BigTV English

Satyabhama Today Episode : మహాదేవయ్యకు షాకిచ్చిన గంగ.. సత్య ప్లాన్ లో ఇరుక్కున్న మహాదేవయ్య..?

Satyabhama Today Episode : మహాదేవయ్యకు షాకిచ్చిన గంగ.. సత్య ప్లాన్ లో ఇరుక్కున్న మహాదేవయ్య..?

Satyabhama Today Episode November 23 th : నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రవర్తి పుట్టినరోజును సత్య క్రిష్ లు గ్రాండ్ గా చేస్తారు. ఇవన్నీ ఎందుకమ్మా అని చక్రవర్తి అంటే నాదేం లేదు చిన్న మామయ్య అంతా చేసింది క్రిష్ అని సత్య అంటుంది. ఇక జయమ్మ నాది ఏమీ లేదురా నేను వీళ్ళ వెనకాల తోకల వచ్చాను అనేసి అంటుంది. సత్య క్రిష్ చక్రవర్తులను కలిపే ప్లాను దాదాపు వర్కౌట్ అయిందని తెలుస్తుంది. ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఆ బంధం ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతారు. చక్రవర్తి కేక్ కటింగ్ తర్వాత సత్య చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. ఎందుకు మామయ్య కన్నీళ్లు మీ కొడుకు చేతే మీ పుట్టినరోజు జరిగింది కదా ఇక సంతోషించాల్సిన విషయమే కదా అనేసి అడుగుతుంది. కానీ చక్రవర్తి మాత్రం ఇలాంటి ఒకరోజు వస్తుందని నా జీవితంలో నేను ఎప్పుడూ అనుకోలేదు అమ్మ ఇదంతా నీ వల్లే నా కొడుకుని నాకు దగ్గర చేశావు నువ్వు ఎప్పటికీ చల్లగా ఉండాలని అంటాడు. మా ఇద్దరిని కలపాలి అనే ప్రయత్నంలో నీకు ఏదైనా అవుతుందని నా బాధ అనేసి అనగానే, దానికి ఎప్పుడో చచ్చిపోయే బదులు ఒక మంచి మనుషుల్ని కలిపి చనిపోవడం మేలు కదా మామయ్య అని సత్య తగ్గకుండా మాట్లాడుతుంది. ఇక క్రిష్ కూడా బాబాయ్ మీద ఎందుకో తెలియదు ఎదో తెలియని బంధం ఉందన్న ఫీలింగ్ ఉందని అంటాడు.. ఇక ఇద్దరినీ కలిపే ప్రయత్నాన్ని చేస్తాను అంటుంది. ఇక తర్వాత రోజు భైరవి క్రిష్ తో పెళ్ళాం అంటేనే ముద్దు అమ్మను వదిలేసావు కదా అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భైరవిని క్రిష్ నీళ్ళు అడుగుతాడు కానీ భైరవి పోయి నీ ముద్దుల పెళ్ళాన్ని అడిగి తీసుకొని చురకలాంటిస్తుంది. ప్రతి దానికి పెళ్ళాం పెళ్ళాం అని పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతావు నీళ్లు కూడా నీ పెళ్ళాన్ని అడిగి తీసుకో అనేసి బైరవి అంటుంది. దీనమ్మ నీళ్లు అడిగినందుకు ఇంత లొల్లి చేస్తావా అని క్రిష్ వాదన వినిపిస్తాడు. అయితే పెళ్ళాం కొంగు పట్టుకోక నీ కొంగు పట్టుకోమంటావా అనేసి క్రిష్ బైరవిన్ అంటాడు. భైరవి కూడా అదే చెప్తున్నా నీ పెళ్ళాన్ని అడిగే నీళ్లు తెచ్చుకో అనేసి అంటుంది. అంతలోకే అక్కడికి పంకజం వస్తుంది. అమ్మ కొడుకులు కలిసి ఇంత ముచ్చట పెట్టుకుంటున్నారంటే ఏదో మంచి ముచ్చటే పెట్టుకున్నారని పంకజం అంటుంది. నువ్వేందే నువ్వు కూడా ఇలానే మాట్లాడుతున్నావు అని క్రిష్ అంటాడు.

అవును నువ్వు కాఫీ తెచ్చావేంటి సత్య లేదా అనేసి అడుగుతాడు.. ఆయన గారికి పెళ్ళాం కాఫీ తెస్తేనే తాగుతాడు. ఆయనకెందుకు ఇస్తున్నావు ఇట్లు ఇవ్వు నాకు అని భైరవి అంటుంది. దానికి క్రిష్ ఇగో తాగు నువ్వే అనేసి అంటాడు. వీరిద్దరూ మంచి ముచ్చట్లు ఉన్నప్పుడు సడన్గా ఒక ఆవిడ ఎంట్రీ ఇస్తుంది. పైనుంచి సత్య క్రిష్ అంటే తనే అని చూపిస్తుంది. క్రిష్ దగ్గరికి వెళ్లిన గంగ నువ్వు నా రక్తం పచ్చికొట్టిన బాబువి కదా నా బాబువి కదా అనేసి అంటుంది. దానికి క్రిష్ ఎవరు అమ్మ నువ్వు ఎందుకు నన్ను అడుగుతున్నావ్ అనేసి ఆశ్చర్యపోతాడు. భైరవి కూడా ఆడు నా కొడుకు అనేసి షాక్ అవుతుంది. వీడు నా రక్తం పరుచుకు పుట్టిన కొడుకు మీ నాయనకు తెలుసు అనేసి గంగ అంటుంది. ఇదిగో అమ్మ ఇది ఏందో మాట్లాడుతుంది బైరవిని క్రిష్ అంటాడు. గంగ మాటలు విన్న భైరవి ఇదిగో అమ్మ ఎవరు నువ్వు నా బిడ్డను పట్టుకుని నీ బిడ్డ అంటున్నావ్ అనేసి అడుగుతుంది. పాతికేయలు నీకు దూరం ఉన్నాను ఇక దూరం ఉండాల్సిన అవసరం లేదు నువ్వు నా కొడుకువే అని బుగ్గలు గిల్లుతుంది.


గంగ ప్రవర్తన చూసిన భైరవి ఒకింత షాక్ అవుతూ పెనిమిటి అంటూ అరుస్తూ లోపలికి వెళ్తుంది. పెనిమిటి నువ్వు రా బయటికి రా అనేసి అడుగుతుంది. ఏమైంది అట్లా కుక్కలు తరుముతున్నాయా? పరిగెత్తుకుంటూ వస్తున్నామని మహదేవయ్య అడుగుతాడు.. కుక్కలు కాదు పెనిమిటి బయట కూడా ఒక ఆవిడ క్రిష్ ను తెగ పిసికేస్తూ నా బిడ్డ అని అంటుంది అని అడుగుతుంది. ఎవరెన్ని చెప్పినా వినకుండా గంగా లోపలికి వస్తుంది. కృష్ణ బిడ్డ కదా మరి వీళ్ళకి ఎందుకు నిజం చెప్పలేదు అనేసి అడుగుతుంది. దేవయ్య అంటే శివుడితో సమానం బైరవి అంటే పార్వతి ఇక గంగంటే నేను తల మీద ఉంటానని గంగ పెద్ద స్టోరీ చెప్తుంది. దానికి మహాదేవయ్య నువ్వు గంగ అయితే నాకేంటి గోదావరి అయితే నాకేంటి ఇంతకీ నువ్వు ఎవరు అనేసి అడుగుతాడు.. ఇలా అంటావని నేను అనుకున్నాను ఇంట్లో వాళ్లకి నిజం తెలియదు కదా ఊరందరికీ నేను ఈ రెండో పెళ్ళాం అని చెప్పేసేయ్ అనేసి గంగ అడుగుతుంది..

అప్పుడే సత్య పైనుంచి కిందకి వస్తుంది. ఇది మావయ్యకి రెండో పెళ్ళామా ఏంటిది మావయ్య అనేసి అడుగుతుంది. ఇంతకీ నువ్వు ఎవరని గంగా అడుగుతుంది. క్రిష్ భార్యని అనేసి సత్యా అనగానే, ఏ నువ్వు నా కోడలు వి నేను నీకు అర్థం అవుతాను క్రిష్ కొడుకు అనేసి దగ్గరికి వెళ్లి బుగ్గలు పట్టుకుంటుంది. మధ్యలో క్రిష్ ఎంటర్ అయ్యి సైడ్ కు ఉండు అంటాడు.. ఇంతకీ మీరెవరని ఇంట్లో వాళ్ళందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు గంగని. గంగ మాత్రం మీకు ముచ్చట చెప్పాలి అనేసి అసలు విషయాన్ని బయట పెడుతుంది. బైరవికి కొడుకు పుట్టాడని ఆ కొడుకు చనిపోయాడని తన భార్య బిడ్డ చనిపోయాడు అని తెలిస్తే బతకలేదని నా బిడ్డను తీసుకొని వెళ్ళాడు. కొన్నాళ్లకు నా పెనిమిటి చనిపోయాడు. నాకు నా బిడ్డని ఇవ్వమని అడిగితే నీకు బిడ్డని ఎందుకు ఇస్తాను. నీకు అన్ని తానై చూసుకుంటాను అని గుడ్లో ఈ తాళి నా మెడలో వేసి రెండో పెళ్ళాన్ని చేసుకున్నాడు అని గంగ చెబుతుంది.

ఇక మహదేవయ్య మాత్రం తన అనుచరులను లోపలికి రమ్మని పిలుస్తాడు.. పంకజం నువ్వు ఈమెను గేంటెయ్యి.. మీరిద్దరూ వాన్ని తీసుకొని బయటికి తొలేయ్యండి అని చెబుతాడు. బయటికి వెళ్లిన గంగ ఈ నిజాన్ని అందరికీ ఉండా ఎన్నాళ్ళని దాచిపెడతావు అసలు నిజం తెలుస్తుంది నువ్వు నన్ను భార్యగా ఒప్పుకునేంతవరకి మీ ఇంటి ముందు నుంచి బయటికి కదలని చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×