BigTV English

Satyabhama Today Episode: సత్యపై పంతంతో నడుం విరగొట్టుకున్న భైరవి.. జయమ్మ కౌంటర్స్..

Satyabhama Today Episode: సత్యపై పంతంతో నడుం విరగొట్టుకున్న భైరవి.. జయమ్మ కౌంటర్స్..

Satyabhama Today Episode November 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. సత్య పై క్రిష్ చూపిస్తున్న ప్రేమకు దూరం నుంచి చూసిన భైరవి రగిలిపోతుంది.. అది చూడలేక లోపలికి వెళ్తుంది. ఇక పంకజం మాత్రం ఎంత బాగుందో చూడటానికి రెండు కళ్లు చాల్లేదు. అచ్చం సినిమాలో లాగానే ఉందని చూస్తుంది. పంకజం లెట్ వచ్చిందని భైరవి చిందులు వేస్తుంది. ఇక పంకజం రాత్రి నుంచి ఇంకా కోపం మీకు తగ్గలేదు కదా అని అంటుంది. అయినా ఏమాటకి ఆ మాట అమ్మగారు చిన్నబాబు గారు చాలా రొమాంటిక్. చిన్న బాబు గారు సత్యమ్మని ఎంత బాగా చూసుకున్నారో అని అనగానే భైరవి ఆపుతావా అంటుంది. సత్యమ్మ గారిని మెచ్చుకోవాలి నిన్న అందరి ముందు సత్యమ్మని తిట్టి మిమల్ని చిన్నబాబుగారు సపోర్ట్ చేశారా. తర్వాత సత్యమ్మ ఇలా చిన్న బాబుని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంది. దానికి కౌంటర్ ఇస్తాను చూడు అంటుంది. సత్య దగ్గరకు వెళ్లి ఈ రోజు నా దోస్తులు వస్తున్నారు. ఇళ్లంతా మంచిగా ఉండాలి. అన్ని పనులు చేసి పెట్టు. చికెన్లు మటన్లు కూడా చేయ్. పనులన్నీ ఫటాఫట్ అయిపోవాలి. నేను మేకప్ వేసుకోవాలి అని అంటుంది.. ఫుల్ మేకప్ వేసుకొని అందంగా ముస్తాబు అయి ఫ్రెండ్స్ వచ్చారని కిందకు వస్తుంది.. నీళ్ళల్లో కాలు వేసి నడుం విరగొట్టుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భైరవి తన ఫ్రెండ్స్ వస్తున్నారని ఇల్లంతా తల తల మెరిసిపోవాలని సత్యతో చెప్తుంది. పనిమనిషితో నాకు పని ఉంది కాబట్టి నువ్వే దగ్గరుండి ఫినాయిల్ తో మెరిసేలా చేయాలని చెప్పి పైకి వెళ్ళిపోతుంది. దానికి పంకజం బాగా బుద్ధి చెప్పారు అమ్మ అని సంబరపడిపోతుంది. ఈ పని అంతా నువ్వు ఒక్కదానివే ఏం చేస్తావని జయమ్మ అంటుంది. చేయలేను అంటే గొడవలు అవుతాయి అమ్మమ్మ చేస్తాను అని అంటే నా వల్లే కదా శ్రమించేది ఏం పర్లేదు అనేసి సత్య అంటుంది. అత్తయ్య చెప్పిన పనిని చేస్తుంది. ఇక భైరవి అందంగా రెడీ అవుతూ ఉంటుంది. మేకప్ లు వేసుకుంటూ పంకజంతో కౌంటర్లు వేస్తుంది. ఇక పంకజం కిందికి వచ్చి మా అమ్మ గారితో పెట్టుకున్నావుగా ఇప్పుడు పని చేస్తున్నావని సత్యం చూసి లోపలికి వెళ్తుంది. బైరవితో సత్యం ఒకటే పని చేస్తుందని చెప్తుంది. ఇప్పుడేం చూసావే ఇంకా ముందుంది అనేసి బైరవి పంకజంతో అంటుంది. ఇక రెడీ అయ్యి మహదేవయ్యకు ఫోటోలు పెడుతుంది . క్రిష్ మహాదేవ మాట్లాడుకుంటుంటే. ఫోటోలు వస్తాయి. ఆ ఫోటోలను చూసి మహదేవ షాక్ అవుతాడు.

నా మీద కక్ష పెట్టుకున్న ఎవరు నాకు దయ్యం ఫోటోలు పంపించారని ఫోన్ విసిరేస్తాడు. పక్కనే ఉన్న ఫోన్ చూసి ఇది దయ్యం కాదు అమ్మ అంటాడు. అవునా అమ్మనా అని మహదేవయ్య అడుగుతాడు. దాని వయసేది అది వేసే వేషాలు ఏంటి ఈ వయసులో కింద గానం మేకప్ వేయడం అవసరమా అని మహదేవ నవ్వుకుంటారు. ఇక సత్యా ఇంటి పని చేస్తుంది. నడుములు జారిపోతాయి ఇంకా పనిచేస్తున్నావా ఇంకా నీ తుడవడం అవ్వలేదా అని జయమ్మ సత్యను అరుస్తుంది. ఇదొక్కటే కాదు కదా అమ్మమ్మ అటువంటి పని కూడా చూసుకుంటూ ఇల్లు తుడుస్తున్నా అనేసి అంటుంది. భైరవి ఫ్రెండ్స్ ని నోటికి వచ్చినట్లు ఉంటుంది. అప్పుడే బైరవి ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. కోడల్ని ఎంత కంట్రోల్ లో పెట్టుకుందో అని భైరవిని పొగుడుతూ ఉంటారు దానికి జయమ్మ కౌంటర్ వేస్తూ ఉంటుంది. ఇక సత్య టీ పెట్టుకుని వస్తానని లోపలికి వెళ్తుంది. అయితే కాస్త స్ట్రాంగ్ గా పెట్టమ్మా అని భైరవి ఫ్రెండ్స్ అంటారు. ఇక జయమ్మ బైరవి ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెట్టుకుంటుంది. వారిని మాట్లాడినవ్వకుండా కౌంటర్లు వేస్తుంది. అప్పుడే బైరవి స్టైల్ గా రెడీ అయ్యి కిందకొస్తుంది. మెట్ట దగ్గర సత్య ఫినాయిల్ వేసి ఉంటుంది. అది చూసుకోకుండా సత్య ఒకవైపు చెప్తున్న వినకుండా కాలు పెట్టి కింద పడుతుంది. ఆమె పడడానికి చూసి అందరూ నవుతారు. నవ్వడం ఆపి నన్ను లేపండి అని భైరవి అంటుంది. ఇక సత్య కావాలనే కింద పోసిందని నన్ను కింద పడేయాలి చూసిందని భైరవి సత్య పై కోపంతో రగి.లిపోతుంది. ఇక భైరవి అలా ఫ్రెండ్స్ కిట్టి పార్టీ క్యాన్సిల్ అయిందా అని అనుకుంటారు దానికి భైరవి నన్ను అడుగు విరిగింది ఇంకొకసారి మంచిగున్నప్పుడు పార్టీ చేసుకుందాం అని వాళ్ళని వెళ్లిపొమ్మని చెప్తుంది.


ఇక భైరవి బాధపడుతూ ఉంటే పంకజం ఆమెను రూమ్ లోకి తీసుకెళ్తుంది. జండుబాం రాస్తూ కౌంటర్ లేస్తుంది. సత్యమ్మ కావాలని చేసినట్లు ఉంది అని భైరవికి నూరు పోస్తుంది. అప్పుడే సత్య వేడి నీళ్లను కాపురం పెట్టడానికి తీసుకొస్తుంది. నన్ను పడేసి ఇప్పుడు కాపురం పెడతావా అని అంటుంది భైరవి నువ్వు అక్కడ పెట్టేలు పంకజం చూసుకుంటుంది అంటుంది దానికి సత్య బాధపడుతూ ఉంటుంది మీకు ఇలా అయితే నేను ఎందుకు సంతోషంగా ఉంటాను అత్తయ్య అని అంటుంది వేడినీళ్లతో కాపడం పెట్టడానికి వెళుతుంది. నీళ్లు వేడిగా ఉన్నాయి అని చెప్పడంతో బైరవి సత్యను మళ్లీ తిడుతుంది. వేడిగా ఉంటేనే నొప్పి తగ్గుతుందని సత్య అంటుంది. మాకు తెలుసులే నువ్వు వెళ్ళు అంటే సత్య కింద మీకోసం వెయిట్ చేస్తున్నారు మీరు వస్తారా నన్ను భోజనం తీసుకుని రమ్మంటారా అని అడుగుతుంది. దానికి భైరవి నేను వస్తాను నువ్వు వెళ్ళు అనేసి అంటుంది. నడుము విరిగింది కదమ్మా ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు అని పంకజం అడుగుతుంది. దానికి భైరవి నువ్వు ఉన్నావు కదా అనేసి అంటుంది నీ జీతం పెంచుతాను నువ్వు భయపడకు బాధపడకు అంటుంది. ఇక అందరూ భైరవి ఎలా పడిందని కౌంటర్లు ఇస్తారు. జయమ్మ కౌంటర్లకి అందరూ నవ్వుతారు. నల్లకళ్లద్దాలు పెట్టుకొని ఆకాశానికి చూస్తూ నడిచిందని పడిపోయిందని జయమ్మ సెటైర్లు వేస్తుంది. అందరూ నవ్వుకుంటారు. సత్య వెళ్లి తీసుకొస్తాను అంటే ఇంతలో భైరవి వస్తుంది. అప్పుడే బైరవి అక్కడికొస్తుంది. అందరి మీద కోపంతో రగిలిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.రేపటి ఎపిసోడ్ లో మైత్రి నందిని షాపింగ్ కి వెళ్తారు. మళ్ళీ కోపంగా ఉంటుంది. ఇక ఏం జరుగుతుందో రేపే చూడాలి..

Related News

Intinti Ramayanam Serial Today September 25th: ‘ఇంటింటి రామాయణం’ సీరియల్‌: జాబ్‌ కు రిజైన్‌ చేసిన అక్షయ్‌

Illu Illalu Pillalu Serial Today September 25th: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: రామరాజు మీద పగ తీర్చుకుంటానన్న విశ్వ

Gunde Ninda Gudi Gantalu Serial Today September 25th: ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్‌: రోహిణిని అనుమానించిన బాలు    

Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను గల్లా పట్టుకుని నిలదీసిన కావ్య  

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తోసేసిన మిస్సమ్మ

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Big Stories

×