E-Paper
Advertisement

Satyabhama Today Episode: మహదేవయ్యతో సత్య ఛాలెంజ్.. రేణుకను చంపడానికి రుద్ర స్కెచ్..

Satyabhama Today Episode: మహదేవయ్యతో సత్య ఛాలెంజ్.. రేణుకను చంపడానికి రుద్ర స్కెచ్..
Advertisement

Satyabhama Today Episode October 16th : నిన్నటి ఎపిసోడ్ లో.. మహదేవయ్య ఇంట్లో దసరా సంబరాలు మొదలవుతాయి. దసరాకు ఆయుధ పూజ చెయ్యడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ సీరియల్ లో కూడా అది సాగింది. మహదేవయ్య ఇంట్లో అన్న ఆయుధాలని సిద్ధం చేయమని రుద్రతో చెబుతాడు. ఆయుధాలన్నీ పూజకు పెట్టారా అనేసి అడుగుతాడు. నిజంగా ఉన్నాయి బాబు ఇంకా పూజ మొదలు పెడతామా అనేసి రుద్రా మదేవయ్యను అడుగుతాడు.. ఈసారి ఆయుధ పూజను భైరవితో చేయించరు. కొత్త కోడలు చేత ఇంట్లో పూజ చేయించడం ఆనవాయితీ అలాగే తెలివైనది చురుకైంది కాబట్టి సత్యనే ఇప్పుడు పూజ చేయాలని అంటాడు. మీడియా వాళ్ల దగ్గర మహాదేవయ్యను సత్య అడ్డంగా బుక్ చేస్తుంది. మా ఇంట్లో ఉండే ఆయుధాలని పోలీసులకి అప్పగించాలని మావయ్య నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఇంట్లోవి పోలీసులకు ఇచ్చేస్తారు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లో పూజా జరగలేదని భైరవి సత్య పై కోపంగా ఉంటుంది. ఆయుధాలు అన్ని పోలీసులు తీసుకెళ్లడం పై భైరవి కోపంగా ఉంటుంది. ఇలా అలుసు ఇస్తే నెత్తిన కూర్చుంటుంది అని సత్యను అరుస్తుంది. ఇక రుద్ర కూడా ఆయుధాలు లేకుండా ఎలా బాపు మనం దగ్గర ఆయుధాలు లేవని ప్రత్యర్థికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అంటారు. ఆయుధాలు లేకుండా మామయ్య ఏంటో చూపించాలి అని సత్య అంటుంది. ఇక బామ్మ కూడా సత్యను సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇంట్లో అవి ఉంటే భయంగా ఉండేది. సత్య మంచి పని చేసిందని పొగుడుతుంది. ఆయుధాలు లేకుండా బ్రతికి చూడు మనిషి విలువ తెలుస్తుంది అని రేణుక అంటుంది. రుద్ర రేణుకను కొట్టడానికి వెళ్తాడు. ఇక క్రిష్ వదిన సత్య అన్నదాంట్లో తప్పేమి లేదు. బాపుకు ఆయుధాలు లేకున్నా కూడా నేనున్నా అని అంటాడు. ఇక ఈరోజు జరిగింది పక్కన పెడితే రేపు బొమ్మల కొలువు ఉంది కదా దానికి ఇంట్లో ఆడ బిడ్డ తప్పక రావాలి అంటే భైరవి నేను అయితే పిలవను మీరు పిలిస్తే పిలుచుకోండి అని వెళ్తుంది.

Advertisement

ఇక సత్య ఇంట్లో ఆడపిల్లను అత్తయ్య పిలుస్తుంది. అని అంటే ఇంట్లో ఎవరు పిలిచేలా లేరు నందిని ఎలా వస్తుంది అని అనుకుంటారు. దానికి క్రిష్ నా చెల్లిని నేను పిలుస్తాను చూసి చానా దినాలు అయ్యిందని అంటాడు. ఇక అప్పుడు నందిని హర్ష పాత షర్ట్ లు అన్ని తీసి పక్కన పెడుతుంది. ఏమైంది ఎందుకు తీస్తున్నావ్ అంటే కూరగాయల వాడు సార్ పాత చొక్కాలు ఇవ్వమని అడిగిండు ఇస్తున్న అంటుంది. ఉదయం మైత్రితో జరిగిన సీన్ గుర్తు చేసుకొని వద్దని చొక్కాలు పక్కన పెడతాడు. కాసేపు భర్త తో నందిని గుద్దులాడుతుంది. అప్పుడే క్రిష్ నందినికి కాల్ చేస్తాడు. కోపంగా మాట్లాడుతుంది. ఏమైందిరా ఎందుకు కాల్ చేశావు అని అరుస్తుంది. ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నారు. అవునా చీరలోనా, లంగాహోనిలో పెడుతున్నావా అని నందిని సెటైర్ వేస్తుంది. నేను కాదు ఇంట్లో ఆడోళ్ళు అని చెబుతాడు. అమ్మకు పిలవడానికి ఏమైందని అంటుంది. నా అత్తింటి గౌరవం మర్యాదలు నాకు ముఖ్యం అని అంటుంది. నిన్ను చూడాలనిపిస్తుంది.. ఒక్కసారి రావా అని క్రిష్ అడుగుతాడు. దానికి నందిని ఓకే అంటుంది..

ఇక సత్య మహాదేవయ్యకు స్వీట్స్ ఇస్తుంది. పండుగకు కాదు నేను గెలిచినందుకు అని అంటుంది.. ఆయుధాలు లేకుంటే నేను మళ్లీ కొనలేనా నువ్వు ఏదో గెలిచినట్లు ఫీల్ అవుతున్నావు అంటే మళ్లీ కొనడానికి నీ కొడుకు గానీ కొడుకు ఒప్పుకోడు అని అంటుంది. దానికి మహదేవయ్య ఆడిని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు అంటాడు. మీ చిన్నా ఒక మాట అన్నాడు గుర్తుందా మీ ధైర్యం తో పాటుగా నా తెలివితేటలూ అంటే ఇష్టం అని అంటాడు.. నా తెలివితో ఇంకా చెయ్యాల్సిన చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది. ఇక సత్య కూడా సై అన్నట్లు వెళ్ళిపోతుంది. ఇక రేణుక రుద్రకు యాపిల్స్ ఇస్తుంది.. భర్తను ఎదురించి మాట్లాడుతుంది. రుద్ర అది సహించలేడు.. రేణుకను చంపడానికి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. సత్య వస్తుంది సత్య వినలేదని సంతోషంగా ఫీల్ అవుతాడు.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రావణుడు దహన ఉంటుంది. రేణుకను అక్కడ కట్టేస్తారు. రావణుడు కు నిప్పు పెడతారు. మరి రేణుక పరిస్థితి ఏంటో రేపు చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×