BigTV English

OTT Movie : హిలేరియస్ మలయాళ కామెడీ కోర్టు డ్రామా… ఏ ఓటిటిలో ఉందంటే?

OTT Movie : హిలేరియస్ మలయాళ కామెడీ కోర్టు డ్రామా… ఏ ఓటిటిలో ఉందంటే?

OTT Movie : ఓటీటీల్లో ఇప్పుడు మలయాళ, కొరియన్ సినిమాలకు ఉన్నంత క్రేజ్ మరే సినిమాలకు లేదన్నది వాస్తవం. తాజాగా ఓటీటీలోకి ఒక అద్భుతమైన మలయాళ కామెడీ కోర్టు రూమ్ డ్రామా వచ్చేసింది. మరి మీరు ఈ సినిమాను చూశారా? అసలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి ? అనే విషయాలను చూసేద్దాం పదండి.


ఏ ఓటీటీలో ఉందంటే?

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా ప్రముఖ నటి ఊర్వశి ప్రధాన పాత్రలో నటించిన ‘జలధార పంపు సెట్ సిన్స్ 1962’. గత ఏడాది ఆగస్టులో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ఆశిష్ చిన్నప్ప దర్శకత్వం వహించారు. రీసెంట్ గా రిలీజైన ‘జలధార పంప్ సెట్ సిన్స్ 1962’ చిత్రానికి థియేటర్లలో మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఇదే చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. జలధార పంపుసెట్ సిన్స్ 1962 వండర్‌ఫ్రేమ్స్ ఫిల్మ్‌ ల్యాండ్ బ్యానర్‌పై బైజు చెల్లమ్మ, సాగర్ రాజన్, సనిత శశిధరన్, ఆర్య పృథ్వీరాజ్ సంయుక్తంగా నిర్మించారు. కైలాస్ మీనన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, సాజిత్ సినిమాటోగ్రఫీ అందించారు. జలధార పంపు సెట్ సిన్స్ 1962లో ఊర్వశి మృణాళిని టీచర్ పాత్రను పోషించింది. ఇంద్రన్స్, సనూష, సాగర్ రాజన్, జానీ ఆంటోని, టీజీ రవి, విజయరాఘవన్, నిషా సారంగ్, జయన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.


ఒక చిన్న కేసు కోర్టుల్లో ఏళ్ల తరబడి ఎలా సాగుతుందో ఈ సినిమాలో సెటైరికల్ గా చూపించారు. జలధార పంపుసెట్ సిన్స్ 1962 చిత్రం జియో సినిమా అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ లోకి వచ్చింది. సెప్టెంబర్ 15 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన దాదాపు 13 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అయితే ఈ మలయాళ కామెడీ డ్రామాను చూసి కడుపుబ్బా నవ్వుకుందాం అనుకుంటున్న తెలుగు మూవీ లవర్స్ కు మాత్రం నిరాశ తప్పదు. ఎందుకంటే ఈ మూవీ ప్రస్తుతం మలయాళంలో మాత్రమే జియో సినిమా ఓటీటీలోప్రసారం అవుతోంది. ఒకవేళ భాష అనేది అడ్డు కాదు అనుకుంటే మాత్రం ఇంగ్షీషు సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను చూడవచ్చు.

Jaladhara Pumpset Since 1962' OTT release: Indrans, Urvashi starrer to  finally stream after long delay | Malayalam Movie News - Times of India

కథలోకి వెళ్తే..

జలధార పంపు సెట్ సిన్స్ 1962 కథ మొత్తం ఒక పంపు సెట్ దొంగతనం చుట్టూ తిరుగుతుంది. టీచర్ గా పని చేస్తున్న మృణాళిని (ఊర్వశి) ఇంటి కాంపౌండ్‌ లో ఉన్న పంపు సెట్‌లో దొంగతనం జరుగుతుంది. కానీ దాన్ని దొంగిలించిన దొంగ మణి (ఇంద్రన్) పక్కింటి వాడికి పట్టుబడతాడు. చివరకు విషయం పోలీసుల దాకా వెళ్తుంది. అయితే చిన్న విషయమంటూ పోలీసులు సెటిల్‌ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ అతను చేసిన ఆ తప్పును మణి అంగీకరించకపోవడంతో మృణాళిని కోర్టులో కేసు వేస్తుంది. విచిత్రంగా కేసు ఏళ్ల తరబడి సాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? తీర్పు ఎప్పుడు, ఎలా వచ్చింది ? దొంగకు శిక్ష పడిందా? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీ పై ఒక లుక్కేయండి. మలయాళ సినిమాలంటే చెవి కోసుకునేవారు డోంట్ మిస్.

Related News

Friday Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు..

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

Big Stories

×