E-Paper
Advertisement

Satyabhama Today Episode : మహాదేవయ్య ప్లాన్ ను తిప్పికొట్టిన సత్య.. మైత్రికి షాక్ ఇచ్చిన నందిని..

Satyabhama Today Episode : మహాదేవయ్య ప్లాన్ ను తిప్పికొట్టిన సత్య.. మైత్రికి షాక్ ఇచ్చిన నందిని..
Advertisement

Satyabhama Today Episode October 25th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్య తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే లేచి వచ్చిన సంజయ్ సత్యని చూసి స్టన్ అయిపోతాడు. ఇంత అందాన్ని నా కళ్ళతో చూస్తే సరిపోదు. నాకు కెమెరాలతో బంధించాలని తన ఫోన్ లో ఫోటో తీయాలని ముందుకు వెళ్తాడు. సత్య కళ్ళు మూసుకొని దేవుడికి పూజ చేస్తుంటే ఫోటోలు తీస్తాడు అది గమనించిన సత్య సంజయ్ ని పిలుస్తుంది. అప్పుడే క్రిష్ అక్కడికి వస్తాడు. కానీ క్రిష్ సంజయ్ అలా చేసి ఉండడనేసి వెనకేసుకుని వస్తాడు. అప్పుడు సంజయ్ దొరికిపోతానని ఆ ఫోటోలను ప్రత్యేక చూపిస్తాడు. వాటిని క్రిష్ ముందే డిలీట్ చేస్తాడు. సత్యను ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు.. ఇక నందిని హర్ష మాట్లాడుకుంటూ ఉంటారు. నందిని భర్తపై ప్రేమతో ఉప్పొంగి ఖుషి అయిపోతుంది.నందిని కోపంగా ఫోటో పగిలినందుకు బాధ లేదు కానీ నీ ఫ్రెండ్ చేయి తగిలినందుకు ఇంత బాధ పడుతున్నావా అనేసి హర్షతో గొడవకు దిగుతుంది. ఇక హర్ష నందిని కి సారీ చెప్తాడు. ఇక సత్య క్రిష్ ఫోటోల ను తీస్తుంది. ఇక క్రిష్ ఆ ఫోటోల ను డిలీట్ చెయ్యమని అడుగుతాడు.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. క్రిష్ కోసం సోపాలో కూర్చొని నిద్ర పోతు మహాదేవయ్య ఉంటాడు. అది చూసిన క్రిష్ ఏమైంది బాపు నువ్వు ఇంకా నిద్ర పోలేదా అని అడుగుతాడు. లేదు రా నీకోసమే చూస్తున్న అని అంటాడు. ఏమైంది బాపు ఏదైనా అర్జెంట్ నా అని అడుగుతాడు. అదేం లేదు రా నువ్వు పగలు దొరకడం లేదు.. నీకు ఎన్నో పనులు ఉంటాయి. నేనొక్కడిని కాదుగా నీకు చాలా మంది ఉంటారు. ఈ డొంక మాటలు ఎందుకు అని క్రిష్ మహాదేవయ్యతో అంటాడు. మహాదేవయ్య రేపు నామినేషన్ వెయ్యాలని నీకు గుర్తు లేదు కదా అని అంటాడు. ఎందుకు బాపు నన్ను వేరు చేసి మాట్లాడతావు అనేసి క్రిష్ అంటాడు. నువ్వు నామినేషన్స్ వేస్తె నాకు సంతోషమే కదా అని క్రిష్ అంటాడు. అయితే నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు బాపు అని క్రిష్ అడుగుతాడు.

Advertisement

రేపు మనం నామినేషన్స్ వెయ్యడానికి హైదరాబాద్ వెళ్లాలని మహాదేవయ్య క్రిష్ తో చెబుతాడు. అలాగే అంటాడు. అక్కడ ఆ నరసింహ అడ్డు పడితే వాడిని వేసేయ్యాలి అని మహాదేవయ్య క్రిష్ తో అనడం సత్య వింటుంది. ఇక మహాదేవయ్య సత్య ను చూసి నా కొడుకుగా నన్ను ఎమ్మెల్యేను చెయ్యాల్సిన బాధ్యత నీదే.. చిన్నప్పటి నుంచి నేను ఆశ పడుతున్న అని తెలుసు కదా అంటాడు. నీ కోరికను ఎలాగైనా నేను తీరుస్తాను బాపు అంటాడు. అది విన్న సత్య షాక్ అవుతుంది. క్రిష్ ను చంపడాని కి వెళ్లనివ్వకూడదు అని ప్లాన్ చేస్తుంది. అయితే క్రిష్ లోపలికి రాగానే భర్తతో రొమాంటిక్ గా మాట్లాడుతుంది. నేను రేపు హైదరాబాద్ కు వెళుతున్న అని అంటే నేను వస్తాను అని అడుగుతుంది. మొత్తానికి క్రిష్ అయితే సత్య కోసం ఒప్పుకుంటాడు.

ఇక మైత్రి తన చేతికి దెబ్బ తగిలిన విషయం పై బాధ పడుతుంది. ఇక హర్ష నందిని కోపంగా ఉండటం చూసి దగ్గరకు వెళ్తాడు. తనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. నీ ఫీలింగ్ అర్థం చేసుకోకుండా అన్నాను నన్ను క్షమించు ప్లీస్.. రేపు మనం వెళ్ళేలోపు హర్ష దగ్గరకు వచ్చి నందినికి సారీ చెబుతుంది. కొత్త ప్రేమ్ తీసుకొచ్చి పెడతాను అని చెబుతాడు. ఇక ఇద్దరు సరదాగా ఉండటం చూసిన మైత్రి వీరిద్దరినీ ఇలా చూడలేకున్నా ఎలాగైనా విడగొట్టాని ప్లాన్ చేస్తుంది. దాంతో వాళ్ళ గదిలోకి వెళ్తుంది. నందిని కొంచెం కూడా బుద్ది లేదా అని మైత్రిని తిడుతుంది. అది పెద్ద గొడవగా మారుతుంది..

Advertisement

ఇకపోతే క్రిష్, మహాదేవయ్య హైదరాబాద్ కు వెళ్తున్నారని సంజయ్ తెలుసుకుంటాడు. ఆ హైదరాబాద్ ట్రిప్ అతనికి అనుకూలంగా మార్చుకోవాలని సంజయ్ ప్లాన్ చేసుకుంటాడు. అప్పుడే సత్య నేను అంటుంది. అది చూసి సంజయ్ షాక్ అవుతాడు. ఇక మహాదేవయ్య కూడా షాక్ అవుతాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటీ ఎపిసోడ్ లో రేపు మనం నామినేషన్ కోసం హైదరాబాద్ వెళ్తుంటే నేను వస్తానని సంజయ్, మహాదేవయ్యతో అంటాడు.. మరి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా? అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×