BigTV English

Brahmamudi Serial Today October 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ అంటే ఇష్టం లేదన్న కావ్య – రాహుల్‌కు వార్నింగ్‌ ఇచ్చిన స్వప్న

Brahmamudi Serial Today October 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ అంటే ఇష్టం లేదన్న కావ్య – రాహుల్‌కు వార్నింగ్‌ ఇచ్చిన స్వప్న

Brahmamudi serial today Episode:   కృష్ణమూర్తి , కనకం పెళ్లి రోజు వేడుకలు చాలా గ్రాండ్‌గా చేస్తుంటారు. కేక్‌ కటింగ్‌ నుంచి ప్రతిది రాజ్‌ దగ్గరుండి చూసుకంటుంటాడు. ఇంతోల మూర్తి, కనకం వచ్చి  కేక్‌ చేస్తారు. తర్వాత రాజ్‌, కావ్య ఒకరినొకరు చూసుకుంటూ కేక్‌ నువ్వు తినిపించు అంటే నువ్వు తినిపించు అంటూ వాదులాడుకుంటారు. అల్లుడుగారు మీరే ముందు తినిపించండి అని కృష్ణమూర్తి చెప్పగానే సరేనని రాజ్‌ తినిపిస్తాడు. కావ్య, అపర్ణ, ఇందిరాదేవి వరుసగా వచ్చి మూర్తి, కనకానికి విషెస్‌ చెప్పి కేక్‌ తినిపిస్తాడు. రుద్రాణి, ధాన్యలక్ష్మీ మాత్రం దూరంగా ఉంటారు.


తర్వాత అందరూ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటుంటారు. భార్యభర్తల అనుబంధం గురించి.. దాంపత్యం గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తుంటారు.  చెట్టుమీద కాయ, సముద్రంలో ఉప్పు కలిస్తేనే ఊరగాయ అయినట్టు.. ఒకింట్లో పుట్టిన అబ్బాయి.. మరో ఇంట్లో పుట్టిన అమ్మాయి కలిస్తే జీవితం అవుతుంది అని ఇందిరాదేవి చెప్తుంది. అపర్ణ కూడా  క్షమించరాని తప్పులు జరిగినా నేను అత్తిటి గడప దాటలేదు. అటు పుట్టింటికి ఇటు అత్తింటికి మచ్చ తెచ్చే పని నేను చేయలేదు అంటూ తన దాంపత్య జీవితం గురించి చెప్తుంది.

ఇంతలో ఇందిరాదేవి కనకాన్ని చూస్తూ ఇప్పుడు నీ అనుభవం షేర్‌ చేసుకో కనకం అంటుంది. కనకం లేచి చెప్పబోతుంటే.. రాజ్‌ కంగారుగా అత్తయ్యా మీరేం లేవకండి ఇక్కడు ఎవ్వరూ ఏమీ అనుకోరు కూర్చునే చెప్పండి అంటాడు. సరే బాబు అంటూ  నాకు ముగ్గురు కూతుళ్లు.. ముగ్గురు పెళ్లై వెళ్లిపోయారు. అంటే పిల్లలు కూడా మనతో శాశ్వతంగా ఉండరు. ఆయనకు నేను.. నాకు ఆయన. అంటే భార్యాభర్తల అనుబంధం అంత గొప్పది. నేను ఎన్ని అబద్దాలు చెప్పినా.. ఎంత చేసినా నా భర్త నన్ను ఇంట్లోంచి  ఏనాడు వెళ్లగొట్టలేదు అంటూ ఎమోషనల్‌ అవుతూ చెప్తుంది కనకం. తన కొడుకును గుర్తు చేసుకుని ఏడుస్తుంది.


ఇంతలో ప్రకాష్‌ కల్పించుకుని ఇప్పుడు నేను చెప్తాను. అని ఏదో ఆలోచిస్తుంటే మామయ్యా మర్చిపోయినట్టు ఉన్నాడు అని రాహుల్‌ వెటకారంగా మాట్లాడతాడు. దీంతో నేనేం మర్చిపోలేదు అంటూ మా పెళ్లైన రెండో రోజే నాకు మతి మరుపు ఉందని ధాన్యలక్ష్మీకి తెలిసింది. కానీ ఈ రోజు వరకు అడ్జస్ట్ అవుతూనే ఉంది అని చెప్తాడు. తర్వాత స్వప్న  నువ్వు చెప్పు అని అపర్ణ అడగ్గానే నాకంటే పెద్దవారైన అత్తయ్యగారు ఉన్నారు కదా? ఆంటీ..  అంటూ… వద్దులే ఆవిడ చెప్తే అన్ని విడిపోయిన స్టోరీలే చెప్తుంది. నేనే చెప్తాను. అంటూ..

రాహుల్‌ నన్ను మోసం చేయాలనుకున్నాడు. అది అందరికీ తెలిసిందే.. కానీ పెళ్లి జరిగితే అతనితోనే జరగాలనుకున్నాను. ఇప్పటికీ ఇద్దరం గొడవ పడుతూనే ఉన్నాం. కానీ రాహుల్‌ నన్ను ఇంట్లోంచి పొమ్మనలేదు. నేను రాహుల్‌ ను వదిలి పోవాలనుకోలేదు. చచ్చేదాకా రాహుల్‌ నన్ను భరించాల్సిందే అని చెప్తుంది స్వప్న. దీంతో రుద్రాణ్ని ఎక్కడ వాడి పరువు తీస్తావో అనుకున్నాను అని మనసులో అనుకుంటుంది.

రాహుల్‌ ను చెప్పమని ప్రకాష్‌ అంటాడు. దీంతో రాహుల్‌ తన లైఫ్‌ గురించి చెప్తాడు. నాకు నిజంగా భార్యాభర్తల బంధం అంటేనే తెలియదు. తెలియకుండానే కాపురం చేశాను. తెలియకుండానే ఇప్పుడో బిడ్డకు తండ్రిని కాబోతున్నాను. ఇవాళ నా ముందు మాట్లాడిన వాళ్ల మాటలు విన్నాక నిజంగా ఈ బంధంలో మ్యాజిక్‌ ఉందేమో అనిపించింది. ఏం చేస్తాను. చచ్చేదాకా ఈ స్వప్నను భరిస్తాను తప్పదు అంటాడు.

రాహుల్‌ మాటలకు ఆశ్చర్యపోయిన ప్రకాష్‌ అరేయ్‌ ఏమో అనుకున్నానురా.. చాలా బాగా చెప్పావు సూపర్.. అంటాడు. తర్వాత అప్పును చెప్పమని అపర్ణ అడుగుతుంది. అప్పు కూడా తన ఫీలింగ్స్‌ షేర్‌ చేస్తుంది. కళ్యాణ్‌తో పెళ్లి అయ్యే వరకు నాకేం తెలియదు.. ఎవరేం అనుకుంటే నాకేంటి అనుకునే దాన్ని.  బిందాస్‌ గా బతికేదాన్ని.. నేను అందరి ఆడపిల్లల్లా ఉండను మగరాయుడిలా ఉంటాను. కానీ ఎప్పుడైతే కళ్యాణ్‌తో పెళ్లై ఇంట్లోంచి బయటకు వచ్చానో అప్పుడే నా పద్దతి మారిపోయింది. కళ్యాణ్‌ కోసం అన్ని నేర్చుకుంటున్నాను అని చెప్తుంది అప్పు.

ఇప్పుడిక కళ్యాణ్‌  నీ అభిప్రాయం చెప్పు అంటుంది ఇందిరాదేవి.  నాకు మాట్లాడ్డం రాదు రాయడం తప్పా.. కానీ ఇప్పుడు మాట్లాడక తప్పదు అంటూ అనామిక వెళ్లిపోయిన దగ్గర నుంచి అప్పుతో పెళ్లి జరిగే వరకు చెప్తాడు. నా దృష్టిలో భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడమే అసలైన పేదరికం. నేనిప్పుడు కోటీశ్వరుడిని అంటాడు రాహుల్‌. ఇక రాజ్‌ నువ్వు కూడా ఏదైనా చెప్పు అంటుంది ఇందిరాదేవి. నేనా నేనేం మాట్లాడతాను అంటాడు రాజ్‌. దీంతో అందరూ మాట్టాడిందే మాట్లాడరా.. మీలో మార్పు కోసమే మేం మాట్లాడింది. కనీసం భార్యాభర్తలు ఎలా ఉండకూడదో అదైనా చెప్పు అంటుంది అపర్ణ.

ఏం చెప్పాలి. మీరంతా మాట్లాడాక నాకు అర్థం అయింది. భార్యాభర్తలంటే ఇలా ఉండాలా? ఇలా సర్ధుకుపోవాలా? ఇంతలా కలిసి ఉండాలా? కోపం ఆవేశం ఇవన్నీ మనుషుల్ని దూరం చేస్తాయే తప్పా మనసుల్ని దూరం చేయలేవు. ఆ మనసుల మధ్య ఒక్కసారి ఒక బంధం ఏర్పడితే తప్పా ఏంత కోపం ఉంటే ఏంటి..? ఇక్కడి దాకా లాక్కొచ్చి పడేస్తుంది అని రాజ్ చెప్తాడు.

ఇక కావ్యను చెప్పమని అందరూ అడగ్గానే..  నా ఇల్లు, నా భర్త,  నా పిల్లలు ఇవన్నీ ఒక భ్రమ, ఒక మాయ భార్యాభర్తల మధ్య సంబంధం చివరి వరకు కొనసాగాలంటే నమ్మకం. అది నా భర్తకు నామీద లేదు. కట్టిపడేయాల్సింది ప్రేమ. అది నా భర్తకు నీ మీద లేదు. అందుకే ఈరోజు ఆయన జీవితంలో నేను లేను.  అంటూ  కావ్య చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు.

ఇంతలో పతులు వచ్చి దాంపత్య వ్రతం చేయడానికి అంత రెడీ చేశారా? వ్రతంతో ఎవరెవరు కూర్చుంటారు అని అడుగుతాడు. కనకం నా ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లు కూర్చుంటారని చెప్తుంది. దీంతో కావ్య నేను కూర్చోనని వెళ్లిపోతుంది.  తర్వాత కనకం నాటకం ఆడుతూనే కావ్యను నువ్వే ఒప్పించాలని రాజ్‌కు చెప్తుంది. రాజ్‌ నేను వెళ్లి అడగనని చెప్తాడు.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Stories

×