BigTV English

Satyabhama Today Episode : నందినికి నిజం తెలిసిపోయిందా? సత్యకు మహాదేవయ్య బిగ్ షాక్..

Satyabhama Today Episode : నందినికి నిజం తెలిసిపోయిందా? సత్యకు మహాదేవయ్య బిగ్ షాక్..

Satyabhama Today Episode December 14th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్య క్రిష్ ఇద్దరి కలిసి కరెంట్ ఆఫీస్ కి వెళ్లి విశ్వనాథం ఇంటి గురించి మాట్లాడతారు. ఆ నెంబర్ పైన రెండు లక్షలు అప్పు ఉంది అని చెప్పగానే క్రిష్ గట్టిగా నిలదీసి అడుగుతాడు. సత్య కూడా మేము వెయిట్ చేస్తాం ఎక్కడ బాకీలు ఉన్నారో అవి కొంచెం క్లియర్ గా చెప్పగలరా అనేసి అంటుంది. కానీ కరెంట్ ఆఫీస్ లో అతను నానుస్తాడు. నువ్వు రెచ్చిపోయిన సత్య అతనికి వార్నింగ్ ఇస్తుంది. ఇక క్రిష్ కూడా అతనికి చేయూకాలం లేకుండా చూసుకోవాలని వార్నింగ్ ఇస్తాడు. దాంతో కరెంటు వదులుతామని చెప్తారు.  మహాదేవయ్యా ఇంటి కరెంట్ వస్తానే సరిపోదు ఇంకొక సమస్య వస్తుందని అనుకుంటాడు. ఇక ఏందయ్యా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అంటే వెర్రి మొదటి స్టేజ్ అంట నీకు తెలుసా? అని అంటుంది. సత్య పుట్టింట్లోనే కొన్ని దినాలు ఉన్న నీదే ఇప్పుడు నీకేమైంది అనగానే, ఇంట్లో పనిచేయదా నేను ఎలా చేసుకోవాలి అనేసి భైరవి ఉంటుంది.  పాతిక లక్షలు ఇవ్వాలని మరో బ్యాచ్ వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. విశ్వనాథంతో మర్యాద లేకుండా మాట్లాడటంతో క్రిష్ రెచ్చిపోతాడు.. మర్యాద లేకుండా మాట్లాడొద్దు మంచిగా చెప్పండి నీకు డబ్బులు అడిగారు కదా టైం ఇచ్చావు కదా ఆ టైం కి వాళ్ళు ఇస్తారు అనేసి క్రిష్ వాళ్ళతో గొడవకు దిగుతాడు. వాళ్లని నాలుగు పీకుతాడు విశ్వనాథం ఆపగానే ఆగుతాడు. నేను పైసలు తీసుకొచ్చేస్తాను అడ్డమైన వాళ్ళ చేత మాటలు పడాల్సిన అవసరం మనకు లేదు అనేసి పౌరుషంతో  క్రిష్ డబ్బులు కోసం మహదేవయ్య దగ్గరికి వెళ్తాడు. భైరవి మహదేవయ్య మాట్లాడుకుంటుండగా క్రిష్ వెళ్లి 25 లక్షలు నా బామ్మర్దికి కావాలని అడుగుతాడు. మహాదేవయ్య ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. క్రిష్ డబ్బులు తీసుకొచ్చి వాళ్లకు ఇస్తాడు. క్రిష్ డబ్బులు ఇవ్వకుండా విశ్వనాథం అడ్డుపడతాడు. బాబు ఆ డబ్బులు ఇచ్చే ముందర ఒకసారి ఆలోచించు అనేసి అంటాడు. ఈ డబ్బులతో మన బంధం చెడిపోకూడదు బాబు ఇది ఆలోచించు ఇది మా సమస్య మేము పరిష్కరించుకోగలం ఒక్కసారి ఆలోచించు బాబు అనేసి విశ్వనాథం బ్రతిమలాడిన క్రిష్ మాట వినడు. డబ్బుల కోసం వచ్చిన రౌడీలకు డబ్బులు ఉన్న బ్యాగును విసిరేస్తాడు. డబ్బులు కరెక్ట్ గానే ఉన్నాయా అని రౌడీలు అడుగుతారు.. ఇప్పుడు లెక్కలు చూడడం నాకు అలవాటు లేదు కావాలంటే చెక్ చేసుకో అనేసి క్రిష్ వాళ్ళతో అంటాడు. ఇక పక్కనున్న వ్యక్తి ఈయన మహదేవయ్య సార్ కొడుకు.. ఇకనుంచి వెళ్లకపోతే మన శాల్తీలు కచ్చితంగా లేచిపోతాయి అంటాడు. దానికి అతను ఇప్పుడు అలా చెప్పేది అని అంటే లేదన్నా నాకు ఇప్పుడే గుర్తొచ్చింది మనం ఇక వెళ్ళిపోతాం కదా అనేసి అంటాడు. ఇక వెళ్తుంటే రౌడీలు ఆపి మా మామయ్య కాళ్ళు పట్టుకోవాలి లేకపోతే మీకు ఏం జరుగుతుందో నేను చెప్పలేను అనేసి క్రిష్ అంటాడు. దానికి వాళ్ళు విశ్వనాథం కాళ్లు పట్టుకొని క్షమించమని అడుగుతారు.

ఇక హర్ష ఒక్కడే బాధపడుతూ ఉంటాడు. సత్య వచ్చి నాకోసం నువ్వు ఎన్నో చేశావు నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా అనేసి అంటుంది. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మా అన్నయ్య గురించి నాకు తెలుసు నిన్ను నమ్ముకొచ్చిన వాళ్ళని చూసే బాధ్యత కూడా నీదే వదిన ఇప్పుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకు తెలుసు కదా అనేసి అంటుంది. మరి నువ్వు వదినని అంతకన్నా ఎక్కువ ప్రేమించాలి మైత్రి విషయం పక్కన పెట్టేసి నువ్వు వదిన గురించి ఆలోచించాలని హితబోధ చేస్తుంది. ఇక మహదేవ సత్యకు ఫోన్ చేస్తాడు. ఈరోజు సమస్య తీరింది అనుకున్నాం రేపు ఇంకొక సమస్య వస్తది. నువ్విక పుట్టింటిలోనే ఉండిపోతావ్ రేపు ఇక్కడికి రావాలనే ఆలోచన కూడా ఉండదు అనేసి సత్యకు వార్నింగ్ ఇస్తాడు. ఇక క్రిష్ వచ్చి బాపు చిన్న పని చెప్పాడు నేను హైదరాబాద్ కు వెళ్లొస్తాను అనేసి వెళ్ళిపోతాడు. ఉదయం లేవగానే విశాలాక్షి విశ్వనాథం మాట్లాడుకుంటారు. అల్లుడుగారు సమస్యను తీర్చారు కదా ఇంకెందుకు టెన్షన్ పడుతున్నారు అనేసి విశాలాక్షి అడుగుతుంది. దానికి విశ్వనాథం సమస్య పూర్తిగా పోలేదు ఇప్పుడు మాత్రమే తగ్గింది ఆ పాతిక లక్షలు మనం అప్పే అప్పుగా తీసుకున్నాం అప్పుగానే ఇద్దాం అనేసి అంటాడు.


అవును నాన్న ఈ సమస్య ఇక్కడితో పూర్తవ్వలేదు ఇంకొక సమస్యను ఎలా బయటపడాలని నేను కూడా ఆలోచిస్తున్నానని సత్య వస్తుంది. ఇక అప్పుడే ఇంటిని కొలవడానికి ఇద్దరు మనుషులు వస్తారు. మా ఇల్లు ని వాదన పెట్టుకుంటారు. ఇది శేషు గారిని ఇంట్లో వాళ్ళు ఖాళీ చేశారని ఈళ్లను కోలగొట్టడానికి ఎంత సమయం పడుతుందో అని కనుక్కోమని పంపించారు అయినా బుల్డోజర్ తీసుకొని వస్తారు అప్పుడు మీరు ఆయనతో మాట్లాడుకోండి అనేసి వాళ్ళు చెప్తారు. సత్య మాత్రం మొండిగా ప్రవర్తిస్తుంది. నందిని మా బాబుకి కాల్ చేసి ఈ విషయాన్ని చెప్తాను ఆయన సలహాలు ఇస్తాడు కదా అనేసి అంటుంది. వీటన్నిటికీ కారణం మీ బాబునే వదిన నువ్వు కాల్ చేయొద్దు అనేసి అంటుంది. కూతురికి ఫోటోలు పెట్టాలని ఏ బాబు అయినా అనుకుంటారు వదినా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ నాకు అర్థం కావట్లేదు అనేసి నందిని అడుగుతుంది. నువ్వు పుట్టింటి వాళ్ళ మీద కోపంతో పుట్టింటికి రావేడమే మానేశావు నా మీద కూడా ఆయనకి కోపంగా ఉంది అందుకే ఇటు పగ తీర్చుకోవాలని అనుకున్నాడు అనేసి ఏదో సర్ది చెప్తుంది. నందిని మా బాపు తనకు పోయి నేను అసలు విషయం తెలుసుకుని వస్తానని వెళ్ళిపోతుంది.

మహదేవయ్య భోజనం చేస్తుంటే నందిని వెళ్లి ఇక్కడ నువ్వు భోజనం చేస్తున్నావా? సంతోషంగా ఉన్నావా కూతురు అత్తింట్లో కన్నీళ్లు పెట్టుకుంటుంటే నిలువ నీడ లేకుండా చేస్తున్నావ్ నీకు కొంచమైనా ఉందా సంబరాలు చేసుకుంటున్నావా అనేసి నిలదీస్తుంది. ఇక భైరవి నందిని చంప పగలగొడుతుంది. సంజయ్ సంధ్య కు కాల్ చేస్తాడు. పెద్దనాన్నని ఇబ్బంది పెడుతుంది కేవలం క్రిష్ ప్రేమించాడని మాత్రమే తనని భరిస్తున్నారు అనేసి సంధ్యకు సత్యకు గొడవలు పెట్టేస్తాడు. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో నందిని పుట్టింటి నుంచి తిరిగి వస్తుంది. ఆ బాపు కొత్త ఇంటిని కట్టిస్తాడని అన్నాడు అనేసి అంటుంది. అలా అస్సలు జరగదు అని అనగానే వెనకాలే క్రిష్ ఎందుకు జరగదు మా బాపు గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అనేసి అడుగుతాడు. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Dhee Raju : ఢీ రాజుకు ఇంత మందితో బ్రేకప్ అయ్యిందా..? మంచి రసికుడే..

Big Stories

×