E-Paper
Advertisement

Karthika Deepam 2: సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. వంటలక్క అవుట్..

Karthika Deepam 2: సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. వంటలక్క అవుట్..
Advertisement

Karthika Deepam 2: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ముందు వరుసలో ఉన్నది కార్తీకదీపం 2.. గతంలో వచ్చిన కార్తీకదీపం సీరియల్ గా ఈ సీరియల్ ప్రసారమవుతుంది. డిఫరెంట్ స్టోరీ తో ఆడియన్స్ ని ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. స్టోరీలో ఎన్ని మార్పులు జరుగుతున్నా సరే ఈ సీరియల్ ని జనాలు చూస్తూనే ఉన్నారు. అంతేకాదు కొత్త సీరియల్స్ ఎంతగా ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్న సరే చాలామంది మాత్రం కార్తీక దీపం 2 సీరియల్ ని మిస్ అవ్వకుండా చూస్తున్నారు.. ఈ సీరియల్ లో వంటలక పాత్రలో నటించిన దీప అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. మలయాళ కుట్టి. తెలుగులో ఈ సీరియల్ ద్వారా పరిచయమై మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సీరియల్ నుంచి వంటలక్క తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

కార్తీక దీపం నుంచి వంటలక్క అవుట్..

బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది వంటలక్క అలియాస్ మలయాళం బ్యూటీ ప్రేమీ విశ్వనాథ్. కార్తీకదీపం సీరియల్ తో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఈమె గురించి గూగుల్ లో నేటిజెన్లు తెగ వెతికేస్తున్నారు.. బ్యాగ్రౌండ్ గురించి అలాగే ప్రస్తుతం ఈమె చేస్తున్న సీరియల్స్ గురించి తెలుసుకునేందుకు ఆతృత కనబరుస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సీరియల్కు దీప గుడ్ బై చెప్పబోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. కార్తీకదీపం సీరియల్ టైం లో వంటలక్క సన్నగా నాజుగ్గా కనిపించింది. సీక్వల్ సీరియల్లో మాత్రం కాస్త బొద్దుగా కనిపించింది. అయితే ఈ మధ్య సన్నగా మరి నాజూగ్గా తయారైనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ క్రమంలో మలయాళంలో ఈమెకు వరుసగా అవకాశాలు కూడా వస్తున్నాయి అన్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది.. మరి ఈ సీరియల్కు నిజంగానే గుడ్ బాయ్ చెప్తుందా? లేదంటే సినిమాలకు ఆ నటించే అవకాశాన్ని అందుకుందా అన్నది తెలియాలంటే ఆమె క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాలి..

Advertisement

Also Read :‘గుండెనిండా గుడిగంటలు ‘  రోహిణి బ్యాగ్రౌండ్.. ఆస్తులు ఎంతంటే..?

వంటలక్క ఆస్తులకు ఔరా అన్నాల్సిందే..

ప్రేమి విశ్వనాథ్.. ఈ పేరు మన తెలుగు ప్రేక్షకుల్లో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ వంటలక్క అన్న పేరు వినగానే అందరికీ తక్కును గుర్తుకు వస్తుంది కార్తీక దీపం సీరియల్. ఈమె ఒకవైపు సీరియల్స్ తో పాటుగా మరోవైపు యాడ్స్, అలాగే ఈ మధ్య సినిమాల్లో కూడా కనిపించడంతో బాగానే రెండు చేతుల సంపాదిస్తూ వస్తుంది. ప్రేమి విశ్వనాథ్ ఆస్తుల విషయంపై తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంటలక్క ఆస్తులు సుమారు రూ. 40 కోట్లకు పైమాటే. తన భర్త ఆస్తులతో పాటుగా.. ఆమెకు కేరళలో రెండు స్టూడియోలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఖరీదైన ఇల్లు లగ్జరీ కార్లు ఆమె దగ్గర ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సీరియల్స్ తో పాటుగా వరుసగా సినిమాలను కూడా లైన్లో పెట్టుకుంటున్నట్లు తెలుస్తుంది..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×