NaniOdela2.. ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth odela) దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని (Nani ) హీరోగా నటించిన చిత్రం దసరా ( Dasara). ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది అంతేకాదు ఈ సినిమాతో అటు కీర్తి సురేష్ (Keerthi Suresh), ఇటు నాని మాస్ ఇమేజ్ ను దక్కించుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలై అంతకుమించి కలెక్షన్స్ వసూలు చేసి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది దసరా. మునుపెన్నడూ చూడని విధంగా పూర్తి మాస్ పర్ఫామెన్స్ అందిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.
రూమర్స్ పై క్లారిటీ..
ఇదిలా ఉండగా శ్రీకాంత్ ఓదెల , నాని కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది అంటూ గతం నుంచే వార్తలు వినిపిస్తున్నా.. ఈ వార్తలపై నాని టీం సీరియస్ అయింది. ఇప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం లేదు అంటూ కూడా తెలిపింది
#NaniOdela 2 ..
అయితే తాజాగా ఈ విషయాన్ని ఇటీవల శ్రీకాంత్ ఓదెల ధ్రువీకరించారు. తాజాగా #NaniOdela 2 ప్రకటిస్తూ వీడియో నుండి ఒక స్నాప్ ని కూడా పంచుకున్నారు డైరెక్టర్. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా వెల్లడిస్తూ.. దసరా ప్రభావాన్ని 100 రెట్లు సృష్టిస్తానని నేను హామీ ఇస్తున్నాను అంటూ డైరెక్టర్ తెలిపారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ద్వారా.. నా ఫస్ట్ సినిమా దసరాకి నేను చెప్పిన లాస్ట్ డైలాగ్ కట్, షాట్, ఓకే.. మార్చి 7 2023న నేను ఈ డైలాగ్ చెప్పాను. అయితే సెప్టెంబర్ 18 2024న మళ్లీ యాక్షన్ అనౌన్స్మెంట్ వీడియోని షేర్ చేస్తున్నాను అంటూ తెలిపారు. 48,470, 400 సెకండ్లు అయిపోయాయి. ప్రతి సెకండ్ కూడా నేను సిన్సియర్ గా ఈ సినిమా కోసం కథ సిద్ధం చేశాను. అలాగే నేను ప్రామిస్ చేస్తున్నాను కచ్చితంగా దసరా కంటే 100 రెట్లు అద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాను అంటూ తెలిపారు. మొత్తానికైతే మళ్లీ నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలిసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
భారీ బడ్జెట్ తో నాని, శ్రీకాంత్ కాంబో..
అయితే దీనికి ప్రతిస్పందించిన నాని ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ కూడా కామెంట్లు చేయడం గమనార్హం. మొత్తానికైతే ఈ క్రేజీ కాంబినేషన్లో కొత్త కథ రాబోతుందని , భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుందని సమాచారం. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకం పై సుధాకర్ చెరుకూరి దర్శకత్వం వహించనున్నారు.
నాని సినిమాలు..
నాని విషయానికి వస్తే.. ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా దూసుకుపోతున్నారు. హీరోగా పలు చిత్రాలను ప్రకటిస్తూ భారీ పాపులారిటీ అందుకుంటున్న ఈయన.. మరొకవైపు హిట్ హిట్ మూవీ ఫ్రాంఛైజీలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు హిట్ 3 లో నటించబోతున్నట్టు హిట్ -2 సీక్వెల్లో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికైతే ఈ సినిమా సస్పెన్స్ , క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతోంది. మరొకవైపు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. మరి ఈ సినిమాలు నానికి ఎటువంటి మాస్ , క్లాస్ ఇమేజ్ ను తెచ్చి పెడతాయో చూడాలి.
March 7th 2023 – Na first cinema #Dasara ki nenu cheppina last “cut, shot ok.”
September 18th 2024 – back to saying “Action” for the announcement video of #NaniOdela2.
48,470,400 seconds have passed! Each second was spent with utmost sincerity for my next.
And I promise to… pic.twitter.com/VecxZhi5mG
— Srikanth Odela (@odela_srikanth) September 18, 2024