E-Paper
Advertisement

షాలిని ఈజ్ బ్యాక్.. షాక్ లో కంటెస్టెంట్స్!

షాలిని ఈజ్ బ్యాక్.. షాక్ లో కంటెస్టెంట్స్!
Advertisement

Bigg Boss 10:తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ ఆడియన్స్ లో సరికొత్త క్యూరియాసిటీని పెంచుతున్న బిగ్ బాస్ సీజన్ 10 ఎట్టకేలకు ఆరు వారాలు పూర్తిచేసుకుంది. ఆరువారాలలో ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం, ఎలిమినేట్ అవుతారు అనుకున్న కంటెస్టెంట్స్ సేవ్ అవ్వడం, ఊహించని టాస్కులు అభిమానులకు మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఇకపోతే గత కొన్ని వారాలుగా హౌస్ లో మంచి కంటెంట్ ఇస్తూ రోహిత్ గర్ల్ ఫ్రెండ్ అనిపించుకుంటూ మరింత క్రేజ్ సొంతం చేసుకుంది షాలిని (Shalini).అనవసరమైన విషయాలలోనే కాదు ప్రతి విషయంలో తలదూరుస్తూ స్క్రీన్ స్పేస్ సొంతం చేసుకుంటూ మరింత క్రేజ్ దక్కించుకున్న ఈమె టాప్ 5 వరకు వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా వర్షిణి (Varshini)నీ సేవ్ చేయడం కోసం ఈమెను ఎలిమినేట్ చేసినట్లు మొదట చూపించారు. కానీ ఈమెను మళ్లీ సీక్రెట్ రూమ్ కి పంపించి నాగార్జున(Nagarjuna ) అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

సీక్రెట్ రూమ్ నుండి హౌస్ లోకి అడుగుపెట్టిన షాలిని..

ఇకపోతే ఈమెను సీక్రెట్ రూమ్ లో ఉంచినట్టు కంటెస్టెంట్స్ కి చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేసిన బిగ్ బాస్ తాజాగా ఆమెను హౌస్ లోకి పంపించారు. ఈ మేరకు 45వ రోజుకు సంబంధించి విడుదల చేసిన ప్రోమోలో షాలిని హౌస్ లోకి అడుగుపెట్టడం చూడవచ్చు. ఇకపోతే తాజాగా విడుదల చేసిన మొదటి ప్రోమోలో.. త్రిగుణ్ మీరు కన్ఫెషన్ రూమ్ కి రండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. అసలేమైందో అని హుటాహుటిన వెళ్లగా అక్కడ షాలిని కనిపించింది. ఇక షాలినినీ చూడగానే సంబరపడిపోయిన త్రిగుణ్ ఆమెను హౌస్ లోకి తీసుకొచ్చారు.

కంటెస్టెంట్స్ రియాక్షన్..

Advertisement

ఇకపోతే త్రిగుణ్ షాలినినీ హౌస్ లోకి తీసుకురాగానే మొదట సర్ప్రైజ్ అయ్యి ఆమెను చూసి హత్తుకొని సంబరపడిపోయారు రోహిత్. షాలిని హౌస్ లోకి రాగానే మిగతా కంటెస్టెంట్స్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే కొంతమంది మాత్రం ఆమె మళ్ళీ ఎందుకు వచ్చింది రా బాబు అనే రేంజ్ లో షాక్ అవడం హైలెట్గా నిలిచింది. ఇకపోతే వైల్డ్ ఫైర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన శివ.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇక శివ ఎక్స్ప్రెషన్ చూసిన షాలిని ప్రశాంతంగా ఉన్నాను.. మళ్ళీ ఎందుకు వచ్చింది రా ఈమె అనుకుంటున్నాడు అని తన మనసులో భావాలను బయటకు చెప్పింది. ఓ మై గాడ్ అంటూ కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు అనిపించింది శివ. రోహిత్, షాలిని మాట్లాడుకుంటూ ఎందుకురా వచ్చిందనుకుంటున్నారు కదా నన్ను అంటూ కాస్త బాధ వ్యక్తం చేసింది.

మింగుడు పడడం లేదా?

త్రిగుణ్ , రాంప్రసాద్, వంశీ, సుధీర్, నరేష్, శివ, ఝాన్సీ ఇలా వీరంతా ఒకచోట చేరి భోజనం తింటూ షాలిని గురించి చర్చించుకున్నారు. ఇకపోతే వీళ్ళ మాటలను బట్టి చూస్తే షాలిని మళ్లీ హౌస్ లోకి రావడం వీళ్లకు నచ్చలేదు అన్నట్లుగానే వ్యవహరించారు మొత్తానికైతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో షాలిని రీ ఎంట్రీ కొంతమందికి సంతోషాన్ని కలిగించిన చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News

8 కాదు 12.. ఈ వారం నామినేషన్ లిస్ట్ ఇదే..ఎవరెవరున్నారంటే?

Podarillu Serial : మహా, చక్రీ కలుస్తారా..? ఫైనల్ ట్విస్ట్ ఇదేనా..?

అయ్యో.. బాలుకు ఎంత కష్టం వచ్చింది.. ఫ్యాన్స్ హర్ట్..

Gundeninda GudiGantalu Today episode: శృతి ఉప్మా ప్రయోగం.. రోహిణికి దిమ్మతిరిగే షాక్.. బాలు ఇరుక్కున్నాడే..?

Karthika Deepam 2 Serial Today Episode October 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్, దీపలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన శివనారాయణ 

Podarillu Today Episode : శైలు దెబ్బకు కేశవ ఫీల్.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. నారాయణకు మహా సపోర్ట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని కాపాడిన ధీరజ్.. అమూల్య దొరికిపోతుందా..? భాగ్యంకు షాక్..

Big Stories

Advertisement
×