BigTV English

Seethe ramudi katnam Serial Today September 14th: ‘సీతే రాముడి కట్నం’ సీరియల్‌: సీత బొటిక్‌ ఓపెనింగ్‌ కు వెళ్లిన మహా, జనా – మహాలక్ష్మీ పేరు బొటిక్‌ కి పెట్టి షాక్‌ ఇచ్చిన సీత

Seethe ramudi katnam Serial Today September 14th: ‘సీతే రాముడి కట్నం’ సీరియల్‌: సీత బొటిక్‌ ఓపెనింగ్‌ కు వెళ్లిన మహా, జనా – మహాలక్ష్మీ పేరు బొటిక్‌ కి పెట్టి షాక్‌ ఇచ్చిన సీత

Seethe ramudi katnam serial today September 14th Episode: సీత ఓపెన్ చేసే బొటిక్  కు మీరు రావాలని మహాలక్ష్మీని అడుగుతాడు రామ్. మీరు రాకపోతే సీత దగ్గర నా మాటకు విలువ ఉండదని చెప్తాడు. దీంతో మహా సరే వస్తామని చెప్తుంది. దీంతో రామ్ హ్యాపీగా సరేనని ఇప్పుడే వెళ్లి ఈ విషయం సీతకు చెప్తాను అని పైకి వెళ్తాడు. మనం షాపు ఓపెనింగ్కు వెళ్లాలా అక్కా అంటూ అర్చన అడగ్గానే రామ్ పిలిచినందుకైనా మనం వెళ్లాలని చెప్తుంది మహా. పైకి వెళ్లిన రామ్ సీతను హగ్ చేసుకుని గుడ్ న్యూస్ సీత అంటూ పిన్ని వాళ్లు షాపు ఓపెనింగ్ కు రావడానికి ఒప్పుకున్నారు అని చెప్తాడు.


మధు, సూర్యలను అవమానించిన జలజ

మరోవైపు సూర్యకు కాఫీ తీసుకుని వస్తుంది మధు. నీకోసం తెచ్చుకోలేదని అడుగుతాడు సూర్య. దీంతో నేను కాఫీ ఎక్కువగా తాగను అంటుంది మధు. అయితే ఉండు అంటూ ఒకే కాఫీని ఇద్దరు షేర్ చేసుకుని తాగుతుంటారు. జలజ చాటు నుంచి చూసి పైసా సంపాదన లేదు కానీ ప్రేమ మాత్రం ఒలకబోస్తున్నారు ఇద్దరు అని తిట్టుకుంటుంది. ఇంతలో సూర్య వాళ్ల అన్నయ్య వస్తాడు. ఇప్పుడే  నీ కాలుకు ఆపరేషన్ చేసే డాక్టర్ ఇంకో మూడు రోజులు మాత్రమే ఉంటాడట. తర్వాత అమెరికా వెల్లిపోతారట. మళ్లీ సంవత్సరం వరకు రారట. అందుకే డబ్బులు అరెంజ్ చేసుకోమన్నారు అని చెప్పగానే అందరూ ఆలోచిస్తుంటారు. ఇంతలో దగ్గరకు వచ్చిన జలజ చేయడానికి ఏముంది. ఇంతవరకు చేతికి డబ్బు అందలేదు కదా ఇక ఈ మూడు రోజుల్లో ఏమి వస్తాయి. ఇక అది జరిగే పని కాదు. అనగానే జలజను వాళ్లాయన తిడతాడు. దీంతో నిజం మాట్లాడితే నిష్టూరంగానే ఉంటుంది. అంటుంది. మధు మాత్రం నేనేం ఊరికే లేను కదా అంటుంది. నువ్వేం చేశావు. మీ చెల్లెలిని అడిగావు. కానీ ఇంత వరకు నీ చెల్లెలు నుంచి ఒక్క పైసా రాలేదు అంటుంది జలజ. దీంతో అందరి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో మీరింత బాధపడే బదులు ఆ మహాలక్ష్మీని అడగొచ్చు కదా? అంటుంది. దీంతో మధు, సూర్య కోసం అవసరం అయితే నా ప్రాణం ఇస్తాను కానీ ఆవిడను పైసా కూడా అడగను అంటుంది. తర్వాత జలజ వెళ్లిపోతుంది. సూర్య, మధును ఓదారుస్తాడు. నువ్వు ఎక్కువ టెన్షన్ పెట్టుకోకు అంటాడు సూర్య.


షాప్ ఓపెనింగ్ కు రెడీ అయిన సీత

తర్వాత షాపు ఓపెనింగ్ కు అన్ని రెడీ చేస్తుంది సీత. రామ్, సీతను మెచ్చుకుంటాడు. నువ్వు ఇంత స్పీడుగా షాపు ఓపెనింగ్ చేస్తావని అస్సలు ఊహించుకోలేదు అంటాడు. ఇంతలో సాంబ ఇక్కడ మగవాళ్ల బట్టలు ఉండవా? అని అడుగుతాడు. దీంతో రామ్, సాంబతో వేళాకోలం ఆడతాడు. ఇంతలో కొంతమంది మహిళలు వస్తారు. వాళ్లకు తక్కు వ ధరకు చీరలు, డిస్కౌంట్ లో జాకెట్లు ఇస్తాను అంటుంది. దీంతో రామ్ షాపు ఓపెన్ చేయకముందే డిస్కౌంట్లు ఇస్తున్నావా? అంటాడు రామ్.

మరోవైపు ఇంట్లో కూర్చుని మహాలక్ష్మీ బాధపడుతుంది. సీత అనుకున్నవి అనుకున్నట్లు చేస్తుందని నేను తనని అందుకోలేకపోతున్నాను అని మనసులో రగిలపోతుంది. ఇంతలో అర్చన, గిరి వచ్చి ఇంకా ఓపెనింగ్ కు రెడీ కాలేదేంటని అడుగుతారు. దీంతో రామ్ కోసం మనం వెళ్లాలని మహా చెప్తుంది. అక్కడికి వెళ్లి సీతను అవమానిద్దాం అని ప్లాన్ చేసుకుంటారు. ఇంతలో జనార్ధన్ రెడీ అయి వస్తుంటాడు. దీంతో జనార్ధన్ ను వెటకారంగా మాట్లాడుతుంది మహా. తర్వాత అందరూ కలిసి బొటిక్ దగ్గరుక బయలుదేరుతారు.

Also Read: ‘త్రినయని’ సీరియల్‌: విశాల్ రూపంలో వచ్చిన గజగండ – గాయత్రి పాప దెబ్బకు గజగండ పరార్

మహా, జనాలకు సీత గ్రాండ్ వెల్కం

మహా, జనా బొటిక్ ఓపెనింగ్ దగ్గరకు రాగానే సీత వెళ్లి స్వాగతం పలుకుతుంది. దీంతో కొత్తగా ఈ మర్యాదలు ఏంటని అడుగుతుంది మహా. ఇంతలో రామ్ వచ్చి మీకోసం సీత ఎదురుచూస్తుంది పిన్ని అంటాడు. మీరు రారేమోనని తెగ కంగారుపడిపోయింది. చూశావా సీత చెప్పినట్టే మా పిన్ని వాళ్లు వచ్చేశారు. అనగానే మాటిచ్చాక రాకుండా ఎలా ఉంటామని ఒకరు, ప్రాణం పోయినా మహా ఇచ్చిన మాట తప్పుడు అంటారు. దీంతో సీత అవునవును అత్తయ్య చెప్పిందే చేస్తారు. చేసేదే చెప్తారు. అని మా అత్తయ్య చీపు గెస్ట్ కదా అంటుంది.  మీరు ముఖ్య అతిథిగా వస్తు్న్నారని సీతమ్మగారు బ్రహ్మండమైన ఏర్పాట్లు చేశారు మేడం అంటాడు. దీంతో గిరి, సాంబను తిడతాడు. ఇంటి దగ్గర డ్యూటీ మానేసి ఇక్కడ చేస్తున్నావా? అంటాడు. అక్కడ డ్యూటీ చేస్తున్నాను. ఇక్కడ సీతమ్మ కోసం చేస్తున్నాను అంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మహిళలకు మహా గురించి గొప్పగా చెప్తుంది సీత.  దీంతో మహా పొంగిపోతుంది. ఇంతలో అర్చన నువ్వు మహాను పొగుడుతున్నావా? తిడుతున్నావా? సీత అని అడుగుతుంది. దీంతో మా రెండో అత్తయ్యను పొగుడుతుంటే మా మూడో అత్తయ్య కుల్లుకుంటుంది. అనగానే అర్చన షాక్ అవుతుంది.

షాపు పేరు చూసి షాకైన అర్చన, మహా, జనా

ఇంతలో షాపు పేరు ఓపెనింగ్ రామ్ చేత చేయిస్తుంది సీత. షాపు పేరు మహాలక్ష్మీ గారి కోడలు బొటిక్ అని ఉంటుంది. పేరు చూసిన మహా, అర్చన, గిరి, జనా షాక్ అవుతారు. ఇలాంటి పేరు ఎవరైనా పెడతారా? అంటూ అర్చన అడుగుతుంది. ఇలాంటి పేర్లు నువ్వు మాత్రమే పెడతావు సీత అంటుంది మహా దీంతో సీత కొన్ని సినిమాల  పేర్లు, సీరియల్స్  పేర్లు చెప్పి అవన్నీ హిట్ అయినప్పుడు నేను పెట్టిన పేరు హిట్ అవ్వదా అంటుంది. ఇంతటితో ఇవాళ్టీ సీతే రాముడి కట్నం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.

Related News

Big tv Kissik Talks: గుడ్ న్యూస్ చెప్పిన విష్ణు ప్రియ.. మరోసారి ప్రెగ్నెంట్ అంటూ?

Big tv Kissik Talks: అమ్మకు క్యాన్సర్.. ఆఖరి చూపు కూడా లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న విష్ణు ప్రియ!

Shobha Shetty: శోభా శెట్టి కొత్త వ్యాపారం.. దీని వెనుక ఉన్న సీక్రెట్ తెలుసా?

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ కుటుంబాన్ని కలిపేందుకు నర్మద ప్లాన్.. సాగర్ సర్ప్రైజ్.. ధీరజ్ కు లవ్ లెటర్..

Intinti Ramayanam Today Episode: పల్లవి పై కమల్ కు అనుమానం.. షాకిచ్చిన శ్రీయా.. అవని ప్లాన్ సక్సెస్ అవుతుందా..?

Nindu Noorella Saavasam Serial Today october 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు మిస్సమ్మ ల మధ్య గొడవ

Brahmamudi Serial Today October 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇంట్లోంచి వెళ్లిపోయిన కావ్య  

GudiGantalu Today episode: ప్రభావతి కోరిక తీర్చిన కామాక్షి.. మగాళ్లకు షాకిచ్చిన నాట్యమయూరి.. బాలు సెటైర్స్..

Big Stories

×