E-Paper
Advertisement

Cuttack: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఐసీయూలో చెలరేగిన మంటలు, 10 మంది రోగులు మృతి

Cuttack: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఐసీయూలో చెలరేగిన మంటలు, 10 మంది రోగులు మృతి
Advertisement

Cuttack: ఒడిశాలోని కటక్‌ సిటీలో ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏం జరిగిందో తెలీదుగానీ అర్ధరాత్రి ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది రోగులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అసలేం జరిగింది?

ఒడిషాలోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

Advertisement

ఒడిశాలోని కటక్‌ SCB మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లోని ట్రామా కేర్ ఐసీయూలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తొలుత చిన్నగా రేగిన మంటలు ఆ తర్వాత ఐసీయూని చుట్టుముట్టాయి. ఈ ఘటనలో కనీసం 10 మంది రోగులు మరణించారు.

మరో 11 మంది ఆసుపత్రి సిబ్బందికి కాలిన గాయాలు అయ్యాయి.  వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనలో ఐసీయూలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు ఉన్నారు. మంటలు రావడం అలర్టయిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే అగ్నిమాపక సంబంధించి సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే 10 మంది ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు.

Advertisement

ఐసీయూలో చెలరేగిన మంటలు, 10 మంది రోగులు మృతి

SCB ఆసుపత్రి ఒడిశాలో ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికి ఒడిశా ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి ముఖేష్ మహాలింగ్‌తో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి పరిస్థితి అడిగి తెలుసు కున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులను సీఎంతోపాటు మంత్రులు పరామర్శించారు.

ఘటనలో వార్డులో దాదాపు 30 మందికి పైగానే పేషెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో 23 మంది రోగులను ఇతర విభాగాలకు తరలించారు. గాయపడిన రోగులకు సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్ మాఝీ. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ సంఘటనపై న్యాయ విచారణ ఆయన ఆదేశించారు.  ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ALSO READ: కాన్షీ రామ్‌కు భారతరత్న ఇవ్వాలి.. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ బహిరంగ లేఖ!

 

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×