E-Paper
Advertisement

Ritu chowdary: శివరాత్రి స్పెషల్.. షాకింగ్ లుక్ లో రీతూ..ఇది అస్సలు ఊహించలేదుగా!

Ritu chowdary: శివరాత్రి స్పెషల్.. షాకింగ్ లుక్ లో రీతూ..ఇది అస్సలు ఊహించలేదుగా!
Advertisement

Ritu chowdary: రీతు చౌదరి పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటిగా, జబర్దస్త్ కమెడియన్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణను అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఈమె తెలుగు బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9) రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని 13 వారాల పాటు హౌస్ కొనసాగి ఎలిమినేట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత రీతు పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు ఆదివారం విత్ స్టార్ మా పరివార్ కార్యక్రమంలో సందడి చేస్తూనే మరోవైపు బిబి జోడి సీజన్ 2 కార్యక్రమంలో డెమోన్ పవన్(Demon Pawan) తో కలిసి సందడి చేస్తున్నారు.

శివ మాల ధరించిన రీతు చౌదరి..

ఇలా బిగ్ బాస్ తర్వాత కెరియర్ పరంగా రీతు చౌదరి ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈమె నిత్యం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా గ్లామర్ దుస్తులలో సోషల్ మీడియాలో రచ్చ చేసే ఈ ముద్దుగుమ్మ శివరాత్రి పండుగ సందర్భంగా అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. శివరాత్రి పండుగ సందర్భంగా రీతు చౌదరి ఏకంగా శివమాల ధరించి కనిపించడంతో ఒక్క సారిగా అభిమానులు షాక్ అవుతున్నారు.

శివయ్య ఆశీస్సులు నీపై ఉండాలి..

Advertisement

రీతు చౌదరి ఇలా శివమాలలో కనిపించడంతో నీలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా ఇలా దైవభక్తి కూడా ఉందా అంటూ చాలామంది కామెంట్ చేయగా మరికొందరు రోజురోజుకు మీపై చాలా గౌరవం పెరుగుతుంది , ఆ శివయ్య నిన్ను చల్లగా చూడాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ ముందు వరకు కూడా రీతు అంటే చాలా నెగటివ్ ఒపీనియన్ ఉండేది కానీ ఈమె బిగ్ బాస్ వెళ్లి వచ్చిన తర్వాత తన పట్ల అందరిలోనూ చాలా మంచి అభిప్రాయం కలుగుతోందనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతున్న రీతు హౌస్ లో డెమోన్ పవన్ తో చాలా సన్నిహితంగా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇలా వీరిద్దరూ క్లోజ్ గా ఉండడంతో ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఈ వార్తలలో నిజం లేదని వీరిద్దరూ మంచి స్నేహితులని తెలుస్తోంది. ఇక రీతు ప్రస్తుతం బేబీ జోడి 2 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇక తదుపరి ఈమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయి వెండితెర సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక రీతూ ఇదివరకే పలు బుల్లితెర సీరియల్స్ లో నటిగా నటించారు. అదేవిధంగా జబర్దస్త్ కార్యక్రమంలో కూడా ఈమె కమెడియన్ గా కొనసాగి ఎంతో మంది బుల్లితెర అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా పలు కార్యక్రమాలకు యాంకర్ గా కూడా కొనసాగారు.

Also Read: Actress Trisha: నటి త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ లీడర్..ఆ ఉద్దేశం లేదంటూ!

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×