పశ్చిమ గోదావరి జిల్లా లో భీమవరం నియోజకవర్గం 2019 ఎన్నికల్లో యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది .. దానికి కారణం ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ చేయడమే కాకుండా అక్కడ పరాజయం పాలవడం.. అక్కడ వైసీపీ నుండి పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ పవన్ పై గెలుపుతో ఒక్కసారిగా జైంట్ కిల్లర్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ మీద గెలిచి స్టార్ ఇమేజ్ దక్కించుకున్నా తన సొంత పార్టీలో కనీసం గుర్తింపు రాకపోవడం, మంత్రి పదవి ఇవ్వకపోవడం పై గ్రంధి బాధపడ్డా ఎక్కడ జగన్ను పల్లెత్తు మాట అనలేదు.
2024 ఎన్నికలకు ఉత్సాహంగా క్యాడర్ ను రెడీ చేసి తాను ఆర్ధిక వనరులు సమకూర్చుకొని సిద్ధమయ్యారు. ఇక ఎన్నికల తేదీ సమీపిస్తోంది అనగా తన సొంత పార్టీలోనే తనను ఓడించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి చూసి కలత చెందారంటాయన .. తన పై జరుగుతున్న రాజకీయ కుట్రలను వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా కనీస స్పందన లేకపోవడంతో గ్రంధి శ్రీనివాస్‌ను మరింత బాధించిందంటున్నారు. యుద్ధం లో దిగాక పోరాటం తప్పదు కాబట్టి ఎప్పటి నుంచో తనతో ఉంటూ వస్తున్న కార్యకర్తల అండతో ఎన్నికల రణరంగంలో పోరాడిన గ్రంధిఓటమిని చవి చూసారు.
తన నియోజకవర్గం లో జరిగిన రాజకీయ కుట్ర మొత్తం ఎన్నికల అనంతరం మరోసారి జగన్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా కనీసం అయన కాంటాక్ట్ లోకి రాలేదంట. రీజినల్ ఇన్చార్జ్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఆయనకు జగన్ అపాయింట్‌మెంట్ దక్కనీయలేదంట. గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వైసీ సుబ్బారెడ్డికి తెలిసే రాజకీయ కుట్ర జరిగిందన్న అనుమానాలు గ్రంధి శిబిరం లో బలంగా పేరుకుపోవడంతో వైసీపీ కార్యక్రమాలకు దూరం గా ఉంటూ కామ్ అయిపోయారాయన.
Also Read: రాజ్యసభకు చిరంజీవి? ఈ సారి ఏ పార్టీ అంటే!
వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మౌనంగా ఉన్న గ్రంధి శ్రీనివాస్‌ను వైవీ ఆదేశాలతో జిల్లా నాయకత్వం పూర్తిగా విస్మరించిందంట. భీమవరంలోని ఇతర వైసీపీ నేతలతో కాంటాక్ట్‌లోకి వెళ్లి గ్రంధి అధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నం చేయడంతో గ్రంధి ఇక వైసిపి కి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అయిపోయారంట. మాజీ మంత్రులు కారుమూరి, పేర్ని నాని మధ్యవర్తిత్వం చేసినా టైంను నమ్మే గ్రంధి టైం చూసుకొని బై బై జగన్ అనేశారు.
భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసిపి వీడతారని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది .. ఆ ప్రచారానికి పుల్ స్టాప్ పెడుతూ గ్రంధి పార్టీని వీడారు. కానీ రాజీనామా చేసినప్పుడు గ్రంధి శ్రీనివాస్ చేసిన విమర్శలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మాజీ సీఎం జగన్ తన గురించి తప్ప వేరే వారి గురించి ఆలోచించరని డైరెక్ట్‌గానే టార్గెట్ చేశారు గ్రంధి. ఇంకొక అడుగు ముందుకు వేస్తూ వైసిపి అధిష్టానాన్ని బ్రిటిష్ పాలనతో పోల్చారు. జగన్ పెట్టిన రీజనల్ ఇంచార్జులతో పార్టీ కి నష్టం జరగడం తో పాటు ఇప్పుడు వైసీపీ పూర్తగా ఖాళి అయిపోయే పరిస్థితి వచ్చింది వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వైసీపీ నేతల చేతిలో వైవీ సుబ్బారెడ్డి కీలుబొమ్మ గా మారారని గ్రంధి చేసిన విమర్శలు ఆ పార్టీ వారిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయంట.
ఎన్నికల్లో తన ఓటమి కి కుట్ర రచించిన వారికి జిల్లా పార్టీలో ముఖ్య పదవులు కట్టపెట్టడంతో గ్రంధి ఫీల్ అవడంతో పాటు .. జగన్ కు తెలిసే అంత జరిగింది అన్న అనుమానాలు ఆయన్ని మరింత ఆగ్రహానికి గురిచేశాయంట .. గ్రంధి చేసిన విమర్శలను లోతుగా పరిశీలిస్తే జిల్లా నేతలు ఇచ్చే తాయిలాలకు రీజినల్ కో ఆర్డినేటర్ తానా అంటే తందానా అన్నట్లు స్పష్టమవుతుందని.. అందుకే పార్టీకి జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదని వైసిపి కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు .. గత పన్నెండు ఏళ్లుగా వైసీపీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి… పవన్ కళ్యాణ్ లాంటి ప్రజా నేత పై గెలిచిన గ్రంధి శ్రీనివాస్ నే పట్టించుకోకుండా.. పొమ్మనకుండా పొగ పెట్టారంటే ఇక తమ పరిస్థితి ఏంటని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయం.