E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Meena : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. మీనా అవుట్..

Gundeninda Gudigantalu Meena : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. మీనా అవుట్..
Advertisement

Gundeninda Gudigantalu Meena : తెలుగు చానల్స్ వల్ల ప్రసారమవుతున్న కొన్ని సీరియల్స్లలోని హీరోయిన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు.. అలాంటి వారిలో కొంతమంది వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా ఇక్కడ మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు. కేవలం ఒక్క సీరియల్ తోనే తమ నటనతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు.. ఈమధ్య వస్తున్న తెలుగులో ప్రతి సీరియల్ లో కూడా కన్నడ ముద్దుగుమ్మలు ఎక్కువగా ఉంటున్నారు.. అందులో స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరోయిన్ మీనా ఒకరు.. ఈమె తెలుగులో రెండవ సీరియల్ లో నటిస్తుంది. ఈ సీరియల్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న మీనా ఇప్పుడు ఇండస్ట్రీకి దూరమవుతుందంటూ ఓ న్యూస్ నెట్టింట ప్రచారంలో ఉంది. నిన్న మొన్నటి వరకు ఆమె ఇండస్ట్రీకి దూరమవుతుంది అంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు నిజంగానే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతుంది అంటూ నెట్టింట టాక్ నడుస్తుంది.. ఎందుకు మీనా సీరియల్స్ కి దూరమవుతుంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కొత్త సీరియల్ లో నటిస్తున్న మీనా..

గుండెనిండా గుడిగంటలు సీరియల్లో నటిస్తున్న మీనా ఇప్పుడు మరో కొత్త సీరియల్లో నటించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈసారి తెలుగు సీరియల్ కాకుండా కన్నడ సీరియల్ లోని ఈమె నటిస్తుంది. ఆ సీరియల్ కు సంబంధించిన ఫోటోలని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.. అవి కాస్త వైరల్ అవడంతో మీనా తెలుగు సీరియల్ కి గుడ్ బై చెప్పబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందులో నిజం ఎంత ఉంది అన్నది తెలియలేదు కానీ ప్రస్తుతం అయితే మీనా రెస్పాండ్ అయ్యే వరకు ఈ వార్తలు వినిపిస్తూనే ఉంటాయని అర్థమవుతుంది.. ఒకవేళ ఈమె నిజంగానే సీరియల్ కి గుడ్ బై చెప్పేస్తే గుండెనిండా గుడి గంటలు సీరియల్ కూడా శుభం కార్డు వేసుకోవాల్సి వస్తుంది అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు..

Advertisement

Also Read : ‘చామంతి’ మేఘన లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లా.. ఇన్నాళ్లకు బయటపడ్డ సీక్రెట్..

మీనా బ్యాగ్రౌండ్..

మీనా అలియాస్ అమూల్య గౌడ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈమె మొదట మోడల్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది.. తెలుగులో మొదటగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నా కార్తీకదీపం సీరియల్ ద్వారా పరిచయమైంది.. ఇందులో అప్పటి శౌర్య పెరిగి పెద్దయి రౌడీగా మీనా కనిపించింది.. అయితే ఆ సీరియల్ కేవలం కొద్ది రోజులు ప్రకారమైనా సరే ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. రెండవ సీరియల్ గా వచ్చిన గుండె నిండా గుడి గంటలు సీరియల్ మాత్రం హీరోయిన్ గా ఎప్పటికీ చెరిగిపోని పేరుని అందించింది. ఈ సీరియల్ తర్వాత ఈమె రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆమె అసలు పేరు నేను మర్చిపోయి ఎక్కువ మంది మీనా అని గుర్తుపెట్టుకుంటున్నారు.. అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. కన్నడ నటుడైన నిరంజన్ తో ఈ మెయిల్ రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతారు ఏమో చూడాలి..

Advertisement

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

Big Stories

Advertisement
×