BigTV English

Indian opener Yashasvi Jaiswal: ప్యూచర్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ అతడే.. ఆస్ట్రేలియా క్రికెటర్లు

Indian opener Yashasvi Jaiswal: ప్యూచర్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ అతడే.. ఆస్ట్రేలియా క్రికెటర్లు

Yashasvi Jaiswal As Next Generation Superstar: టీమిండియా నుంచి ప్యూచర్‌లో స్టార్ బ్యాట్స్ మెన్ ఎవరవుతారనే ప్రశ్నకు ఆస్ట్రేలియాన్ క్రికెటర్లు ఇంట్రెస్టింగ్‌గా సమాధానం ఇచ్చారు. అన్ని ఫార్మాట్లలో బెటర్ పర్ఫామెన్స్ చేస్తున్న యశస్వి జైస్వాల్ వైపు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇంట్రెస్ట్ చూపించారు.


టీమిండియాలలో తదుపరి సూపర్ స్టార్‌గా ఎదిగే క్రికెటర్ ఎవరంటూ పలువురు ఆస్ట్రేలియా ప్లేయర్లను ఓ స్పోర్ట్స్ చానెల్ ప్రశ్నించింది. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్ , నాథన్ లయన్, అలెక్స్ కారే వంటి ప్లేయర్లు.. యశస్వి జైస్వాల్ పేరును ఎంచుకున్నారు. సూపర్ స్టిర్ అయ్యే అవకాశాలు అతడికే ఉన్నాయని స్మిత్ పేర్కొన్నారు. అలాగే మిగతా ఆటగాళ్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆసీస్ ఆటగాళ్లలో ఎక్కువమంది టీమిండియా క్రికెట్ సంచలనంగా జైస్వాల్‌కే మద్దతు పలికారు. అన్ని ఫార్మాట్లు ఆడగల అద్భుత క్రికెటర్ అని కొనియాడారు. మరో వైపు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. వీరంతా శుభ్ మన్ గిల్‌ను ఎంపిక చేశారు. ఆటలో గిల్ టెక్నిక్ బాగుంటుందని గ్రీన్ ప్రశంసించగా..బౌలర్లపై అతడు ఆధిపత్యం చెలాయిస్తాడని హెడ్ మెచ్చుకున్నారు.


అయితే, జైస్వాల్ ఇప్పటివరకు టెస్టుల్లో, వన్డేల్లో ఆస్ట్రేలియా టీం ఆడలేదు. గిల్ మాత్రం ఆసీస్‌పై మంచి ప్రదర్శనే చేశాడు. 2020లో మెల్ బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టుతో గిల్ టెస్టుల్లో ఆరంగేట్రం చేయగా.. ఆసీస్‌పై ఏడు వన్డేల్లో 272 పరుగులు చేశాడు.

ఇక, యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్ లోకి 2023లో ఆరంగేట్రం చేయగా.. ఆడిన తొలి మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌పై 171 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక, ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో మొత్తం 712 పరుగులు చేశాడు. ఒకే సిరీస్‌లో 700కు పైగా పరుగులు చేసిన రెండో భారత్ క్రికెటర్‌గా నిలిచాడు.

Also Read: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

అలాగే, టీ20లోనూ యశస్వి అదరగొట్టాడు. మొత్తం 23 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 723 పరుగులు చేశాడు. ఇదిలా ఉండగా, టీమిండియా ఈనెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడనుంది. ఆ వెంటనే న్యూజిలాండ్‌తో టెస్టులు ఉన్నాయి. ఇక, ఆ తర్వాత నవంబర్‌లో జరిగే బోర్డర్ గావస్కర్ ట్రోఫీ జరగనుంది.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×