E-Paper
Advertisement

రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు సీఎం రేవంత్ ప్రవేశపెట్టే కీలక నివేదికలివే?

రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు సీఎం రేవంత్ ప్రవేశపెట్టే కీలక నివేదికలివే?
Advertisement

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని ప్రభుత్వాదికారుల తెలిపారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎనిమిదో సెషన్‌లో రెండో సమావేశాలు జరగనున్నాయి. సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాలు (క్వశ్చన్ హౌర్) జరగనుంది.

మూడు కీలక నివేదికలు..

అయితే ఈ సారి సభ ముందుకు మూడు కీలక నివేదికలు పెట్టనున్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష (TSS) 2024-25 ఆడిట్ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటుగా ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SHRI) తెలంగాణ 2024-25 ఆడిట్ నివేదికను సభ ముందుకు తీసుకురానున్నారు. TSS, PM SHRI ఆడిట్ నివేదికలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్గదర్శకాల ప్రకారం సభలో ప్రభుత్వం ఉంచనుంది.

Advertisement

Also read: నకిలీ హిజ్రా మాఫియా పై డీజీపీ ఉక్కుపాదం.. సంచలన ఆదేశాలు జారీ!

హైదరాబాద్ మెట్రో రైల్..

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు సంబంధించిన ఐదు వార్షిక నివేదికలను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నట్టు సమారం. దీంతో పాటుగా 2013-14 నుంచి 2017-18 వరకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ వార్షిక నివేదికలు సభ ముందు ప్రవేశ పెట్టనున్నారు. కంపెనీల చట్టం-2013లోని సెక్షన్ 395 ప్రకారం హైదరాబాద్ మెట్రో వార్షిక నివేదికల సమర్పణ చేయనున్నారు.

Advertisement

Also read: అదిరిపోయిన బిగ్ బాస్ 10 హౌస్.. మ్యాజిక్ కీతో ఆటను మలుపు తిప్పిన నాగార్జున!

Tags

Related News

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సు, మెట్రోకు ఒకే పాస్!

హోం మంత్రి మన రేవంతన్నే.. పబ్ రచ్చపై ఆర్ఎస్పీ సెటైర్లు !

మీ కోడళ్లకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా.. డీజీపీ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!

అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

3 ఏళ్ల బాబు మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్ చేసింది వాళ్లే

నకిలీ హిజ్రా మాఫియా పై డీజీపీ ఉక్కుపాదం.. సంచలన ఆదేశాలు జారీ!

తల్లి పదవి పోయిందని సుస్మిత ఏడుపు.. సీఎం రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×