E-Paper
Advertisement

టికెట్ గెలుచుకొని వచ్చా.. కప్పు తీసుకొని పోతా.. మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ!

టికెట్ గెలుచుకొని వచ్చా.. కప్పు తీసుకొని పోతా.. మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ!
Advertisement

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు 10 కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే .ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్ లో ఒక్కొక్కరుగా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు .ఇక ఇప్పటికే దెబ్జానీ, త్రిగుణ్ హౌస్ లోకి వెళ్లారు. ఇక మూడవ కంటెస్టెంట్ గా సింగర్ ఝాన్సీ(Singer Jhansi) హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈమె మొదటి కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇక సింగర్ ఝాన్సీ అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి డైరెక్ట్ టికెట్ సాధించి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా అగ్ని పరీక్షలో టికెట్ సాధించి హౌస్ లోకి వచ్చిన తొలి కంటెస్టెంట్ గా సింగర్ ఝాన్సీ నిలిచారు. ఇక ఈమె వేదిక పైకి రాగానే నాగార్జున ఆశీర్వాదం తీసుకున్నారు మీలాంటి గొప్ప వ్యక్తులnu కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

మొదటి కామనర్ గా ఝాన్సీ..

ఇక బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఆమె టాస్కులు అన్నింటినీ ఎంతో సమర్థవంతంగా పూర్తి చేసి ఓటింగ్ ద్వారా ఎంపిక అవ్వడమే కాకుండా టికెట్ కైవసం చేసుకుని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఝాన్సీ టికెట్ కైవసం చేసుకోవడంతో మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటని అడగడంతో వాళ్లకు తనపైన చాలా నమ్మకమని కచ్చితంగా తాను విజయం సాధిస్తానని నమ్మకం వారికుందంటూ ఝాన్సీ తెలిపారు. అనంతరం వేదికపైనే అగ్ని పరీక్షలో తన జర్నీ గురించి ఒక అద్భుతమైన పాటను పాడారు. ఇక బిగ్ బాస్ వేదికపైకి రావడం గురించి ఝాన్సీ ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

ప్రొడ్యూసర్లు గుర్తించాలి..

Advertisement

ఇప్పుడు సింగర్ ఝాన్సీగా ఇప్పుడు తను కొంతమందికి మాత్రమే తెలుసు అయితే ఈ వేదిక ద్వారా తాను కోట్లాదిమందికి తెలియాలని ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లకు సింగర్ గా నేను పరిచయం అవుతాను అంటూ ఈమె తెలిపారు. ఇక నాగార్జున తనని హౌస్ లోకి పంపిస్తూ ఇన్ని రోజులు నాన్నతో పాటు కలిసి పొలం దున్నావు ఇప్పుడు హౌస్ లో ఆటతో దున్నేసేయి అంటూ సింగర్ ఝాన్సీని మూడవ కంటెస్టెంట్ గా తొలి కామనర్ గా హౌస్ లోకి పంపించారు. ఇక సింగర్ ఝాన్సీ రైతు బిడ్డగా అందరికీ ఎంతో సుపరిచితమే ఈమె ఇంస్టాగ్రామ్ వేదిక పెద్ద ఎత్తున పొలం పనులకు సంబంధించిన రీల్స్ చేస్తూ ఎంతో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

కప్పుతోనే బయటకు వెళ్తా..

ఇలా సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఝాన్సీ బిగ్ బాస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈమె హౌస్ లోకి వెళ్ళగానే టికెట్ గెలుచుకొని వచ్చా.. కప్పు తీసుకొని పోతా.. అంటే చాలా కాన్ఫిడెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి ఝాన్సీ హౌస్ లో అందరితో పోరాటం చేసి కప్పు తీసుకుని హౌస్ నుంచి బయటకు వస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: ఇక ఆట షూర్.. బిగ్ బాస్ 10 హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్!

Related News

డిగ్రీలో 5 సబ్జెక్టులు ఫెయిల్.. సింగపూర్ లో హౌస్ కీపింగ్ జాబ్.. . సుధీర్ రెడ్డి స్టోరీ ఇదే!

ఇక ఆట షూర్.. బిగ్ బాస్ 10 హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్!

అదిరిపోయిన బిగ్ బాస్ 10 హౌస్.. మ్యాజిక్ కీతో ఆటను మలుపు తిప్పిన నాగార్జున!

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Big Stories

Advertisement
×