BigTV English

Satyabhama Today Episode: సత్య పై భైరవి రివేంజ్ ప్లాన్.. భైరవిని చూసి భయంతో వణికిపోయిన మహాదేవయ్య..

Satyabhama Today Episode: సత్య పై భైరవి రివేంజ్ ప్లాన్.. భైరవిని చూసి భయంతో వణికిపోయిన మహాదేవయ్య..
Advertisement

Satyabhama Today Episode November 5th: నిన్నటి ఎపిసోడ్ లో..  మహాదేవయ్య ఇంట్లో దీపావళి పూజలు మొదలవుతాయి.. సత్య పూజ చేస్తుంది. పూజ అనంతరం పోలీసులు వస్తారు. ఇంట్లో బ్లాక్ మనీ ఉందని సోదాలు చేసుకోవాలని అడుగుతారు. క్రిష్ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. బయట కార్లో డబ్బులు ఉండడం గమనించిన ఆఫీసర్లు వాటిని బయటకు తీసి ఇవి ఎవరివి అని అడుగుతారు. అప్పుడు మహదేవయ్యా అనుచరుడు అవి నావే అని అబద్ధం చెప్పి వారికి లొంగిపోతారు. బైరవి నీకు ఇంత మంచితనం పనికిరాదు పెనిమిటి ? నీ వెనకాలే ఉంటూ మీద గోతులు దోవుతున్నారు అని అరుస్తుంది. అప్పుడు సత్య ఆ డబ్బులు వాడివి కాదు మామయ్యవే అని నిజం చెప్తుంది. పార్టీకి ఇవ్వాలని క్రిష్ కి ఇచ్చాడు. ఇలా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సత్య చెబుతుంది.. ఇక నందిని మైత్రి ప్రయాణం కోసం నగలను ఇస్తుంది. దీపావళి రోజున భార్య అలకను తీర్చడానికి అదిరిపోయే సెటప్ వేస్తాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య క్రిష్ ను క్షమించను అని చెప్పేసి వెళ్తుంది. కానీ సత్య కాళ్ళ పట్టి ఊడిపోతుంది. క్రిష్ దాన్ని తీసుకొని సౌండ్ చేసి సత్యని పిలుస్తాడు. సత్యకి పట్టీ ఇవ్వకుండా సత్యతో ఆటలాడుతాడు. దానికి సత్య ఇవ్వండి అంటుంది. అలకమానితేనే ఇస్తానని అంటాడు. దాంతో సత్య అలకమానాను ఇవ్వు అని అంటే క్రిష్ చేతికి ఇవ్వకుండా మోకాల మీద కూర్చొని సత్య కాళ్లని తన చేతిలోకి తీసుకొని పట్టీ పెడతాడు. అదంతా దూరం నుంచి చూసిన భైరవి రగిలిపోతుంది.. అది చూడలేక లోపలికి వెళ్తుంది. ఇక పంకజం మాత్రం ఎంత బాగుందో చూడటానికి రెండు కళ్లు చాల్లేదు. అచ్చం సినిమాలో లాగానే ఉందని చూస్తుంది.

ఇక ఉదయం భైరవి కోపంగా వంట గదిలోకి వస్తుంది. కూరగాయలు కట్ చేసే టైం లో పంకజం వస్తుంది. ఇంత టైం వరకు రాకుండా ఉంటే ఇంట్లో పని నేనొక్కదాన్నే చేసుకోవాలని అడుగుతుంది. దానికి పంకజం రాత్రి నుంచి ఇంకా కోపం మీకు తగ్గలేదు కదా అని అంటుంది. అయినా ఏమాటకి ఆ మాట అమ్మగారు చిన్నబాబు గారు చాలా రొమాంటిక్. చిన్న బాబు గారు సత్యమ్మని ఎంత బాగా చూసుకున్నారో అని అనగానే భైరవి ఆపుతావా అంటుంది.


సత్యమ్మ గారిని మెచ్చుకోవాలి నిన్న అందరి ముందు సత్యమ్మని తిట్టి మిమల్ని చిన్నబాబుగారు సపోర్ట్ చేశారా. తర్వాత సత్యమ్మ ఇలా చిన్న బాబుని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంది. లేకపోతే ఎవరినీ పట్టించుకోని చిన్నబాబుగారు ఆవిడ కాళ్లు పట్టుకోవడం ఏంటి. అది చేస్తా ఇది చేస్తా అని అన్నారు ఇప్పటి వరకు ఏం చేయలేకపోయారు. నా పెద్ద కొడుకుని జైలుకి పంపించి చిన్న కొడుకుని గుప్పెట్లో పెట్టుకుంది దాని పొగరు ఎలా అనుస్తానో చూడు. పద సత్య దగ్గరకు నువ్వే చూద్దువు అంటుంది. ఏమైనా పని ఉందా అత్తయ్య అనగానే మస్తు పని ఉందంటుంది.. అయితే చేసుకోండి అత్తయ్య నేను అడ్డురాను అంటుంది సత్య.ఏయ్ ఆగు ఈ రోజు నా దోస్తులు వస్తున్నారు. ఇళ్లంతా మంచిగా ఉండాలి. అన్ని పనులు చేసి పెట్టు. చికెన్లు మటన్లు కూడా చేయ్. పనులన్నీ ఫటాఫట్ అయిపోవాలి. నేను మేకప్ వేసుకోవాలి అని అంటుంది. ఇక జయమ్మ అది అన్ని పనులు నెత్తి మీద వేస్తుంటే ఎందుకు కాదు అని చెప్పకుండా ఊరుకున్నావని అంటుంది.. కావాలనే చేస్తుంది.. పర్లేదు గొడవలు రాకుండా ఉంటాయాన్ని అంటుంది..

ఇక భైరవి రెడీ అవుతుంది. పంకజం భైరవిని రెడీ చేస్తుంది. ముఖంలో ఏదో తక్కువ అయిందని భైరవి అంటే అందం తక్కువ అయిందని పంకజం అంటుంది. ఇక అక్కడే ఉన్న కళ్లద్దాలు పెట్టుకొని భైరవి స్టైల్ ఇస్తుంది. కోకా పేట ఆంటీలా ఉన్నావని పంకజం అంటుంది. ఇక పంకజం ఫోటోలు తీస్తుంటే భైరవి స్టిల్స్ ఇస్తుంది. పంకజం సెటైర్లు కామెడీగా ఉంటాయి. ఇక తన అందమైన ఫోటోలను మహాదేవయ్యకు పంపిస్తాను ఇప్పుడే వచ్చి మళ్లీ పెళ్లి చేసుకుందాం అని అనాలి అంటుంది. అన్ని మెసేజ్లు ఏంటి బాపు అనుకుంటూ క్రిష్ అక్కడికి వస్తాడు. ఏంటా అని మహదేవయ్య చూస్తే భైరవి తన ఫొటోలు పంపిస్తుంది. దెయ్యం ఫొటోలు అని మహదేవయ్య ఫోన్ విసిరేసి భయపడితే క్రిష్ ఫోన్ తీసుకొని తల్లిని చూసి నవ్వుతాడు. ఇవి దెయ్యం ఫొటోలు కాదు బాపు అమ్మ అని అంటాడు. ఇద్దరూ నవ్వుకుంటారు. ఇద్దరూ భైరవి మీద సెటైర్లు వేసుకొని నవ్వుకుంటారు. ఇక సత్య ఇళ్లంతా తడి గుడ్డతో తుడుస్తుంటుంది. పంకజం ఆ విషయం భైరవికి చెప్తుంది.

ఇక సంధ్యను లైన్లో పెట్టాలని సంజయ్ సంధ్య క్లాస్ దగ్గరకు వెళ్తాడు. సంధ్యకి లిఫ్ట్ ఇచ్చి దగ్గరవ్వాలి అనుకొని ఎవరూ చూడకుండా సంధ్య స్కూటీ స్టార్ట్ అవ్వకుండా సైలెన్సర్లో కర్చీఫ్ పెట్టేస్తాడు. కొంత దూరం వెళ్లగానే సంధ్య స్కూటీ ఆగిపోతుంది. ఇక సంధ్య దగ్గరకు సంజయ్ వెళ్లి లిఫ్ట్ ఇస్తానంటాడు.. దానికి సంధ్య డైలాగులు కొడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భైరవి కింద పడిపోతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Nindu Noorella Saavasam Serial Today october 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు షాక్‌ ఇచ్చిన యముడు  

Intinti Ramayanam Today Episode: మళ్లీ కలిసిపోయిన పల్లవి.. కండీషన్స్ కోసం శ్రీయా ఫైట్..బూతులు తిట్టుకున్న కోడళ్లు..

GudiGantalu Today episode: ప్రభావతి ఇంట దీపావళి సంబరాలు.. రోహిణికి దినేష్ వార్నింగ్..మీనా కిడ్నాప్..

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి.. సిగ్గుపడ్డ వేదవతి.. ధీరజ్ కోసం ప్రేమ రచ్చ..

Illu illaalu pillalu Kamakshi : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ కామాక్షి రియల్ లైఫ్.. కుర్రాళ్ల మతిపోగొడుతుంది మావా..

Today Movies in TV : ఆదివారం మూవీ లవర్స్ కు పండగే..టీవీల్లోకి హిట్ సినిమాలు..

Big tv Kissik Talks: బిగ్ బాస్ హౌస్ పాములు.. పులుల అరుపులు షాకింగ్ విషయాలు బయటపెట్టిన హరితేజ!

Big tv Kissik Talks: ఎన్టీఆర్ తో హరితేజ గొడవ…  డైరెక్టర్లకు వార్నింగ్ ఇచ్చిన తారక్?

Big Stories

×