E-Paper
Advertisement

Tanveer Ahmed: డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ చూపించి.. టీమిండియాలోకి అడుగు పెట్టు

Tanveer Ahmed: డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ చూపించి.. టీమిండియాలోకి అడుగు పెట్టు
Advertisement

Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ, టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య త్వరలో టీమిండియా టి20 సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త టీమిండియా జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇందులో శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ దక్కగా… తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. ఈ క్రమంలోనే 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్య వంశీని కూడా టీమిండియాలోకి తీసుకోబోతున్నారు. ఇలాంటి క్రమంలో 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ చూపించిన తర్వాతే టీమిండియాలో అడుగు పెట్టాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ చూపించి.. టీమిండియాలోకి అడుగు పెట్టు

Advertisement

ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో త్వరలో వరుసగా టీమిండియా టి20 సిరీస్ లు ఆడనుంది. ఇలాంటి నేపథ్యంలో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం వచ్చింది. అయితే వైభవ్ సూర్యవంశీని తీసుకోవడం పట్ల పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలో అడుగుపెట్టేముందు… తన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ చూపించాల్సిందేనని డిమాండ్ చేశారు. వైభవ్ సూర్య వంశీ వయస్సు విషయంలో మొదటి నుంచి తాను అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నానని వెల్లడించారు. వాడు పదిహేను సంవత్సరాలు కాదని మొత్తుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వైభవ్ సూర్యవంశీ వయస్సు కచ్చితంగా 20 నుంచి 25 మధ్యలో ఉంటుందని ఆరోపణలు చేశారు. వాడు 15 ఏళ్లు అంటూ బిల్డప్ ఇస్తున్నట్లు ఫైర్ అయ్యారు. టీమిండియా కు ఆడే ముందు కచ్చితంగా తన వయసు పై క్లారిటీ ఇచ్చి.. తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.

లేకపోతే వైభవ్ వయస్సు విషయంలో ఐసీసీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. వైభవ్ సూర్య వంశీని నడిరోడ్డుకు ఈడ్చుతానని కూడా వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్. వైభవ్ సూర్య వంశీ వయసు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా నాటకాలు ఆడుతోందని ఫైర్ అయ్యారు. వైభవ్ సూర్య వంశీకి బోన్ టెస్ట్ చేస్తే అసలు రంగు బయటపడుతుందని బాంబు పేల్చారు. అప్పటివరకు తాను నిద్రపోనని స్పష్టం చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ అభిమానులు కౌంటర్లు పేల్చుతున్నారు. ఆడడం చేతకాని దద్దమ్మలు అందరూ… 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ పైన ఇలా ఏడుస్తున్నారని ఆగ్రహించారు.

Advertisement

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

 

Related News

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

కామన్వెల్త్ గేమ్స్‌-2026లో షాకింగ్ ఘటన.. గాల్లో విన్యాసాలు, పట్టు తప్పి కిందపడిన జిమ్నాస్ట్

ముఖం మీద ఉమ్మేసినా, తుడిచేసుకుంటోన్న‌ షాహీన్ అఫ్రిది

ఉస్మాన్ తారిక్ ది త్రో బౌలింగ్…లైవ్ మ్యాచ్ లోనే ప‌రువు తీసిన టిమ్ డేవిడ్

టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

Big Stories

Advertisement
×