Ex CM Farooq Abdullah: జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన త్రుటిలో బయటపడ్డారు. వెంటనే అలర్టయిన పోలీసులు దాడి యత్నాన్ని భగ్నం చేశారు. ఈ ఘటనలో నిందితుడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫారూఖ్ అబ్దుల్లాపై కాల్పులు
జమ్మూలోని బుధవారం గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఓ వివాహ కార్యక్రమానికి మాజీ సీఎం, ఎన్‌సీ అధినేత ఫారూఖ్ అబ్దుల్లా హాజరయ్యారు. వేడుక తర్వాత అక్కడి నుంచి ఫారూఖ్ వెనుదిరుగుతుండగా, వెనుక నుంచి ఆ వ్యక్తి కాల్పులు జరిపాడు. మాజీ సీఎం వచ్చిన నుంచి వెళ్లేవరకు నిందితుడు పెళ్లి జరిగిన రాయల్ పార్క్ ప్రాంగణంలో పొంచి ఉన్నాడు. అబ్దుల్లాపై వెనుక నుంచి పిస్టల్‌తో ఓ రౌండ్ కాల్పులు జరిపాడు.
వెంటనే అలర్టయిన పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఫరూక్ అబ్దుల్లా, ఆయన వెంట ఉన్న ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జమ్మూలోని పురానీ మండీకి చెందిన కమల్‌సింగ్‌గా గుర్తించారు.
తప్పించుకున్న మాజీ సీఎం, అలర్టయిన పోలీసులు, నిందితుడు అరెస్ట్
ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు. అతడి వయస్సు దాదాపు 65 ఏళ్లు. ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎలాంటి పశ్చాత్తాపం చెందలేదని, 20 సంవత్సరాలుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పినట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలియగానే జమ్మూకాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా స్పందించారు.
దేవుడు దయగలవాడని, తన తండ్రి తృటిలో తప్పించుకున్నారని ఎక్స్ లో రాసుకొచ్చారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయన్నారు. తెలిసిన విషయం ఏమిటంటే.. లోడ్ చేసిన పిస్టల్ కలిగిన వ్యక్తి పాయింట్ బ్లాంక్ రేంజ్ వద్ద సమీపంలో కాల్పులు జరపగలిగాడు ప్రశ్నించారు. ఆయన భద్రతా బృందం మాత్రమే తిప్పికొట్టిందన్నారు.
ALSO READ: అమ్మా.. మళ్ళీ వస్తానో లేదో తెలియదు.. యుద్ధ క్షేత్రానికి వెళ్తూ దీపికా చెప్పిన ఆఖరి మాటలు ఇవే
ఈ సమయంలో Z+ NSG రక్షణ ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఒకరు ఎలా దగ్గరగా వెళ్ళగలిగారు? సమాధానాల కంటే ఈ ఘటనలో ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఘటనపై ఒమర్ ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఘటన సమయంలో ఫారూఖ్ అబ్దుల్లా వెంట జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి, సీఎం సలహాదారు నాసిర్ సోగామి ఉన్నారు.
Allah is kind. My father had a very close shave. The details are sketchy at the moment but what is known is that a man with a loaded pistol was able to get within point blank range & discharge a shot. It was only the close protection team that deflected the shot & ensured that… https://t.co/hYBe64Eigl
— Omar Abdullah (@OmarAbdullah) March 11, 2026