BigTV English

Satyabhama Serial Today Episode September 25: సత్యను పక్కనపెట్టిన క్రిష్.. క్రిష్ ను తీసుకెళ్తానని మహదేవయ్యకు సత్య సవాల్..

Satyabhama Serial Today Episode September 25: సత్యను పక్కనపెట్టిన క్రిష్.. క్రిష్ ను తీసుకెళ్తానని మహదేవయ్యకు సత్య సవాల్..

Satyabhama Serial Today Episode September 25: చక్రవర్తి కొడుకు క్రిష్.. మహదేవయ్య కొడుకు గురించి చెబుతాడు. నువ్వు నా కొడుకు సంస్కారంగా పెంచితే నేను పులిలా మగోడిలా పెంచాను.. నా కొడుకు అంటున్నావ్ వాడు నా అవసరానికి మాత్రమే వాడుకుంటున్న నా కోసం ఏమైనా చేసేలా చేస్తున్నా పులిలా పెంచాను అంటాడు. ఇక చక్రవర్తి బాధపడుతాడు. నా భార్యను చంపేసావు.. ఇప్పుడు నా కొడుకు ను దూరం పెట్టావు. నీకు నేను ఏమి అన్యాయం చేసానని కన్నీళ్లు పెట్టుకుంటాడు.. నా కొడుకు ముందర నా కాలర్ పట్టుకుంటే నీ ప్రాణాలను తీస్తాడు. పిలవనా చూస్తావా అంటాడు. ఇది అన్యాయం అంటాడు చక్రవర్తి. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇవాళ ఎపిసోడ్ లో చక్రవర్తి మహాదేయ్యతో గొడవ పడతాడు. నా కొడుకును నాకు కాకుండా దూరం చేస్తున్నావు అని అంటాడు. నా బిడ్డగానే ఉన్నాడు. వాడి గురించి మర్చిపో. ఇక ఎప్పుడైనా ఇంటికి వస్తే చుట్టంలా చూసి వెళ్ళు లేదంటే తమ్ముడు అని కూడా చూడను అని మహదేవయ్య చక్రవర్తికి వార్నింగ్ ఇస్తాడు. ఇక చక్రవర్తి కిందకు వెళ్ళినప్పుడు క్రిష్ చూస్తాడు. బాబాయ్ ఎప్పుడొచ్చావు. ఏమైంది అలా సోచా ఇస్తున్నావ్.. ఏదైన సమస్యలో ఇరుక్కొని చెప్పలేక పోతున్నావా.. లేదా చెప్పుకోలేని బాధలు ఉన్నాయా చెప్పు బాబాయ్ నేను ఉన్నా కదా చూసుకుంటాను అంటాడు. నా కొడుకు అని చెప్పుకోలేక పోతున్నా అని తనలో తానే బాధ పడతాడు. బాపు దగ్గరకు వచ్చినవంటే అది పెద్ద సమస్య అయింటాది అని అడిగితే అవును ఆ సమస్యకు మార్గం చెప్పకుండా వదిలేయ్ మర్చిపో అని చెప్పాడు అని చెప్తాడు. అబ్బా ఏమి చెప్పాడు బాపు అని క్రిష్ అంటాడు.

Satyabhama Serial Today Episode September 25
Satyabhama Serial Today Episode September 25

ఇక బాబాయ్ నువ్వు చెప్పిన మాటలు వల్లే నేను సత్య విడిపోకుండా ఉన్నాం.. విడాకుల వరకు వచ్చిన గొడవలు తగ్గిపోయాయి. మేము హ్యాపిగా ఉన్నాం అని అంటాడు. అంతలోకే సత్య వస్తుంది.. బాగున్నారా మామయ్యా అని చక్రవర్తిని పలకరిస్తుంది. అప్పుడు క్రిష్ బాబాయ్ ఆశీర్వాదం తీసుకుందాం అని అంటాడు.. దానికి చక్రవర్తి క్రిష్ అమాయకుడు అమ్మా పాలు ఏవో నీళ్లు ఏవో తెలియని వాడు నువ్వే చూసుకో అని సత్యకు చెబుతాడు. అప్పుడు చక్రధర్ అమ్మ వస్తుంది. ఎందుకు రా నన్ను బాధ పడతావ్. నేను నీ దగ్గర ఉంటాను అంటుంది. దానికి నువ్వు అన్నయ్య దగ్గరే ఉండాలి అంటాడు. ఇక నుంచి నేను వస్తూనే ఉంటాను అని చెబుతుంది. వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తాడు.


ఇక సత్య క్రిష్ నిద్ర పోతున్నప్పుడు చూస్తాడు. సత్య నువ్వు బాపు అనుకుంటున్న ఆయన నీ కన్న తండ్రి కాడు అని తలచుకొని ఏడుస్తుంది.. ఇక నిజం చెబితే మన బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. నీకు రుజువులతో నీకు చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్తాను అని చెబుతుంది. కట్ చేస్తే.. నందిని గుమ్మం దగ్గర ఎదురు చూస్తుంది. హర్ష ఎక్కడ ఉన్నాడు. అని అడుగుతుంది. హర్ష వాకింగ్ కు వెళ్లాడు అంటుంది. అప్పుడే హర్ష మైత్రి వస్తాడు. నందిని కోపంతో రగిలి పోతుంది. నందిని ఇక రాద్దాంతం చేస్తుంది. మాటలతో తుటాలు పేలుస్తుంది. ఇండైరెక్ట్ గా పంచులు వేస్తుంది. ఆ తర్వాత మహదేవయ్య చిన్నా అని అరుస్తాడు. ముగిసిపోయింది అనుకున్న కథ మొదటికి వచ్చింది. మూసుకున్నాయని అనుకున్న నోరు మళ్లీ మొరుగుతున్నాయి. నాకు ఎమ్మెల్యే టికెట్ ను ఇవ్వనని అన్నాడు. అప్పుడు సత్య మధ్యలో మాట్లాడుతుంది.

Satyabhama Serial Today Episode September 25
Satyabhama Serial Today Episode September 25

ఇక మహదేవయ్య సత్య పై కోపంతో రగిలిపోతాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి చెప్పు బాపు అంటాడు. నోరు మూయించాలి మీడియా ముందు నోరు లేపకుండా చెయ్యాలి అంటాడు. క్రిష్ ను సత్య ఆపాలని అనుకుంటుంది. మహదేవయ్య నువ్వు పోవడం నీ పెళ్ళాంకు ఇష్టం లేదని అనుకుంటాను అంటే.. లేదు బాపు నేను వెళ్తాను అని అంటాడు. సత్య మాట వినడు. ఎపిసోడ్ అయిపోతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో సత్య మహాదేవయ్యను నిలదీస్తుంది. క్రిష్ మీ కొడుకు కాదని తెలుసు.. రుజువులతో నిరూపించి క్రిష్ ను తీసుకెళ్తాను అని ఛాలెంజ్ చేస్తుంది. సత్యను మహాదేవయ్య ఏమైనా చేస్తాడా ? అసలు నిజం ఎలా తెలుసుకుంటుంది తెలియాల్సి ఉంది.  మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big tv Kissik Talks: గోకులంలో సీత 2 మనసులో మాట బయటపెట్టిన రాశి… పవన్ ఛాన్స్ ఇస్తారా?

Big tv Kissik Talks:  కూతురి కోసం శ్రీకాంత్ కొడుకును లైన్ లో పెట్టిన రాశి..పెద్ద ప్లానింగే!

Big Stories

×