BigTV English

Satyabhama Serial Today Episode September 24 : క్రిష్ అసలు తండ్రి ఎవరో తెలిసిపోయింది.. గొడవలకు వెళ్లకుండా అడ్డుకున్న సత్య..

Satyabhama Serial Today Episode September 24 : క్రిష్ అసలు తండ్రి ఎవరో తెలిసిపోయింది.. గొడవలకు వెళ్లకుండా అడ్డుకున్న సత్య..

Satyabhama Serial Today Episode September 24 : నిన్నటి ఎపిసోడ్ లో రుద్రకు చిన్నా సొంత కొడుకు కాదని తెలిసిపోతుంది. ఆ విషయాన్ని సత్య కూడా విని షాక్ అవుతుంది. ఇక కింద టిఫిన్ పెట్టేందుకు సత్య అని రేణుక పిలుస్తుంది. అప్పుడే సత్య వస్తుంది. రేణుక సత్య ఎక్కడికి పోయావు. నువ్వు లేవని మా మరిది ఎలా ఉన్నాడో చూడు అని చెబుతుంది. అదేం లేదు వాళ్ల నాయనా కోసం చూస్తున్నాడు అని భైరవి అంటుంది. దానికి క్రిష్ భామ్మ కూడా వాళ్ల నాయనా కూడా అంతే చిన్నా కూడా పెట్టకుండా తినడు అంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.


ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. డైనింగ్ టేబుల్ వద్ద అందరు కూర్చొని ఉంటారు. సత్య క్రిష్ కు ఇండైరెక్ట్ గా ఏదో చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది. క్రిష్ వద్దన్నా సత్య టిఫిన్ పెడుతుంది. అప్పుడు క్రిష్ ఏమైంది సత్య మైండ్ ఎక్కడ పెట్టావ్.. వద్దన్నా పెడుతూనే ఉన్నావు. అంటే ఏమి లేదు అంటుంది. అప్పుడే మహదేవయ్య, రుద్ర టిఫిన్ చేసేందుకు కూర్చుంటారు. అప్పుడే బామ్మ ఇద్దరు నీకు రెండు చేతులు అని చెబుతుంది. క్రిష్ ఇన్నావా బామ్మ ఏమందో.. అది నిజమే కదా తప్పేముంది అంటుంది. నాకు రెండు చేతులు నా చిన్నానే అంటాడు. భైరవి ఆ ఇలా పెద్దోడును కరివేపాకులా తీసేస్తే వాడి మనసు నొచ్చుకోదు అని అంటుంది. ఇక మహదేవయ్య వాడు నా కొడుకు అలా ఏమనుకోడు అంటాడు. ఏం రుద్ర అది నిజమే కదా అని అడుగుతాడు. ఇక రుద్ర బాపు ఏమి చెప్పినా అది కరెక్టే అంటాడు. అప్పుడు సత్య ఆ నిజం ఏదో క్రిష్ కు కూడా చెప్పాలి కదా. అప్పుడే నిజమేంటో తెలుస్తుంది బావగారు అంటుంది. దానికి క్రిష్ ఎవరిని ఎలా చూసుకోవాలో బాపుకు తెలుసు అంటాడు.

Satyabhama Serial Today Episode September 24
Satyabhama Serial Today Episode September 24

ఇక సత్య మామగారు దేవుడు అని తెలుసు.. ఇద్దరినీ ఒకలాగా చుడాలిగా అంటుంది. ఒకలా చూడకుంటే నెత్తిన పెట్టుకొని ఎందుకు చూసుకుంటాడు. యూత్ లీడర్ పదవిని ఎందుకు ఇస్తాడు అంటాడు. ఆ తర్వాత మహదేవయ్య డాబా పైన చుట్ట కాలుస్తుంటాడు. అప్పుడే ఓ వ్యక్తి ఇంట్లోకి వస్తాడు. మహదేవయ్య కాలర్ పట్టుకుంటాడు.. నా కాలర్ పెట్టుకుంటావా ఎంత ధైర్యం చక్కవర్తి. తమ్ముడని కూడా చూడను చంపేస్తాను అంటాడు. ఎందుకు వచ్చావు నిన్ను రావద్దని చెప్పానుగా అంటాడు. రాకూడదు అనుకున్నాను. కానీ నా కొడుకు ప్రాణాల మీదకు తెస్తే ఎలా రాకుండా ఉంటాను అని అంటాడు. నీ కొడుకు ఎవరు కృష్ణ.. నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకు.. నిన్ను నమ్మి నీ దగ్గర వదిలి వెళ్తే నీ లాగే తయారు చేస్తావా.. గొడవలకు పంపించి ప్రాణాల మీదకు తెస్తావా.. అంటే నీ కొడుకు కాదు నా కొడుకు ఇక్కడ నుంచి ఎవరు చూడకుండా వెళ్లి పో అంటాడు. అయితే నా కొడుకుతో వెళ్తానని చక్రవర్తి అంటాడు. అయితే గతం ఏంటో మర్చిపోయావా.. గుర్తు చెయ్యమని అంటావా అంటాడు.. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. అక్కడ గొడవలు జరుగుతాయి. అన్న దమ్ములకు కొడుకులు పుట్టారు. అప్పుడే తన కొడుకులను మార్చుకుంటారు. మహదేవయ్య చక్రవర్తకి వార్నింగ్ ఇస్తాడు. బిడ్డను తీసుకెళ్తాడు. క్రిష్ వాళ్ల అమ్మను చంపేస్తాడు.


Satyabhama Serial Today Episode September 24
Satyabhama Serial Today Episode September 24

అలా ఇద్దరు కొడుకులు మారతారు. చక్రవర్తి కొడుకు క్రిష్.. మహదేవయ్య కొడుకు గురించి చెబుతాడు. నువ్వు నా కొడుకు సంస్కారంగా పెంచితే నేను పులిలా మగోడిలా పెంచాను.. నా కొడుకు అంటున్నావ్ వాడు నా అవసరానికి మాత్రమే వాడుకుంటున్న నా కోసం ఏమైనా చేసేలా చేస్తున్నా పులిలా పెంచాను అంటాడు. ఇక చక్రవర్తి బాధపడుతాడు. నా భార్యను చంపేసావు.. ఇప్పుడు నా కొడుకు ను దూరం పెట్టావు. నీకు నేను ఏమి అన్యాయం చేసానని కన్నీళ్లు పెట్టుకుంటాడు.. నా కొడుకు ముందర నా కాలర్ పట్టుకుంటే నీ ప్రాణాలను తీస్తాడు. పిలవనా చూస్తావా అంటాడు. ఇది అన్యాయం అంటాడు చక్రవర్తి. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో మహేదేవయ్య క్రిష్ కు ఆ రామ చంద్రయ్య నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనాన్నాడు. ఎమ్మెల్యే అవుట నీ కల.. అది నేర వేరేలా నేను చూస్తానని చెబుతాడు.. నువ్వు నా పక్కన ఉంటే నేను ఏదైన సాధిస్తాను అని మహదేవయ్య అంటాడు. వాడిని చంపేసి అని చెప్పగా క్రిష్ కోపంగా వెళ్తాడు.. సత్య వచ్చి అడ్డుకుంటుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big Stories

×