప్రచండ 

సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. శుభం కార్డు పడుతుందా..?

Karthika Deepam 2 Serial Today Episode September 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఒకరినొకరు కొట్టుకున్న శివనారాయణ, దక్షిణమూర్తి      

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. బాలు దెబ్బకు గుణ ఫ్యూజుల్ అవుట్.. చివరిలో ట్విస్ట్..

Big Stories

Advertisement
×