BigTV English

Varra Ravinder Reddy Arrest: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్..

Varra Ravinder Reddy Arrest: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్..

తెలుగు దేశం పార్టీ నేతలపై, మరికొంత మంది వ్యక్తులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వైఎస్ఆర్‌సీపీ కి సంబంధించిన వ్యక్తులను వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగుతోంది. తాజాగా పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అనుచరుడని ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్‌సీపీ హయంలో జగన్‌ను విమర్శించిన టీడీపీ నాయకులపైన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందేవారు. అంతేకాదు వివేకా హత్య కేసులో జగన్‌పైన, అవినాష్‌పైన ఎలక్షన్ టైమ్‌లో విమర్శలు చేసిన, షర్మిల, సునీతలపైన కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. జగనన్న ఆదేశిస్తే.. చాలు ఏది చేయడానికైన సిద్ధమే అనేలా పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో  రవీందర్ రెడ్డి పోస్టులకు మనస్థాపానికు గురైన షర్మిల, సునీత, విజయమ్మ కలిసి ఇతనిపై గతంలోనే హైదారాబాద్, విజయవాడ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.

Also Read: ఒక్క పోస్ట్.. వైసీపీ నేతల పరువు పాయే


ఇక తాజాగా .. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌, వంగలపూడి అనితలపై గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో రవీందర్ రెడ్డి అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. పులివెందుల, మంగళగిరి, హైదరాబాద్‌లో రవీందర్ రెడ్డిపై పలు కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రవీందర్ రెడ్డిని బుధవారం సాయంత్రం పులివెందులో అరెస్ట్ చేసి, అతన్ని కడప పోలీస్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతానికి కడపలో ఉన్న అతన్ని అక్కడి నుంచి  కోర్టులో హాజరుపరిచి, ఆ తరువాత మంగళగిరి పోలీస్‌స్టేషన్‌‌కి తీసుకొస్తారని తెలుస్తోంది. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం సరైన విధానం కాదని ప్రభుత్వం గత కొన్ని రోజులుగా అతనికి హెచ్చరికలు జారీ చేసింది.

 

 

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×