E-Paper
Advertisement

Sabudana: సగ్గుబియ్యాన్ని ఇలా వాడారంటే మీ చర్మం గ్లాస్‌లా మెరిసిపోతుంది

Sabudana: సగ్గుబియ్యాన్ని ఇలా వాడారంటే మీ చర్మం గ్లాస్‌లా మెరిసిపోతుంది
Advertisement

ఉపవాసం చేసే సమయంలో ఎక్కువగా తినే పదార్థాల్లో సబుదానా లేదా సగ్గుబియ్యం ఒకటి. దీంతో ఖిచ్డీ, వడలు, పాయసం లాంటి వంటకాలు చేసుకుని తింటారు. అయితే, సబుదానా కేవలం ఆహారంగా మాత్రమే కాకుండా చర్మాన్ని మెరిపించేందుకు ఉపయోగపడుతుంది. సగ్గుబియ్యంలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఉడికిస్తే జెల్‌లా మారుతుంది. ఈ జెల్‌ను ముఖానికి రాస్తే అది సహజమైన ఫేస్ మాస్క్‌లా పనిచేస్తుంది. చర్మాన్ని గట్టిగా ఉంచి, సున్నితంగా కనిపించేలా చేస్తుంది. దీన్ని వాడిన తర్వాత ముఖం కొంచెం టైట్‌గా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఖరీదైన బ్యూటీ ప్రోడక్ట్స్ వాడకుండా ఇలాంటి ఫలితాలు సగ్గుబియ్యం వల్ల కలుగుతాయి.

మెరిసే చర్మం కోసం
వేసవిలో చర్మం ఎర్రబడటం, మొటిమలు రావడం సాధారణం. సగ్గుబియ్యంలోని చల్లని స్వభావం చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. తలపై లేదా ముఖంపై వేడి తగ్గించి ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే సున్నితమైన చర్మం ఉన్నవారికి కూడా ఇది సేఫ్‌గా ఉపయోగపడుతుంది. సగ్గుబియ్యంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా చర్మం క్లియర్‌గా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. తరచుగా వాడితే చర్మం మృదువుగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. ఇది నేచురల్ గ్లో ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది.

Advertisement

Also read: Hyundai Creta: హ్యూండాయ్ క్రెటా కార్ కొనాలంటే మీ నెల జీతం ఎంతుండాలి? నెలకు ఎంత ఈఎమ్ఐ కట్టాలి?

స్క్రబ్ గా, ఫేస్ ప్యాక్ గా
సగ్గుబియ్యాన్ని స్క్రబ్‌గా కూడా ఉపయోగించవచ్చు. సాధారణంగా మార్కెట్‌లో దొరికే స్క్రబ్బులు కొన్నిసార్లు చర్మాన్ని గట్టిగా చేస్తాయి. కానీ సబుదానాను నానబెట్టి పేస్ట్‌లా చేసుకుని వాడితే ఇది మృదువుగా డెడ్ స్కిన్‌ను తొలగిస్తుంది. చర్మం మీద ఉన్న మురికిని కూడా సులభంగా తీసేస్తుంది. దీంతో చర్మం మరింత శుభ్రంగా కనిపిస్తుంది. ఇంట్లోనే సగ్గుబియ్యంతో సులభంగా ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకోవచ్చు. సబుదానాను నీటిలో ఉడికించి వచ్చిన జెల్‌ను ముఖానికి రాసుకుని 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మెత్తగా, మెరిసేలా మారుతుంది. అలాగే నానబెట్టిన సబుదానాను గ్రైండ్ చేసి అందులో రోజ్ వాటర్, ముల్తానీ మట్టి, కొద్దిగా నిమ్మరసం కలిపి ప్యాక్‌గా వాడవచ్చు. ఇది చర్మాన్ని బ్రైట్‌గా చేయడంలో సహాయపడుతుంది.

Advertisement

Also read: Weight loss tips: పది రోజుల్లో 5 కిలోలు తగ్గాలంటే రోజూ ఎంతసేపు నడవాలి?

సబుదానాను తినడం కూడా చర్మానికి మేలు చేస్తుంది. ఇది తేలికగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ బాగుంటే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరానికి తగిన శక్తిని అందించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఉపవాస సమయంలో ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది. సబుదానా ఒక సాధారణ ఆహారం అయినప్పటికీ, చర్మ సంరక్షణలో కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. కెమికల్ ప్రోడక్ట్స్ వాడకుండా సహజంగా చర్మాన్ని మెరుగుపరచాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×