Debjani Modak : తెలుగు బుల్లితెరపై కన్నడ ముద్దుగుమ్మల హడావిడి ఎక్కువవుతుంది. కేవలం కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చే హీరోయిన్లు మాత్రమే కాదు బెంగాలీ నుంచి వచ్చే బ్యూటీస్ కూడా ఇక్కడ ఎక్కువగా సీరియల్స్ చేస్తూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే బెంగాలీ హీరోయిన్లు తెలుగులో సీరియల్స్ చేస్తూ వస్తున్నారు అందులో ఒకరు దెబ్జానీ మోదక్.. స్టార్ మా లో ప్రసారమైన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈమె ఆ సీరియల్ తో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేసింది. ఇక కుర్రాళ్ళు అయితే కేవలం ఆమె కోసమే ఆ సీరియల్ ని చూసేవాళ్ళు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు.. ఆ తర్వాత సత్య భామ సీరియల్ లో కూడా నటించింది. ఆ తర్వాత సీరియల్స్ చేయలేదు కానీ సోషల్ మీడియాలో.. అలాగే టీవీ షో లలో సందడి చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. తాజాగా ఈమె బర్త్ డే వేడుకలను జరుపుకుంది.. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆ ఫోటోలలో ఒక అబ్బాయి తో లవ్ సింబల్ పెట్టిన పిక్ ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.. అది చూసిన నెటిజన్లో ఆమె లవ్ లో పడింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బెంగాలీ ముద్దుగుమ్మ దెబ్జానీ తెలుగులో చేసింది కేవలం రెండు సీరియల్స్ ఏ కానీ తన అందం అభినయంతో ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది.. ఆ సీరియల్స్ 2 మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఆ తర్వాత మీకు వరుస అవకాశాలు కూడా క్యూ కట్టాయని తెలుస్తుంది.. అయితే ప్రస్తుతం తెలుగులో ఆమె ఒక్క సీరియల్ కూడా చేయలేదు. కానీ సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ అభిమానులను తన లేటెస్ట్ ఫోటోలతో ఆకట్టుకుంటూ వస్తుంది.. తాజాగా ఆమె తన బర్త్ డే వేడుకలను ఫ్రెండ్స్ తో కలిసి జరుపుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఒక అబ్బాయిని ఆమె పరిచయం చేసింది. ఒక ఫోటోలో అబ్బాయితో ఆమె లవ్ సింబల్ చూపిస్తూ కనిపిస్తుంది. అతని ఫోటో కనిపించకుండా ఒక బొమ్మని యాడ్ చేసి ఫోటోలని పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ అయితే అతని ఫేస్ ని అందరికీ చూపించేది కదా మరి ఎందుకు అలా దాచి పెట్టింది? నిజంగానే ఈమె ప్రేమలో పడిందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవ్వడంతో నిజంగానే ఏమి ప్రేమలో పడిందా అన్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై ఒక క్లారిటీ రావాలంటే ఆమె స్పందించి సమాధానం చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే..
Also Read :ఫోన్ కోసం బాలు వేట.. దినేష్ ను కిడ్నాప్ చేసిన గుణ.. మీనాకు కన్నీళ్లు తప్పవా..?
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది.. డాక్టర్ గా ఆమె వేద అనే పాత్రలో నటించింది. సీరియల్స్ లో చీరకట్టులో ఎంతో కనిపించే ఈ సత్యభామ సోషల్ మీడియాలో మాత్రం అందాల అరాచకం.. సత్యభామ సీరియల్లో నటించింది. ఎన్నెన్నో జన్మల బంధం లో యష్ పాత్రలో నటించిన నిరంజన్ సత్యభామ సీరియల్ లో కూడా హీరోగా నటించాడు. వీరిద్దరి జోడి స్క్రీన్ పై బాగా ఉండటంతో జనాలు ఈ జోడి మరోసారి సీరియల్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగులో సీరియల్స్ ఏవి చేయడం లేదు కానీ బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. ఇటీవలే ఆమె వ్యాపారం లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.. ఇక మీదట సీరియల్స్ చేస్తుందో లేదో తెలియాలంటే నెక్స్ట్ సీరియల్ అనౌన్స్ చేసేంతవరకు వెయిట్ చేయాల్సిందే..