E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ మాటతో కన్నా కన్నీళ్లు.. సెంటిమెంట్ తో ఏడ్పించేశారు.. కన్నాను కొట్టిన మహా..ట్విస్ట్ ఇదే..

Podarillu Today Episode : చక్రీ మాటతో కన్నా కన్నీళ్లు.. సెంటిమెంట్ తో ఏడ్పించేశారు.. కన్నాను కొట్టిన మహా..ట్విస్ట్ ఇదే..
Advertisement

Podarillu Today Episode May 4th : తనకి బాధ చిన సంతోషం వచ్చినా ఆ ప్లేస్ లో ఉంటాను అని చెప్పాడు కదా.. అయితే కచ్చితంగా తను అక్కడే ఉంటాడేమో అని  మహాలక్ష్మి అనుకుంటుంది. వెంటనే ఈ విషయాన్ని చక్రీతో చెప్పి కన్నా అక్కడ ఉన్నాడో లేదో తెలుసుకోమని చెప్పాలి అని అనుకుంటుంది.. చక్రి కి ఫోన్ చేసిన మహా కన్నా దొరికాడా అని అడుగుతుంది. ఊరంతా వెతుకుతున్నామండీ కానీ ఎక్కడ కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లాడు అని చక్రి అంటాడు. ఇది నేను ఒక అడ్రస్ చెప్తాను మీరు అక్కడికి వెళ్లి వెతకండి అక్కడ ఉంటాడో లేదో చూద్దామని మహాలక్ష్మి అంటుంది. ఈ అడ్రస్ గురించి మీకు ఎలా తెలుసు అని అనగానే నాకు దీని గురించి తెలుసు.. రోజు కన్నానే తనకు బాధ వచ్చినా ఆ ప్లేస్ కి వెళ్తానని చెప్పాడు ఒకసారి మీరు అర్జెంటుగా ప్లేస్ కి వెళ్లి చూడండి అని మహాలక్ష్మి అంటుంది.

కన్నా కోసం వెళ్లిన చక్రీ..

కన్నా ఇప్పుడు అక్కడే ఉంటాడు అన్నయ్య.. మహా నాకు చెప్పింది అని చక్రి అక్కడికి వెళ్తాడు. నిజంగానే మహా చెప్పిన విధంగానే.. కన్నా ఒక్కడే ఒంటరిగా అక్కడ కూర్చుని బాధ పడిపోతూ ఉంటాడు. అరె కన్నా నీకోసం మేము ఊరంతా వెతుకుతున్నాం రా నువ్వు ఇక్కడ ఉన్నావా అని చక్రి తన దగ్గరికి వెళ్తాడు. కన్న కనిపించిన సంతోషంలో మాధవ్ ఒక్కసారిగా గొప్ప కూలిపోయి బాధపడిపోతూ ఉంటాడు.. చక్రీ మాటలతో కన్నా కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎప్పటికి నువ్వు మా తమ్ముడివే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. నువ్వు ఎందుకురా ఇలా చేశావు నీకు మేమందరం లేమా అని చక్రి కన్నాతో అంటాడు. మాధవ్ బాధపడడం చూసిన కన్నా అన్నయ్య బాధపడుతున్నాడు అని అక్కడికి వెళ్తాడు.

కన్నీళ్లు పెట్టించే సీన్..

Advertisement

పెద్దన్నయ్య నీకోసం ఎంతగా వెతికాడో తెలుసా..? ఇంక నువ్వు దొరక్కున్నానంటే గుండె ఆగి చనిపోయేవాడు అని చక్రి అనగానే పెద్దన్న ఎక్కడ అని కన్నా అడుగుతాడు. ఒకసారి చూడు అన్నయ్య అక్కడే ఉన్నాడు అని చక్రి అనగానే. మాధవ్ దగ్గరికి వెళ్ళిన కన్నా నన్ను క్షమించు అన్నయ్య అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్ తో ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటారు. ఇక చక్రి మహాలక్ష్మికి అలాగే కేశవ కి ఫోన్ చేసి కన్నా దొరికాడు అని చెప్తారు. నువ్వు ఎప్పుడూ ఇలా చేయొద్దు రా నువ్వు మా ప్రాణం అని మాధవ్ అంటాడు..

బ్రతికిపోయిన నారాయణ..

చక్రి మహాలక్ష్మి కి ఫోన్ చేసి మీరు సూపర్ అండి మీరు చెప్పినట్లే కన్నా ఇక్కడే ఉన్నాడు అని చెప్పారు. కన్నా ఇక్కడే ఉన్నాడు అని అనగానే మహాలక్ష్మి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అది ఇంటికొచ్చిన నారాయణ వాడు ఎక్కడ కనిపించలేదమ్మా అని అంటాడు.. మహాలక్ష్మి కి ఫోన్ రాగానే అది విన్న నారాయణ కనిపించాడా ఇంటికి తీసుకొని వస్తున్నారా అని అంటాడు. వాడు దొరక్కొని అంటే మీ పని అయిపోయేది ఇప్పుడు వాడు దొరికాడు కదా అనేసి మహాలక్ష్మి అంటుంది.. కేశవ కు కూడా చక్రి ఫోన్ చేసి కన్నా దొరికాడు అని చెప్తారు. దాంతో చాలా సంతోషంగా ఉంటాడు..

కన్నా చెంప పగలగొట్టిన మహా..

Advertisement

కన్నా ఇంకా ఇంటికి రాలేదేంటి దొరికాడని చెప్పాడు కదా చక్రి అని కేశవ నారాయణ మహా ముగ్గురు కూడా బయట ఎదురు చూస్తూ ఉంటారు.. ఇక కన్నా రాగానే అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు.. ఎందుకురా కన్నా ఇలా చేశావు అని కేశవ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏమైనా నువ్వు ఒక పెద్ద మనిషివేనా ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు నీకు తెలియదా అని నారాయణను కన్నా అడుగుతాడు. నువ్వు తండ్రిని కూడా మర్చిపోయి కాలర్ పట్టుకుని అలా అడిగే లోపల నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.. అందుకే చెప్పాను అని అనగానే మహాలక్ష్మి కన్నా పై సీరియస్ అయ్యి చంప పగలగొడుతుంది.. కన్నా ని కొట్టడంతో మహాలక్ష్మి దగ్గరికి అందరూ వస్తారు కానీ మీరు కాసేపాగండి నేను మాట్లాడాలి అని మహాలక్ష్మి అంటుంది. ఇంట్లో వాళ్ల గురించి చాలా గొప్పగా చెప్తుంది. అందరి సంగతి వదిలేయ్ ఆ పెద్దమనిషి నిన్ను తల్లిలాగా పెంచారు ఆయన కాళ్లు పట్టుకొని క్షమాపణలు అడుగు అని మహాలక్ష్మి అనగానే కన్నా కన్నీళ్లు పెట్టుకుంటాడు. మాదవ్ రాత్రి కన్నా ఎక్కడ వెళ్ళిపోతాడు అని కాళ్ళకి కట్టేసి పడుకుంటాడు.

కన్నాకు క్లాస్ పీకిన మహా..

ఉదయం లేవగానే కన్నా చాలా బాధపడిపోదు కనిపిస్తాడు. అది చూసిన మహా విని ఆ మూడ్లోంచి బయటికి తీసుకురావాలి అని అనుకుంటుంది.. పెద్ది ఉప్మా అని చెప్పగానే ఈ ఉప్మా నుంచి ఎలాగైనా సరే బయటపడాలి అని కన్నా మహాలక్ష్మి ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోతారు.. చక్రి అడ్డంగా దొరికిపోయి ఉప్మా తినేందుకు రెడీ అవుతాడు.. ఇక మహాలక్ష్మి నువ్వు ఎప్పుడు ఇలా చెయ్యొద్దు ఆ కుటుంబం చాలా మంచి కుటుంబం అని చాలా గొప్పగా చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అందరూ టూర్ కి వెళ్లాలని అనుకుంటారు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: కడుపుమంటతో రగిలిపోయిన వల్లి.. వేదవతి దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. ఇంట్లోంచి వెళ్లిపోతున్న సాగర్..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×