BigTV English

Satyabhama Serial Today September 19th: క్రిష్ ను కాపాడుకున్న సత్య.. నిజం తెలుసుకున్న మహదేవయ్య..

Satyabhama Serial Today September 19th: క్రిష్ ను కాపాడుకున్న సత్య.. నిజం తెలుసుకున్న మహదేవయ్య..

Satyabhama Serial Today September 19th: నిన్నటి ఎపిసోడ్ లో క్రిష్, సత్య కోసం శోభన గదిని అందంగా ముస్తాబు చేస్తారు. ఇద్దరు గదిలోకి వెళ్లగానే కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటారు. క్రిష్ సిగ్గుతో సత్య మురిసిపోతుంది. ఇక రుద్ర తన బాపును చంపడానికి పంపిన రౌడీలు మహదేవయ్య గదికి వెళ్తారు. అక్కడ కత్తులు తీసుకొని పొడుస్తారు. కానీ ఎటువంటి సౌండ్ రాకపోవడంతో దుప్పటి తీసి చూస్తారు. కానీ అందులో ఎవరు లేకపోవడంతో షాక్ అవుతారు. ఇక వెనక్కి చూసుకుంటే అక్కడ మహదేవయ్య ఇక్కడున్న అంటాడు. ఆ ఇద్దరు రౌడీలు పరిగెత్తుకొని కిందకు వస్తారు. కింద చప్పుడు చూసి క్రిష్ బయటకు వస్తాడు. అతన్ని చూసి షాక్ అవుతారు. ఇద్దరినీ రౌడీలు చుట్టు ముడతారు. కాసేపు ఇద్దరు రౌడీలను ఓ ఆట ఆడుకుంటారు. ఆ తర్వాత బయటకు వెళ్లి మళ్లీ గొడవ పడేందుకు వెళ్తారు. అప్పుడే క్రిష్ అమ్మగారు, వదిన వస్తారు. వాళ్లను రౌడీ గదిలో పెట్టి బందిస్తాడు. అడ్డుకోవాలని చూసిన సత్యను కొడితే కిందపడుతుంది. ఇక బయట బాపు అని వినిపించగా బయటకు వచ్చి చూసి షాక్ అవుతుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఈరోజు ఎపిసోడ్ విషయానికొస్తే.. తాను వెళ్లకుండా ఉంటే అనుమానం వస్తుందని రుద్ర కూడా వెళ్తాడు. రౌడీలతో గొడవ పడతాడు. క్రిష్, మహదేవయ్య రౌడీలను చితక్కోడతారు. రుద్ర రౌడీని కొట్టినట్లు నటిస్తూ అరె ఇలా జరిగిందేంటి అంటూ టెన్షన్ పడతాడు. ఇక ఈ క్రమంలో మహదేవయ్య మీదకు రుద్ర రౌడీని తోస్తాడు. అతడు నాలుగు తన్నులు తింటాడు. ఇక మహదేవయ్య తల మీద గట్టిగా కొడతాడు. దానికి మైకంలోకి వెళ్ళబోతాడు. ఇక రౌడీ అతన్ని చంపెందుకు కత్తి తీస్తాడు. అప్పుడే క్రిష్ వచ్చి బాపు అంటాడు. ఆ రౌడీ క్రిష్ ను పొడుస్తాడు.. అది చూసిన అందరు షాక్ అవుతారు. పడి ఉన్న సత్య క్రిష్ గొంతు విని బయటకు వస్తుంది. నీకేం కాదు అని అతన్ని లేపే ప్రయత్నం చేస్తుంది. ఇక మహదేవయ్య అది చూసి షాక్ అవుతాడు. పొడిచిన వాడిని పట్టుకొని తన్నుతాడు. ఇక క్రిష్ కింద పడిపోతాడు.

బాపు వాళ్లను వదలొద్దు అంటూ కింద పడిపోతాడు. ఇక సత్య క్రిష్ నీకు ఏమి కాదు. నేనున్నా అని ఏడుస్తుంది. తన మామ మహాదేయ్య దగ్గరకు వెళ్తుంది. మామయ్య క్రిష్ ను పొడిచేశారు ఆసుపత్రకి తీసుకెళదామని అడిగితే నువ్వూ వెళ్ళమ్మా అని గట్టిగా అరుస్తాడు. దాంతో భయపడిన సత్య బావగారు అంటూ దగ్గరకు వస్తే హే పో అంటూ అరుస్తాడు. దాంతో భయంతో వెనక్కి వెళ్లిన సత్య క్రిష్ నీకేం కాదు. నేనున్నాను అంటుంది. దానికి క్రిష్ సంపంగి నాకు ఏమి కాదు. బాపు జాగ్రత్త అని చెప్తాడు. ఇక క్రిష్ ను ఎలాగైనా కాపాడుకొనే ప్రయత్నం చెయ్యాలని అనుకుంటుంది. మళ్లీ మహదేవయ్య దగ్గరకు వెళ్తుంది. మామయ్య గారు క్రిష్ ను పొడిచేశారు. రక్తం వస్తుంది. హాస్పిటల్ తీసుకెళ్దాం అని అడుగుతుంది. ఇక మళ్లీ నువ్వు వెళ్ళమ్మా అని అరుస్తాడు.


ఇక టెన్షన్ పడుతున్న సత్య వెనక్కి వెళ్లి అక్కడ సోఫాలో లో ఉన్న టవల్ ను తీసుకొస్తూంది. కత్తిని తీసేస్తుంది. రక్తం పోకుండా టవల్ ను కడుతుంది. క్రిష్ నీకేం కాదు నేనున్నాను హాస్పిటల్ వెళదామని తీసుకెళ్తుంది. మహదేవయ్య రౌడీలను అడుగుతాడు. ఎవరు రా ఇలా పంపారు చెప్పండి అంటాడు. అతని నుంచి తప్పించుకొని రౌడీలు పారిపోతారు. ఇక రుద్ర కూడా మీరు పారిపొండి అని వదిలేస్తాడు. బాబుకు నేను చేయించాను అని తెలిస్తే చంపేస్తాడు అని టెన్షన్ పడతాడు. ఆ తర్వాత రుద్ర క్రిష్ ను ఆసుపత్రికి తీసుకుపోయింది వెళ్దాం పద అంటాడు.

 Satya who saved Krish.. Mahadevaya learned the truth about Rudra
Satya who saved Krish.. Mahadevaya learned the truth about Rudra

ఇక సత్య క్రిష్ ను పడుకోనివ్వకుండా చేస్తుంది. క్రిష్ నీకేం కాదు. ఏదైన మాట్లాడు అని కొడుతుంది. కత్తి పోటుతో కాదు నీ చెంప దెబ్బలతో పొయ్యేలా ఉన్నాను. కాస్త సుతి మెత్తగా కొట్టు అంటాడు. సత్య నన్ను పక్కన కూర్చో బెట్టి చక్రం నడుపుతున్నావా అని అంటాడు. క్రిష్ నిద్ర పోవద్దు ఏదైన మాట్లాడు అంటుంది. ఏదైన కథ చెప్పవా అని అడుగుతుంది. ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు పది మంది కొడుకులు అంటాడు. నా చిన్నప్పటి సంధి ఏడుగురే మారరా అని అంటాడు. దానికి సత్య చెప్పు అంటుంది. అలా ఆసుపత్రికి తీసుకెళ్తుంది. డాక్టర్లు అతన్ని పరీక్షలు చేస్తుంటే. బయట టెన్షన్ పడుతూ తిరుగుతుంది. సిస్టర్ ను అడిగితే డాక్టర్ చెబుతాడని చెబుతుంది.

 Satya who saved Krish.. Mahadevaya learned the truth about Rudra
Satya who saved Krish.. Mahadevaya learned the truth about Rudra

ఇక అంతలోపే మహదేవయ్య, రుద్ర క్రిష్ అమ్మ, నానమ్మలు హాస్పిటల్ కు వస్తారు. ఈ గొడవల జోలికి వెళ్లొద్దు అంటే వెళ్తారు. ఇప్పుడు ప్రాణాల మీదకు వచ్చింది అంటుంది. ఇక మహదేవయ్య చేయికి రక్తం కారడం ఆయన భార్య చూస్తుంది. రక్తం కారుతుంది అంటే పోనిలే అంటాడు. వాళ్ల అమ్మ సిస్టర్ ను పిలిచి కట్టు కట్టిస్తుంది. ఇక కూర్చున్న మహదేవయ్య చుట్ట కాలుస్తుంటాడు. అప్పుడే నర్స్ వచ్చి ఇది హాస్పిటల్ కాల్చడం తప్పు అంటుంది. దానికి రుద్ర మా బాపును అంటావా అని అరుస్తాడు. దానికి సత్య ఇది పబ్లిక్ ప్లేస్ స్మోకింగ్ చెయ్యడం తప్పు అంటుంది. వేరే మంది ముందు మీ మామయ్యను అవమానిస్తావా అని అరుస్తుంది. దాంతో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో క్రిష్ సేఫ్ అని డాక్టర్ చెబుతాడు. అందరు సంతోషంగా ఉంటారు. తర్వాత రోజు మహదేవయ్య ఓ వ్యక్తిని గన్ పెట్టి నన్ను చంపాలనుకున్నావా అంటే నేను కాదు నిన్ను చంపాలని చూసింది. నీ పెద్ద కొడుకు రుద్ర అంటాడు. అది సత్య విని షాక్ అవుతుంది. నిజం తెలుసుకున్న మహదేవయ్య రుద్రను ఏం చేస్తాడు అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big Stories

×