CM Chandrababu Pays Tribute: తెలుగు ముద్దు బిడ్డ, సీపీఎం టాప్ లీడర్ సీతారాం ఏచూరి పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని మనసులోని మాటను బయటపెట్టారు.
శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు.. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంటికి వెళ్లారు. ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
సీతారాం ఏచూరి మంచి నాయకుడని, నిత్యం పేద ప్రజలకు ఏం చేయాలని తపనపడే వ్యక్తని అన్నారు సీఎం చంద్రబాబు. నాలుగు దశాబ్దాలుగా ఆయనను తాను దగ్గరుండి చూశానని, కలిసి పని చేశానని చెప్పుకొచ్చారు. మంచి మిత్రుడిని కోల్పోయానని వెల్లడించారు.
ఎన్నో పోరాటాల్లో ఏచూరితో కలిసి ముందుకు సాగామని, సాధారణ కుటుంబంలో పుట్టి.. అసాధారణ వ్యక్తిగా సీతారాం తయారయ్యారని తెలిపారు. చిన్నప్పటి నుంచి లీడర్ లక్షణాలు అంది పుచ్చుకున్న సీతారాం.. ఢిల్లీ యూనివర్సిటీలో జేఎన్యులో స్టూడెంట్ లీడర్ స్థాయికి రావడం సాధారణ విషయం కాదన్నారు.
ALSO READ: ఆంధ్రా యువతిపై కువైట్ లో లైంగిక వేధింపులు.. సెల్ఫీ వీడియో ద్వారా బాధితురాలి ఫిర్యాదు..
కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆసక్తి కనబరచడం, అందులో చేరి అంచెలంచెలుగా ఎదిగి జాతీయస్థాయిలో ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యారని వివరించారు. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేశారని, అందరితో కలిసి ఉండేవారని గుర్తు చేశారు.
అజాతశత్రువుగా ఎన్నో పోరాటాల్లో కలిసి ముందుకు సాగామని, తెలుగువాడిగా ప్రత్యేక ప్రసిద్ధి చెందారని అన్నారు. దేశం మంచి రాజకీయ నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు ముఖ్యమంత్రి. ఆయనతో తనకున్న అనుబంధంతోనే చూడాలని ఇక్కడకు వచ్చానని, ఆయన మన మధ్య లేకున్నా.. చేసిన పనులు శాశ్వతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడిన సీతారాం ఏచూరి, ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. ఎయిమ్స్ నుంచి ఆయన బాడీని ఇంటికి తీసుకొచ్చారు నేతలు.
సీతారాం ఏచూరి పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఏచూరితో కలిసి పనిచేసిన నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. pic.twitter.com/PbrW0QmXn0
— Telugu Desam Party (@JaiTDP) September 13, 2024