BigTV English

Bomb Threat: తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన పోలీసులు

Bomb Threat: తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన పోలీసులు

Bomb Threat : ఈ మధ్యకాలంలో విమానాశ్రయాలకు, పలు నగరాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం మనం చూస్తేనే ఉన్నాము. తాజాగా తిరుపతిలో పలు హోటల్స్ బాంబులతో పేల్చేస్తామని ఉగ్రవాదులు ఈమెయిల్స్ పంపడం, బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. నగరంలో నాలుగు హోటల్స్‌కు  బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతిలోని హోటల్స్‌లో బాంబు పెట్టామంటూ ఫోన్ కాల్‌ రావటంతో అధికారులు ముమ్మర సోదాలు చేశారు. నగరంలో ఉన్న హోటళ్లలో.. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకూ తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా బాంబు లేకపోవటంతో.. ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ కాల్ ఎవరు చేశారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదిలా ఉంటే.. మరోవైపు ఇండియన్ ఎయిర్ లైన్స్‌కు బాంబు బెదిరింపులు కంటిన్యూ అవుతున్నాయి. బెదిరింపులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓవైపు కేంద్రం హెచ్చరికలు చేస్తున్నప్పటికీ.. కాల్స్ ఆగడం లేదు. నిన్న ఒక్కరోజే 90కి పైగా విమానాలకు ఈ ఫేక్‌ బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తుంది. వాటిలో ఎయిరిండియా, విస్తారా, ఇండిగో, ఆకాశ ఎయిర్‌లైన్స్ ఉన్నాయి. మొత్తంగా 11 రోజుల వ్యవధిలో 250 ఫ్లైట్లకు బెదిరింపులు వచ్చాయి.

ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఈ బాంబు బెదిరింపులు వ్యవహారానికి సంబంధించి 8 కేసులు నమోదు చేశారు. ఈ బెదిరింపులు ఎక్కువగా ఒకే ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్, మెటాతో సహా పలు సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో వర్చువల్‌గా కేంద్ర ప్రభుత్వ అధికారుల భేటీ అయ్యారు. ట్విట్టర్ తీరు నేరాలను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందంటూ వారు మండిపడ్డారు. ఇటువంటి బెదిరింపులను వ్యాప్తి చేస్తుంటే వాటి కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియజేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.


Also Read: మాజీ సీఎం వైఎస్ జగన్ కు విషెస్ చెప్పిన టీడీపీ.. అయితే కాస్త వెరైటీగా..!

వరుస ఘటనలపై పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. విమానయాన భద్రతే ప్రభుత్యానికి అత్యున్నత ప్రాధాన్యమన్నారు. బెదిరింపులకు పాల్పడేవారిని నోఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాలను సవరిస్తున్నామన్నారు. బెదిరింపు కాల్స్, సోషల్‌ మీడియా పోస్టులకు పాల్పడేవారికి జీవిత ఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తీసుకొస్తున్నామన్నారు. విమానం బోర్డింగ్ అయ్యాక బెదిరింపులు చేసేవారికి ఇలాంటి శిక్షవిధించేలా ఇప్పటికే చట్టంలో కొన్ని సెక్షన్లు ఉన్నాయి. అయితే వేరే ప్రాంతాల్లో ఉంటూ.. బాంబు బెదిరింపులకు పాల్పడే వారికి కూడా ఈ సెక్షన్లు వర్తింపజేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

Related News

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Big Stories

×