E-Paper
Advertisement

ఏపీ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు అంశం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, వాటిపై మాత్రమే

ఏపీ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు అంశం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, వాటిపై మాత్రమే
Advertisement

AP Local body Election-2026: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త మలుపు తిరిగాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తలుపు తట్టింది వైసీపీ. ఈ క్రమంలో నామినేషన్లు వేయని చోట గడువు పెంచాలని ఆదేశించింది. నామినేషన్ల గడువు అన్ని చోట్లా పొడిగించడానికి మాత్రం నిరాకరించింది న్యాయస్థానం.

ఏపీ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు అంశం

ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లను అడ్డుకున్నారంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ జాయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. వైసీపీ తరఫున సీనియర్ న్యాయవాది అమర్‌దీప్ సింఘ్ తన వాదనలు వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 మున్సిపాలిటీల్లో 63 శాతం మేర వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని వివరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ హాస్యాస్పదంగా మారిందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొనే విధంగా నామినేషన్ల స్వీకరణ తుది గడువును పెంచాలని కోరారు. అంతేకాదు అభ్యర్థులకు అదనపు రక్షణ కల్పించి నామినేషన్ల తుది జాబితా విడుదలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

వాదోప వాదనలు ఏ విధంగా ఉన్నాయి?

Advertisement

ఏపీ ఎన్నికల సంఘం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పరమేశ్వర్ తన వాదనలు వినిపించారు. వైసీపీ తరపు న్యాయవాది చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. అభ్యర్థుల భద్రత కోసం అక్టోబర్ 16న చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. నామినేషన్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైన ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ పూర్తి స్థాయిలో జరిగిందన్నారు. తీవ్ర సమస్యాత్మక ప్రదేశాల్లో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశామని కోర్టుకు వివరించారు.

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, వాటిపై ఎస్ఈసీకి సూచన

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తన వాదనలు వినిపించారు. పిటిషనర్ న్యాయస్థానం ముందుకు నిజాయితీగా రాలేదన్నారు. అసలు పిటిషనర్ తరపు పార్టీ.. ఇతర రాష్ట్రాల నుంచి అల్లరి మూకలను, అసాంఘిక శక్తులను రప్పించిందన్నారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తోందని వివరించారు.  ఇరుపక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాధాన్యతను స్పష్టం చేసింది. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఒక భాగమని తెలిపింది. అభ్యర్థులు స్వేచ్ఛగా పాల్గొనే హక్కు ప్రాథమిక అంశమని పేర్కొంది.

Advertisement

ఎన్నికల నిర్వహణ పూర్తి బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని తెలిపింది. శాంతి భద్రతల పరిరక్షణలో యంత్రాంగం పక్షపాతంగా వ్యక్తమవుతోందని పిటిషనర్ ఆరోపణలపై అవసరమైన చర్యలు తీసుకున్నామని ఎస్‌ఈసీ-రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నాయని గుర్తు చేసింది.  ఎన్నికల ప్రక్రియ సమయానికి పూర్తి కావాలనే ఉద్దేశంతో కోర్టులు జోక్యం చేసుకోవని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం కోర్టును ఆశ్రయించి నామినేషన్ దాఖలకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఆధారాలతో పిటిషన్ వేసినప్పుడు రాజ్యాంగ విలువలకు రక్షకులుగా ఉన్న న్యాయస్థానం మౌనంగా ఉండలేవని పేర్కొంది. ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టడం అత్యంత కీలకమని వెల్లడించింది.

ALSO READ: విజయవాడలో భారీగా బంగారం.. విదేశీ నోట్ల కట్టలు, అధికారులకు చిక్కిన ఐదుగురెవరు? దీని వెనుక

ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అభ్యర్థులు నామినేషన్ వేయలేక పోయిన చోట తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీకి సూచన చేసింది. పార్టీల అభ్యర్థుల నుంచి వచ్చిన వినతిపత్రాలు, సమర్పించిన సాక్ష్యాలను, డిజిటల్/ఎలక్ట్రానిక్ ఆధారాలను ఎస్‌ఈసీ నిశితంగా పరిశీలించాలని తెలిపింది. అభ్యర్థులు నామినేషన్ వేయలేని ప్రాంతాలను గుర్తించి అక్కడ నామినేషన్ల గడువు పొడిగించే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాల అమలుపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. నామినేషన్ గడువు అన్ని చోట్లా పొడిగించడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు.  అభ్యర్థుల తుది జాబితా విడుదలను ఈనెల 25 వరకు పొడిగించింది. నామినేషన్లు గడువు మొత్తంగా వాయిదా, గడువు పొడిగింపుకు నిరాకరించింది సుప్రీంకోర్టు.

Related News

విజయవాడలో భారీగా బంగారం.. విదేశీ నోట్ల కట్టలు, అధికారులకు చిక్కిన ఐదుగురెవరు? దీని వెనుక

సిక్కోలులో టీడీపీకి ఊహించని షాక్.. రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మి, ధర్మాన వ్యూహం సక్సెస్

కార్పొరేషన్లలో లెక్కలు తేలాయి.. ఊపిరి పీల్చుకున్న కూటమి నేతలు, ఎక్కడెక్కడ ఎన్ని?

వైసీపీలో ఏం జరిగింది? జగన్ పులివెందుల టూర్ క్యాన్సిల్? బెంగుళూరు నుంచి విజయవాడకు

చల్లటి కబురు వచ్చేసింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం? కొద్ది గంటల్లో భారీ వర్షాలు

బ్యాంకాక్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?

అక్రమ నగదుపై పోలీసుల నిఘా.. రూ. 42 లక్షలు సీజ్ చేసిన ఆత్మకూరు డీఎస్పీ

Big Stories

Advertisement
×