BigTV English

Seethe ramudi katnam Serial Today September 17th: ‘సీతే రాముడి కట్నం’ సీరియల్‌: మహాకు షాక్‌ ఇచ్చిన సీత – ఇల్లు తాకట్టు పెడతానన్న శివకృష్ణ

Seethe ramudi katnam Serial Today September 17th: ‘సీతే రాముడి కట్నం’ సీరియల్‌: మహాకు షాక్‌ ఇచ్చిన సీత – ఇల్లు తాకట్టు పెడతానన్న శివకృష్ణ

Seethe ramudi katnam serial today Episode: షాపు ఓపెనింగ్‌ తర్వాత మహాలక్ష్మీ మీడియా ముందు సీతను పొగుడుతుంది. స్త్రీ సాధికారత మా సీత వల్లే సాధ్యమవుతుందని చెప్తుంది. తర్వాత మీడియా వాళ్లు వెళ్లిపోయాక సీత ఇక మీరు వెళ్లిపోవచ్చు అత్తలు అంటుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. అంటే నేను అనేది మీరు చాలా బిజీగా ఉంటారు కదా? అందుకే వెళ్లొచ్చు అని చెప్పాను అంటుంది.


సీతను తిట్టుకున్న అర్చన మహా. మీకు తెలివి లేదన్న జనా

దీంతో సరే అని అందరూ వెళ్తూ కారు దగ్గరకు వెళ్లి సీత మనల్ని వాడుకుందని రామ్‌ తో మంచిది అనిపించుకోవాలని పబ్లిషిటీ కోసం మిమ్మల్ని వాడుకుంది. అదీ కాక ఐదు వేలు కూడా లేని చీరను అరవై వేలకు అమ్మింది. అని అర్చన, మహా మాట్లాడుకుంటుంటే జనార్థన్‌ వాళ్లను తిట్టి సీత ఇంతదూరం రావడానికి కారణం మీరే బావిలో కప్పను తీసుకెళ్లి నదిలో పడేశారు. అది సముద్రంలోకి వెళ్లకుండా ఉంటుందా? అని చెప్పగానే దీంతో సీతకు అంత సీన్‌ లేదు అని చిన్నచూపు చూస్తారు. దీంతో ఇప్పటికైనా సీతను రెచ్చగొట్టే మాటలు, పనులు ఆపండి. సీతకు ఇప్పుడు రామ్‌ సపోర్టుగా ఉన్నాడు అని జనార్దన్‌ చెప్పినా అది ఎలా ఎదుగుతుందో నేను చూస్తాను జనా అంటుంది మహా. దీంతో ఇంత చెప్పినా మీరు మారరా? మీతో మాట్లాడి వేస్ట్‌ అంటూ వెళ్దాం పదండి అని వెళ్లిపోతాడు జనా?


సీత, రామ్‌ ల మధ్య రొమాంటిక్ సీన్‌, సీతకు చీర కొన్న రామ్‌

మరోవైపు బొటిక్‌ లో కూర్చున్న రామ్‌, సీతను మెచ్చుకుంటాడు. షాపుకు అత్తగారి పేరు పెట్టావు. షాపును అత్తగారితో ఓపెన్‌ చేయించావు. మీడియాతో అత్తగారి గురించి చెప్పావు. అత్తగారిని బాగానే వాడుకున్నావు అని రామ్‌ అనగానే ఏం మామ మీ పేరు చెప్పలేదని ఫీలయ్యావా? అని సీత అడుగుతుంది. దీంతో అదేం లేదు అంతా పిన్నితో చేయించి మంచి పని చేశావు అంటాడు. ఇక నేను ఆఫీసుకు వెళ్లాలి. వెళ్లే ముందు మా ఆవిడకు ఒక చీర కొనాలి ఒక మంచి చీర చూపించండి అంటాడు రామ్‌. దీంతో మీ ఆవిడ ఎలా ఉంటారో చెప్పండి నాలాగా ఉంటుందా? అని సీత అడగ్గానే ఛఛ మీరెక్కడ మా ఆవిడ ఎక్కడ మా ఆవిడ చాలా బాగుంటారు అని ఒక చీరను తీసి ఈ శారీ ఎలా ఉంది అని అడుగుతాడు రామ్‌. బాగుంది కానీ ఇది చాలా ఎక్కువ రేటు అని సీత చెప్తుంది. దీంతో ఇద్దరి మధ్య రొమాంటిక్‌ మూమెంట్‌ నడుస్తుంది. బ్యాక్‌ గ్రౌండ్‌లో సాంగ్‌ ప్లే అవుతుంది.

Also Read: త్రినయని’ సీరియల్‌: నాగులమ్మను తీసుకొచ్చిన గురువుగారు – భుజంగ మణి గురించి చెప్పిన పెద్దబొట్టమ్మ

టీచర్‌ కు చీర గిఫ్టుగా ఇచ్చిన సీత

తర్వాత ఇంటికి వచ్చిన సీత షాపు ఓపెనింగ్‌ చాలా బాగా జరిగిందని టీచర్‌ కు చెప్తుంది. మీరు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అంటుంది సీత. వద్దామనుకున్నాను కానీ మళ్లీ మహాలక్ష్మీ ఏడుస్తుందని రాలేదు అంటుంది టీచర్‌. మీరొస్తే ఆవిడ ఎందుకు ఏడుస్తుంది అని సీత అడుగుతుంది. నేను నీకు డబ్బులు ఇచ్చావని అందరికీ చెప్పావట కదా అందుకే ఏడుస్తుంది. అయినా అక్కడ జరిగిందంతా చూసినట్టుగా టీచర్‌ చెప్తుంది. తర్వాత మీరు ఇలాంటి షాపులు మరిన్ని ఓపెన్‌ చేయాలని నేను కోరుకుంటున్నాను అంటుంది టీచర్‌. దీంతో సీత థాంక్స్‌ చెప్పి గురుదక్షిణగా మీకు ఈ చిరు కానుక అని చీరను ఇస్తుంది. దీంతో మీ సుమతి అత్తమ్మ స్థానంలో ఉండి నిన్ను దీవిస్తున్నాను. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. బాగా పేరు తెచ్చుకుని నీ భర్త పేరు నిలబెట్టాలి అని చెప్పి సీతకు డబ్బులు ఇస్తుంది టీచర్‌. డబ్బులు తీసుకుని సీత వెళ్లిపోతుంది.

సూర్య ఆపరేషన్‌ డబ్బుల కోసం శివకృష్ట దగ్గరకు వెళ్లిన మధు

తర్వాత మధు వాళ్ల ఇంటికి వెళ్దామని శివరాం, ఆయన భార్య అనుకుంటారు. ఇంతలో మధుయే అక్కడికి వస్తుంది. సూర్యకు ఆపరేషన్‌ చేస్తే కాలు వస్తుందని డాక్టర్‌ చెప్పారు. ఆపరేషన్‌ కు పది లక్షలు ఖర్చు అవుతుందట అని ఆ విషయం సీతకు చెప్పాను సర్దుతానని చెప్పింది. కానీ ఇంకా ఏమీ అనలేదు అని మధు చెప్పగానే పది లక్షలు అంటే సర్దటానికి కొంచెం టైం పడుతుంది కదమ్మా.. తను కూడా రామ్‌ ను అడగాలి అని చెప్తాడు శివకృష్ణ. ఏం చేయాలో తెలియక నేను మీ దగ్గరకు వచ్చాను. మీరు ఏమైనా సర్దుతారా? నాన్నా సూర్యకు బాగయ్యాక కొంచెం కొంచెం తీరుస్తాము అంటుంది మధు. దీంతో శివకృష్ణ సరే అమ్మా.. నా ప్రయత్నం నేను చేస్తాను. ఎక్కడా దొరక్కపోతే ఈ ఇంటిని తాకట్టు పెడతాను అంటాడు. దీంతో మధు వద్దని ఊర్లో మీకు మంచి పేరుంది అని చెప్తుంది. నేనే ఏదో ప్రయత్నం చేస్తాను అని వెళ్లిపోతుంది మధు.

సీతకు ఫోన్‌ చేసిన మధు.. లిప్ట్‌ చేసిన మహాలక్ష్మి

ఇంటికి వెళ్తున్న మధు డబ్బు కోసం అమ్మానాన్నలను ఇబ్బండి పెట్టడం మంచిది కాదు అని సీతకు ఫోన్‌ చేసి డబ్బులు అడుగుతాను అనుకుని ఫోన్‌ చేస్తుంది. దీంతో సీత ఫోన్‌ మహాలక్ష్మీ లిఫ్ట్‌ చేస్తుంది. విషయం ఏంటో నాకు చెప్పు అని అడుగుతుంది. దీంతో ఆపరేషన్‌ గురించి పది లక్షల గురించి సీతకు కాల్‌ చేశానని మధు చెప్పగానే మహా షాక్‌ అవుతుంది. ఇంతటితో ఇవాళ్టీ సీతే రాముడి కట్నం సీరియల్‌ ఎపిసోడ్‌ ముగుస్తుంది.

 

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×