E-Paper
Advertisement

Podarillu Today Episode : విడాకులు తీసుకోమని చెప్పిన హారిక.. మహాకు షాకిచ్చిన చక్రీ.. లాయర్ ను కలిసిన మహా, చక్రీ..

Podarillu Today Episode : విడాకులు తీసుకోమని చెప్పిన హారిక.. మహాకు షాకిచ్చిన చక్రీ.. లాయర్ ను కలిసిన మహా, చక్రీ..
Advertisement

Podarillu Today Episode March 15th : నిన్నటి ఎపిసోడ్ లో.. మహాలక్ష్మికి ఫోన్ రావడంతో నేను అర్జెంటుగా మా ఫ్రెండ్ ని కలవాలి బయటకు వెళ్తున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహా ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవాలి అని చక్రి కూడా ఆమెను ఫాలో అవుతూ వెళ్ళిపోతాడు.. మహా హారికను కలవడానికి ఒక రెస్టారెంట్ కి వెళుతుంది.. వెనకాల వెళ్లిన చక్రి ఆమెను ఫాలో అవుతూ ఆ రెస్టారెంట్ కి వెళ్తాడు. నిన్ను కలవడానికి అని వచ్చావు. నువ్వు మీ వదినని కలవడానికి వచ్చావా వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని చక్రి అనుకుంటాడు.. అయితే వాళ్ల వెనకాలే తెలియకుండా అక్కడ కూర్చుంటాడు. చక్రిని నేను కావాలని పెళ్లి చేసుకోలేదు అసలు ఏం జరిగింది అన్నది మహాలక్ష్మి హారికకు చెప్తుంది. భూషణ్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఇదంతా చేసావా అసలు నమ్మలేకపోతున్నాను మహా అని హారిక అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నువ్వు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న సరే నువ్వు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న సరే.. ఎవరు అవునన్నా కాదన్నా కూడా మీ ఇద్దరికీ ఇప్పుడు అధికారికంగా పెళ్లయిపోయినట్లే.. అరే సర్టిఫికెట్ కూడా వచ్చింది కాబట్టి మీరిద్దరూ అఫీషియల్ గా భార్య భర్తలు.. మీకు ఆ పెళ్లి ఇష్టం లేకపోతే వెంటనే విడాకులు తీసుకో అని హారిక అంటుంది. అప్పుడు నువ్వు ఆ ఇంట్లోంచి వెళ్లిన ఎవరూ ఏమీ అనుకోరు అని హారిక చెప్పడంతో మహాలక్ష్మి దాని గురించి ఆలోచిస్తుంది. చక్రి మాత్రం వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు. హారిక మా పిన్ని కొడుకు పెళ్లి ఉంటే ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్ ను కలవడానికి అని చెప్పేసి బయటకు వచ్చాను. నేను వెళ్ళాలి మహా లేకపోతే మీ అన్నయ్యకి డౌట్ వస్తుంది అని హారిక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

వీళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారో అర్థం కావడం లేదే అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. వెయిటర్ వచ్చి ఆర్డర్ చెప్పండి అని గోల చేస్తుంటే అతనికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాడు. హరిక మహా ఇద్దరు వెళ్ళిపోతుంటే అక్కడున్న మెనూని అడ్డుపెట్టుకొని తప్పించుకుంటాడు.. ఇక రాత్రి అవ్వగానే మహా నిద్రపోతూ ఉంటుంది.. ఒక్కసారిగా చక్రి తో మాట్లాడి విడాకులు ఇవ్వను అని అన్నట్లు కలగంటుంది.. చక్రి నిజంగానే అలా చెప్తాడని కంగారు పడిపోతూ ఉలిక్కిపడి లేస్తుంది.. ఆ తర్వాత చక్రి మాత్రం బయట ఒంటరిగా కూర్చుని ఏం మాట్లాడుకున్నారో ఏం చెప్పారో అర్థం కావడం లేదు అని బాధ పడిపోతూ ఉంటాడు. మహా మీతో మాట్లాడాలి బయటికి వెళ్దాం పదండి అని అంటుంది.. డిగ్రీ నిజంగానే ఇది నిజమా నా బ్రమ అని ఆలోచిస్తూ ఉంటాడు. నీ మహా మాత్రం రండి బయటికి వెళ్దామని అంటుంది..

నీతో ఒక కీలకమైన విషయం గురించి చెప్పాలి అని మహా అంటుంది.. ఏంటండీ అంత కీలకమైన విషయం అని చక్రి అడుగుతాడు.. నేను ఇవాళ మా వదిన ని కలిసాను.. మన పెళ్లి ఎలా జరిగిందో అన్న నిజాన్ని చెప్పాను. అయితే ఇక్కడ ఉంటే ఇంకా ఇబ్బందులు పడతానని విడాకులకి అప్లై చేయమని చెప్పింది అని మహాలక్ష్మి అంటుంది. ఇదంతా పుల్ల పెట్టింది ఆవిడ అన్నమాట అని చక్రి కంగారు పడిపోతూ ఉంటాడు. మనిద్దరం కలిసి విడాకులు తీసుకుందామని మహాలక్ష్మి అనగానే చక్రి అంతా మీ ఇష్టమేనా నాకంటూ ఒక ఇష్టాలు లేవా అని అంటాడు. ఆ గోల్ వేరు నా ఆశయాలు వేరు వాటికి ఈ పెళ్లి అడ్డు రాకూడదు మనము లాయర్ ని కలిసి విడాకులు తీసుకున్నాము అని మహా అంటుంది. ఆ మాటతో చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.

Advertisement

ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఉదయం లేవగానే చక్రితో మహా మాట్లాడుతుంది.. చక్రి మాత్రం పొంతన లేకుండా ఏదేదో సమాధానం చెప్తాడు. ఇవాళ మనం లాయర్ ని కలవడానికి వెళ్దామని అనుకున్నాం కదా మీరు మర్చిపోయారా అని మహాలక్ష్మి అడుగుతుంది.. దానికి చక్రి మీరు ఇంకా మర్చిపోలేదా అని అంటాడు. ఆ తర్వాత ఈరోజు మనం ఎలాగైనా సరే లాయర్ తో మాట్లాడాలి. విడాకుల గురించి చెప్పాలి అని మహాలక్ష్మి అనగానే మంచి లాయర్ దొరకాలంటే కనీసం వారం రెండు వారాలు పడుతుంది అని చక్రి అంటాడు.. మీరు ఇలా అంటారు అని నేనే ఒక లాయర్ ని వెతికి పెట్టాను ఆయన కలవడానికి మనం వెళ్దాము అని మహాలక్ష్మి అంటుంది..

Also Read :నిజం చెప్పేసిన అమూల్య.. నోరువిప్పిన ప్రేమ.. రామరాజు ఇంటికి తిరిగివచ్చిన అమూల్య..

దేవుడా ఏంటయ్యా నాకు ఈ కర్మ ఎప్పుడు ఏదో ఒకటి అడ్డుపెట్టి చెడగొడతావు కదా.. దీన్ని కూడా అలా చెడగొట్టే అని దేవుని వేడుకుంటూ ఉంటాడు చక్రి.. మహాలక్ష్మి చక్రి ఇద్దరూ కలిసి ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు. ఆ లాయరు టైం పడుతుంది కాస్త వెయిట్ చేయండి అని చెప్పగానే చక్రి ఇది ఆగిపోతే బాగుండు.. దేవుడు మా ఇద్దరిని కలపడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుండు అని చక్రి అనుకుంటూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×