E-Paper
Advertisement

Devara bookings: తెరుచుకున్న దేవర టికెట్ బుకింగ్స్.. ఎగబడుతున్న ఫ్యాన్స్..!

Devara bookings: తెరుచుకున్న దేవర టికెట్ బుకింగ్స్.. ఎగబడుతున్న ఫ్యాన్స్..!
Advertisement

Devara bookings.. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవరా సినిమా కోసం అప్పుడే టికెట్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. దేవర మూవీ మేకర్స్ టికెట్స్ సోమవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పెషల్ షోలకు అనుమతి లభించడం కారణంగానే హైదరాబాద్ తో సహా పలు నగరాలలో ఈ టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సేల్స్ అలా మొదలయ్యాయో లేదో అప్పుడే టికెట్లు హాట్ కేకులా అమ్ముడు అవుతున్నాయని చెప్పవచ్చు. మొత్తానికైతే టికెట్ కోసం అభిమానులు తెగ ఎగబడుతున్నారని చెప్పవచ్చు.

దేవర టికెట్టు బుకింగ్స్ మొదలు..

Advertisement

ముఖ్యంగా పలు మల్టీప్లెక్స్ థియేటర్లలో అయితే నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ అవుట్ అవ్వడం చిత్ర బృందానికి సంతోషాన్ని కలిగిస్తోంది.. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన చాలా గ్రాండ్ గా విడుదల కాబోతున్న నేపథ్యంలో.. రెండు రోజుల క్రితం సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించాలని చిత్ర బృందం ఆశించింది. అందుకు తగ్గట్టు పూర్తీ ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ ఊహకు మించి అభిమానులు ఈవెంట్ కి రావడంతో సెక్యూరిటీ భద్రతా కారణం వల్ల షో కాస్త క్యాన్సిల్ అయింది.

Devara bookings: Devara ticket bookings are open.. Fans are rising..!
Devara bookings: Devara ticket bookings are open.. Fans are rising..!

సక్సెస్ మీట్ కోసం ఫాన్స్ వెయిటింగ్.

Advertisement

అందుకే సినిమా తర్వాత సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తారనే విధంగా అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించగా ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తొలిసారి తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ పాత్ర పోషించనున్నారు.

డిస్ట్రిబ్యూటర్స్ వీరే..

ఇకపోతే ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ విడుదల చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నట్లు సమాచారం అటు యూఎస్ లో ప్రత్యంగిరా సినిమాస్, హంసిని ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా దేవర ఓవర్సీస్ ప్రీ సేల్స్ బుకింగ్స్ తో మిలియన్ వ్యూస్ రాబడుతూ రికార్డ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా అటు అమెరికా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫీజీ తో పాటూ పీఎన్జీ బుకింగ్స్ లో కూడా అదరగొడుతోంది ఈ చిత్రం ముఖ్యంగా నార్త్ అమెరికన్ రైట్స్ ను ఇండియన్ రుపీస్ ప్రకారం రూ .26 కోట్లకు అమ్ముడు పోగా, అడ్వాన్స్ సేల్స్ రూపంలోనే రూ.21 కోట్లు రాబట్టింది ఈ చిత్రం.

ఎన్టీఆర్ కోసం వెయిటింగ్..

మరొకవైపు రెండు తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవడంతో రెండు రాష్ట్రాలలోని ఎన్టీఆర్ అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటూ సినిమాపై తమకున్న ఇష్టాన్ని చూపిస్తున్నారు. ముఖ్యంగా విడుదలకు ఇంకా పది రోజుల సమయం ఉండగానే ముందే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతుల కోసం ఎదురుచూసిన దేవర చిత్ర బృందానికి శుభవార్త లభించడంతో ఇప్పుడు టికెట్ రేటు పెంచి ప్రత్యేక షోలు నిర్వహించాలని ప్లాన్ చేశారు చిత్ర బృందం. అందులో భాగంగానే నిన్న సాయంత్రం నుంచి టికెట్ బుకింగ్ మొదలయ్యాయి. ఆల్రెడీ టికెట్ తీసేసుకున్న అభిమానులు 1AM షో కి టికెట్ బుక్ అయ్యాయి.. ఇక ఎన్టీఆర్ అన్నకోసమే వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×